మకుటం లేని మహారాజు జూలకల్ ఒక ఊరు. ఆ ఊరిలో రాజు అనే ఒక పిల్లవాడు ఉన్నాడు. తన వయసు పది సంవత్సరాలు, వాళ్ళు తల్లిదండ్రులు పని చేయలేరు. అందుకని ఆ భారాన్ని తన భుజాల వేసుకున్నాడు. వాళ్ళకి పొలం లేదు. అంత చిన్న వయసులోనే తాను ఆ భారాన్ని తన భుజాల మీద వేసుకొని తన రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడి పనిచేసేవాడు. తనకు 25 వెళ్ళు రాగానే 40 ఎకరాల పొలం కొన్నాడు. ఒక పెద్ద ఇల్లు. 6 ఎద్దులు, 10 ఆవులు, 12 గేదేలు, 40 గొర్రెలు సంపాదించాడు. ఊళ్ళో వాళ్ళు రాజుని చూసి ఆశ్చర్యపడ్డారు. గౌరవం, మర్యాద, పేరు, ప్రతిష్టలు సంపాదించు కున్నాడు. అప్పటి నుండి తనని అందరూ "రాజన్న" అని పిలిచేవారు. తీర్పులు చెప్పేవాడు. అతన్ని నమ్మి వచ్చిన వారికి కాదనకుండా సహాయం చేసేవాడు. ఎవరికైన డబ్బు అవసరం అయితే కాదనకుండా ఇచ్చేసేవాడు. మాట ఇస్తే తప్పుడు. రాజన్నకు పెళ్లి అయ్యింది. తన భార్య వాళ్లకు ఒకతే కూతురు. వాళ్ళ "కూతురు పేరు మీద ఉన్న పొలం రాసిస్తాం అన్నా తీసుకోలేదు. ఒకరి ఆస్తి నాకు అక్కర్లేదు "అన్నాడు. రాజన్నకు నలుగురు కొడుకులు. తాను పడ్డ కష్టం తన కొడుకులు పడకూడదని బాగా చూసు కున్నాడు. మళ్ళా 20 వికరాల పాలం కొన్నాడు. తన కొడుకులను చదివించాలనుకున్నాడు. పెద్దవాడు, రెండేవాడు కొంతవరకు చదువు కున్నారు. మూడేవాడు చదువు కోలేదు. నాలుగవ వాడు Police job తెచ్చుకున్నాడు. నలుగురికి పెళ్ళిల్లు చేసాడు. తన కోడళ్ళకు కూడా కట్నం తీసుకోలేదు. కోడళ్ళను కూతుళ్ళులా చూసుకున్నాడు. తన ఇంటికి ఎవరైనా వస్తే తానే అన్నం వండించి మరీ పెట్టేవాడు. అంతటి ధర్మధాత. ఇంటి బాధ్యతలు పెద్దకొడుకుకి అప్పగించాడు. రాజన్న లాగే పెద్దకొడుకు కూడా దానాలు, ధర్మాలు చేసేవాడు. పదిమందికి అన్నం పెట్ట ఆదుకునేవాడు. తమ్ముల్లు కూడా అన్న మాట జవదాటేవారుకాదు. వాళ్ళని చూసి కొంతమంది ఓర్వలేకపోయారు. ఎలాగయిన ఎలాగయిన వాళ్ళని విడగొట్ట ఆస్తి అంతస్థులను నాశనం చేయాలనుకున్నారు. పెద్దవాడికి స్నేహితులు పక్కన చేరి తన డబ్బుతోనే తిని అతన్ని తాగుడుకి అలవాటు చేసారు. అతడితో అప్పులు చేయించారు. తనకు గుర్తులేనప్పుడు మళ్ళా ఆ డబ్బును వాళ్ళే కొట్టేసేవారు. మూడో కొడుకు తన అన్నని గమనించి రాజన్నతో చెప్పాడు. నాన్న నిలదీస్తే అప్పుల విషయం బయటపడింది ." ఆ డబ్బు అంత ఏం చేసావు" అన్నాడు. ఏమీ చెప్పలేకపోయాడు. "అప్పుల విషయం మీకెందుకు నాన్న. ఆ బాధ్యత నాది అన్నాడు." రాజన్న చాలా బాధపడ్డాడు. తాగుడుకి అలవాటుపడి పంటలు పట్టించు కోకుండా తిరిగేవాడు. పంటలు సరిగపండ లేదు. దాంతో రాజన్న ఆస్తిపంపకాలు చేసాడు. తన ఇద్దరు తమ్ముళ్ళు ఎంత చెప్పినా వినకుండా తాగి తిరిగేవాడు పెద్దవాడు. దాంతో తమ్ములు ఎదురు తిరిగారు. తమ్ముళ్ళతో గొడవపడి" నా ఆస్తి. నా అప్పు మీకెందుకు మధ్యలో" అని గొడవపడ్డాడు. తమ్ముళ్ళతో మాట్లాడటం మానేసాడు. పంటలు పండలేదు. చేతిలో డబ్బు లేవు. అప్పుల వాళ్ళ ఇంటికి వచ్చారు. నానా మాటలు అన్నారు. "అది చూసి రాజన్న ఒకరితో మాటపడకుండా బ్రతికి ఇప్పుడు ఇలాంటి పరిస్థితి వచ్చింది" అని ఎంతో బాధపడ్డాడు. పెద్ద కొడుకు పొలాన్ని అమ్మకానికి పెట్టాడు. 'అది చూసి నేను కష్టపడి సంపాదించిన ఆస్తి మొత్తం పోతుంది' అని బాధపడ్డాడు. ఆ బాధలో గుండెనొప్పి వచ్చి చనిపోయాడు రాజు. కొడుకులు, కోడళ్ళు, తన భార్య గుండెలు పగిలేలా ఏడ్చారు. పెద్దవాడు తన భాగం మొత్తం అమ్మివేసాడు. -అయిన అప్పు తీరలేదు. తన స్నేహితులు. కూడా అందరిలో చేరి అతన్ని పంచాయితికి తీసుకెళ్లారు. అక్కడ తనకు ఘోరమైన అవమానం జరిగింది. వాళ్లే తీర్పులు చేప్పేవారు. కాని ఇప్పుడు వాళ్ళకే అలాంటి పరిస్థితి వచ్చింది. తన ముగ్గురు తమ్ముల్లు వాళ్ల భాగాన్ని అమ్మివేసి అన్నకు ఆ డబ్బు ఇచ్చారు. అప్పులు కట్టేశాడు. "ఇన్ని రోజులు మోసాగాళ్ళను స్నేహితులు అనుకుని మిమ్మల్ని దూరం చేసుకున్నాను" అని చాలా బాధపడ్డాడు, వాళ్ళ ఇంటిని అమ్మి వేసి -అప్పులు కట్టేశాడు.. మొత్తం 60 ఎకరాల పాలం అమ్మివేశారు. రాజన్న బ్రతికి ఉన్నన్ని రోజులు ఆస్తి తనతోనే ఉంది. తను వెళ్లిపోగానే ఆస్తి కూడా వెళ్లిపోయింది. 40,50 మంది పనివాళ్ళ పనిచేయించుకునే వాళ్ళు. అలాంటిది ఇప్పుడు వాళ్లే ఒకరి దగ్గర పని చేయాల్సి వచ్చింది. వాళ్ళ ఊరును వదిలి వెళ్లిపోయారు. వారి బాధకు అంతం లేదు. చెడు స్నేహితులను నమ్మి వారితో స్నేహం చేస్తే చెడు అలవాట్లే వస్తాయి. దానితో జీవితం నాశనం అవుతుంది. ఆధారం: మన బడి మాస పత్రిక