కొమురం భీమ్ సాహసం, త్యాగాలకు ప్రతీకగా కొమురం భీమ్ ప్రజల మనసుల్లో కలకాలం గుర్తుండిపోతాడు, "అల్, జంగల్, జమీన్" (నీరు, అడవి. భూమి) అంటూ వివదించిన తొలి గిరిజన పోరాట యోధుడు ఆయన ఇటు హైదరాబాద్ నిజాంకు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఆయన ఒంటరి పోరాటం చేపట్టారు. వారిపై గెరిల్లా పోరాటం చేశారు. గోండు తెగ వారు కొమురం భీమ్ ను సుమారు భగవంతునిగానే ఆరాధిస్తారు. తిరుగుబాటు, ప్రతిఘటనలకు ప్రతీకగా నిలిచిన భీమ్ కోట్లాది మంది హృదయాలపై చెరగని ముద్ర వేశారు. జననం: అక్టోబర్ 22, 1901మరణం: అక్టోబర్ 8, 1940 పాలకుల క్రౌర్యానికి, దోపిడీకి వ్యతిరేకంగా జీవిత పర్యంతం పోరాటం సాగించిన యోధుడు కొమురం భీమ్.. నేటికీ గిరిజన తెగల వారు ఆయనను దేవునిగా ఆరాధిస్తారు. తెలంగాణలోని ప్రస్తుత కొమురం భీమ్ జిల్లాలో సంకేపల్లి గ్రామంలో గోండు తెగకు చెందిన గిరిజన కుటుంబంలో 1901 అక్టోబర్ 22వ తేదీన కొమురం భీమ్ జన్మించారు. ఇటు నిజాం పాలకుల ఆటు బ్రిటిష్ పాలకుల అణచివేత విధానాలపై ఆయన అలుపెరుగని పోరాటం చేపట్టారు. "జమీందారు" (భూస్వామి) చేస్తున్న దురాగతాలను వ్యతిరేకించిన భీమ్ తన గ్రామాన్ని బలవంతంగా విడిచిపెట్టాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆయన అస్సాంలోని తేయాకు తోటలకు చేరారు. అక్కడ తేయాకు తోటల కార్మికుల కష్టాలు కళ్లారా చూశారు. అప్పుడే ఆయన తన చుట్టూ జరుగుతున్న పలు ఉద్యమాల నుంచి స్ఫూర్తిని పొందారు. చదవడం, రాయడం నేర్చుకున్నారు. వ్యవస్థీకృత పోరాటం ఒక్కటే అన్యాయాన్ని ఎదిరించే శక్తిమంతమైన ఆయుధమని గుర్తించారు. ప్రజలందరినీ మేల్కొలిపి, ఐక్యం చేయాలన్న సంకల్పంతో ఆయన తిరిగి తన గ్రామానికి చేరారు. 1926 నుంచి 1940 సంవత్సరాల మధ్య కాలంలో నిజాం పాలనకు వ్యతిరేకంగా మడమ తిప్పని గెరిల్లా పోరాటం సాగించారు. తన సైనికులకు విల్లులు, బాణాలు, బల్లాలను మించిన ఆయుధాలు అందించారు. సాంప్రదాయిక ఆయుధాలతోనే పోరాటం చేస్తున్నప్పటికీ వారు తగినంత సంఖ్యలో ఆధునిక ఆయుధాలున్న నిజాం సేనలను దీటుగా ఎదుర్కోగలిగారు, భీమ్ గ్రామ గ్రామానికి వెళ్లి తమపై జరుగుతున్న దురాగతాలకు వ్యతిరేకంగా ఉద్యమించేలా ప్రజలను కూడగట్టారు. గ్రామాల్లో పన్నులు వసూలు చేసేందుకు నిజాం సేనలు గ్రామాలకు వచ్చిన పలు సందర్భాల్లో భీమ్, ఆయన సైన్యం వారిని తరిమి కొట్టారు. అల్లూరి సీతారామరాజు ప్రభావం ఆయనపై పడిందని అందరూ విశ్వసిస్తూ ఉంటారు. 1940 అక్టోబర్ 8వ తేదీన అశ్వినీ పూర్ణిమ రోజున దేశ రక్షణ సంకల్పంతో సాహసోపేతమైన పోరాటం చేస్తున్న సమయంలో నిజాం సేనలు ఆయనను మోసపూరితమైన విధానాలతో తుదముట్టించాయి. 2016వ సంవత్సరంలో అసిఫాబాద్ జిల్లాకు కొమురం భీమ్ జిల్లాగా నామకరణం చేశారు. అక్కడ ఒక స్మారకం, కొమురం భీమ్ మ్యూజియం ఏర్పాటు చేశారు. ప్రతీ ఏడాది ఆశ్వయుజ పూర్ణిమ వాడు గోండు తెగ వారు భీమ్ వర్ధంతిగా పాటిస్తారు. 1940 సంవత్సరంలో కొమురం భీమ్ అశువులు బాసిన ప్రదేశం జోడేఘాట్ లో ఈ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటారు. కొమురం భీమ్ ఎక్కువ కాలం జీవించలేదు. కేవలం 40 సంవత్సరాలు మాత్రమే జీవించినా ఆయన తన జీవితకాలంలో కోట్లాది మంది ప్రజలు ప్రత్యేకించి గిరిజన తెగల ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. నిజాంకు వ్యతిరేక పోరాటం సాగించే వారిలో నూతన శక్తిని నింపారు. నిజాం పాలనకు ప్రధాన సవాలుగా నిలిచారు. 1940 సంవత్సరంలో నిజాం సీనలు ఆయనను తుదముట్టించాయి. ఆయన జీవితం నుంచి వీలైనంత స్పూర్తి ని పొంది నేటి యువత ఎంతో నేర్చుకోవాలి. ఆధారం: న్యూ ఇండియా సమాచార్