పిల్లలతో కథలు రాయించడం ఎలా? కథలు తెలియని వాళ్ళు ఉండరు. కథ మనల్ని ఒక ఊహా ప్రపంచం వైపుకు తీసుకెళ్తుంది. కొత్త ఆలోచనలు రేకెత్తిస్తుంది. సమస్యకు సమాధానం అవుతుంది. సృజనను పెంపొందిస్తుంది. నిర్మాణాత్మక సామర్థ్యాన్ని పెంపొందిస్తుంది... మరి ఇంతటి ఉపయోగకరమైన కథల్ని పిల్లలచే రాయిస్తే.... వాళ్ళు మన మధురమైన తెలుగు భాషను మరో తరానికి తరలింపచేస్తారు.... మరెందుకు ఆలస్యం కథ రాయడంలో మెళుకువలు తెలుసుకుందాం? సెలవుల్లో పిల్లలతో రాయించే ప్రయత్నం చేద్దాం. కథ రాయడానికి ప్రోత్సహించే మార్గాలు ప్రశ్నలతోప్రారంభించండి. "ఒక అడవిలో ఒక జంతువు ఒంటరిగా ఉంటే ఏమవుతుంది?" "ఒక వింతైన వస్తువు దొరికితే ఏం చేస్తావు?" "నీకు ఒకసూపర్ పవర్ వస్తే ఏం చేస్తావు?" "మన పాఠశాల లో మెగా టీచర్ పేరెంట్స్ డే జరగకపోతే ఎలా ఉంటుంది? జరిగితే ఎలా ఉంటుంది? ఇలాంటి ప్రశ్నలు పిల్లల్లో ఆలోచనలు రేకెత్తింప చేస్తాయి. చిత్రాలు చూపించాలి వివిధ చిత్రాలను చూపించి, వాటి గురించి కథలు అల్లమని చెప్పాలి. ఒక చిత్రం చూపి, దాని గురించి కథ రాయమని అడగాలి. కథాప్రారంభాలు ఇస్తే బాగుంటుంది. ఒకరోజు ఉదయం, నేను ఒక వింత శబ్దం విన్నాను..." "ఒక అడవిలో ఒక చిన్న కుందేలు..." "ఒక రాజు, ఒక రాణి..." స్నేహితులతో కలిసి రాయడం: పిల్లలను జంటలుగా లేదా చిన్న సమూహాలుగా చేసి, కలిసి కథలు రాయమని చెప్పాలి. ప్రోత్సహించడం గొప్ప ఫలితాలు ఇస్తుంది. వారి కథలను మెచ్చుకోండి. వారి ఊహలను ప్రోత్సహించండి. తప్పులను సరిదిద్దడానికి సహాయం చేయండి. పిల్లల తప్పులను సున్నితంగా సరి చేయాలి. చాలా బాగా రాశావు అని మెచ్చుకుంటూనే....... పిల్లల తప్పుల్ని సవరించాలి. కథ ఎలా రాయాలి? ప్రారంభం కథలోని పాత్రలను, స్థలాన్ని పరిచయం చేయండి. కథలోని సమస్యను లేదా సంఘటనను చెప్పండి. మధ్యభాగం పాత్రలు సమస్యను ఎలా పరిష్కరించడానికి ప్రయత్నిస్తాయో వివరించండి. ఆసక్తికరమైన సంభాషణలు జోడించండి. ఊహకు తగ్గట్టుగా కథను కొనసాగించండి. ముగింపు సమస్య ఎలా పరిష్కరించబడిందో చెప్పండి. కథ నీతిని చెప్పండి. నేర్చుకునే విధానం చదవడం పిల్లలకు ఎక్కువ కథలు చదివి వినిపించండి. వారికి నచ్చిన కథలను చదవడానికి ప్రోత్సహించండి. రాయడం పిల్లలను ప్రతిరోజూరాయడానికి ప్రోత్సహించండి. వారికి నచ్చిన విషయాల గురించి రాయమని చెప్పండి. సృజనాత్మకత వారి ఊహలను స్వేచ్ఛగా వదలండి. వారి కొత్త ఆలోచనలను ప్రోత్సహించండి. చిన్న పదాలతో కథ ఒక ఊరిలో రాజు వున్నాడు. రాజుకు ఒక తోట ఉంది. తోటలో ఒక పక్షి ఉంది. పక్షి పాటలు పాడుతుంది. రాజు పాటలు వింటాడు. ఒకరోజు, పక్షి పోయింది. రాజు బాధపడ్డాడు. ఒక పిల్లవాడు పక్షిని తెచ్చాడు. రాజు సంతోషించాడు. కథ లో ఏమేమి జరిగాయి? అని మళ్ళీ చర్చ జరపచ్చు. ఆసక్తికరమైన సంభాషణలు "నువ్వు ఎక్కడికి వెళ్ళావు?" రాజు అడిగాడు. "నేను అడవికి వెళ్ళాను," పక్షి చెప్పింది. "అడవిలో ఏం చూశావు?" రాజు అడిగాడు. "నేను చాలా జంతువులను చూశాను," పక్షి చెప్పింది. సినిమా తరహాలోకూడా ఆలోచింప చేయవచ్చు. సృజనాత్మకత: పిల్లల ఊహలను ప్రోత్సహించడం, కొత్త ఆలోచనలు ప్రయత్నించడం వలన వారి సృజనాత్మకత పెరుగుతుంది. పిల్లలు కథలు రాయడం ద్వారా వారి ఆలోచనలు, భావాలు స్పష్టంగా వ్యక్తమవుతాయి. వారి సృజనాత్మకతను ప్రోత్సహించడం ద్వారా వారి భవిష్యత్తును ఉజ్వలంగా తీర్చిదిద్దవచ్చు. నేను నా పాఠశాల పిల్లలతో కథలు రాయిస్తున్నాను. మీరూరాయించండి! ఆధారం: మన బడి మాస పత్రిక