రామయ్య తన టెంకాయతోటలో కాయలు దింపేందుకు పని వాళ్లను పిలిపించారు. పనివాళ్ల టీంకు లీడరు కృష్ణయ్య. ఆటీంలో సెల్‌ఫోను ఉండేది అతని ఒక్కడి దగ్గరే. కృష్ణయ్య పనిచేస్తూనే సెల్‌ఫోన్‌తో మాట్లాడుతూ కొత్త పనులు ఒప్పుకుంటూ ఉంటాడు. ఆ రోజు రామయ్య తోటలో కృష్ణయ్య తన తోటివారికి పని పురమాయిస్తూ, చకచకా టెంకాయ చెట్లు ఎక్కుతూ టెంకాయలు దింపుతూ పనిచేస్తున్నాడు. మధ్యలో ఫోను రింగవుతుంటే చెట్టు పైనే వాటికి సమాధానం ఇస్తూ పని కొనసాగిస్తున్నాడు. సాయంత్రం అయింది. కృష్ణయ్య టీం పని నుండి దిగి రామయ్య దగ్గరకు వెళ్లి సెలవు తీసుకుంటూ, కృష్ణయ్య “అయ్యా రేపు ఆదివారం మాకు సెలవు. సోమవారం మా ఊర్లో తిరణాలు, పనిలోకి రాలేము. కాబట్టి మంగళవారం మా టీం తిరిగి పనిలోకి వస్తుంది” అని చెప్పాడు. కృష్ణయ్య వాళ్లు వెళ్లిపోయినాక రాతి రామయ్య, భార్య కనకమ్మ భోజనం చేస్తూ ఉన్చారు. బయట ప్రశాంతంగా నిశ్శబ్దంగా ఉంది. ఉన్నట్లుండి తోటలో చిన్న పిల్లవాడి ఏడుపు గట్టిగా వినిపించింది. ఇద్దరూ ఉలిక్కిపడి బయటకు వచ్చి చూశారు. కొబ్బరి చెట్లపై ఓ చోట ఏదో వెలుగు మిణుకుమంటూ చిన్న పిల్లవాడి ఏడుపు వినిపిస్తోంది. వెంటనే కాసేపయ్యాక ఆగిపోయింది. 10 ని॥ల తరువాత మరల ఏడుపు ఆరంభమై నాలుగుసార్లు వినిపించి ఆగిపోయింది. వెలుగు ఆగిపోయింది. రామయ్య దంపతులకు భయం పట్టుకుంది. రామయ్య వెంటనే టౌన్లో ఉన్న తన బావమరిది సుబ్బయ్యకు ఫోన్ చేసి విషయం చెప్పాడు. సుబ్బయ్య, ఇదేదో తప్పకుండా దెయ్యం పని ఉంటుంది. ఉదయం మంత్రగాడిని పిలుచుకుని రేపు వస్తాను అని చెప్పాడు. రాత్రి 11.00 గంటల వరకు పిల్లవాడి ఏడుపు ఆగి ఆగి వినిపిస్తోంది. రామయ్య దంపతులు రాత్రంతా నిద్రపోకుండా బిక్కుబిక్కుమని గడిపారు. ఉదయాన్నే మరలా 5 గం॥ల నుండి మరలా ఆ ఏడుపు మొదలయ్యింది. 7 గం॥ సుబ్బయ్య మంత్రగాడిని వెంటబెట్టుకుని వచ్చాడు. వాళ్ళూ ఆ ఏడుపు విన్నారు. మంత్రగాడు “ఇది ఖచ్చితంగా దెయ్యం పనే మీరేమి భయపడవద్దు. ముగ్గువేసి, హోమం చేసి దిగ్భంధనం చేస్తాను. దెబ్బకు దెయ్యం పారిపోతుంది” అని తతంగం మొదలు పెట్టాడు. జలం ఇల్లంతా చల్లాడు. ఈ మొత్తం ప్రక్రియ సాయంత్రం వరకు జరిగింది. మంత్రగాడు మరలా ఓ గంటసేపు అక్కడే ఉన్చాడు. ఏడుపు వినిపించలేదు. పూర్తిగా ఆగిపోయింది. రామయ్య దంపతులకు భయం పోయింది. మంత్రగాడికి బాగా డబ్బులు, కొత్త పంచెలు ముట్ట చెప్పారు. మంత్రగాడు వెళ్లిపోయాడు. అలా ఆదివారం గడిచిపోయింది. సోమవారం కూడా గడిచిపోయింది. పిల్లవాడి ఏడుపు వినిపించలేదు. రామయ్య, కనకమ్మ హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. మంగళవారం కృష్ణయ్య టీం పనిలోకి వచ్చింది. వచ్చీ రావడంతోటే కృష్ణయ్య గబగబ 6వ చెట్టు ఎక్కి దిగి సంతోషంగా రామయ్య దగ్గరకు వచ్చాడు. కృష్ణయ్య పోయిందనుకున్న నా సెల్‌ఫోన్ దొరికింది చెట్టుపైన” అన్నాడు. “ఈ సెల్ చార్జింగ్ అయిపోయి స్విచ్ ఆఫ్ అయింది. మీ దగ్గర చార్మరు ఉంటే చార్జింగ్ పెట్టుకుంటాను” అన్నాడు. “దానికేం భాగ్యంరా ఆడే ఉంది చూడు చార్జరు” అని రామయ్య స్విచ్బోర్ట్ చూపాడు. సెల్‌ను చార్జింగ్ పెట్టి కృష్ణయ్య చార్జింగ్ అయిన సెల్‌ను స్విచ్ ఆన్ చేసాడు. వెంటనే ఓ ఫోన్ కాల్ వచ్చింది. ఇంటిలోపల ఉన్న రామయ్య కనకమ్మలకు మరలా పిల్లవాడి ఏడుపు వినిపించింది. ఇద్దరూ అదిరిపడి కంగారుగా బయటకు వచ్చారు. బయట కృష్ణయ్య సెల్ఫోన్లో మాట్లాడుకుంటూ కనిపించాడు. ఇద్దరినీ చూసి ఫోన్ ఆఫ్ చేశాడు. కనకమ్మ గట్టిగా “ఇక్కడ ఇప్పుడే ఓ పిల్లవాడి ఏడుపు వినిపించింది. నీవు విన్చావా?” అనింది. కృష్ణయ్య “అదా అమ్మా.. అది నా సెల్‌ఫోన్ రింగ్‌టోన్ అమ్మా. నా పెళ్ళానికి ఇష్టం అని పిల్లవాడి ఏడుపు రింగ్‌టోన్ పెట్టుకున్నానమ్మా. శనివారం మీ పనికాడ నుండి వెళ్లిపోయినాక నా సెల్‌ఫోన్ కానరాక మా బామ్మర్ది ఫోన్ నుండి చాలా సార్లు ఫోను చేసాడట. ఆదివారం కూడా ఉదయం 5 గం!!ల నుండే నా ఫోన్‌కు చాలా సార్లు ఫోన్ చేసానమ్మా, ఆదివారం సాయంత్రానికి చార్జింగ్ అయిపోయి స్విచ్ ఆవ్ అయిపోయింది. ఈడ దొరికింది కదా. చార్జింగ్ పెట్టి ఇప్పుడే ఆన్ చేస్తా మొదటి కాల్ వచ్చింది. అదే మీరు విన్చారు” పిల్లాడు లేడు. ఏడుపు లేదు. అన్చాడు. రామయ్య, కనకమ్మలు మొహం మొహం చూసుకున్నారు. సెల్‌ఫోన్ రింగ్‌టోన్‌కు ఎలా భయపడింది తలుచుకుని సిగ్గుపడ్డారు. చెట్టుపై వెలుగు ఆ సెల్‌ఫోన్ లైటు అని అర్థం అయింది. సిగ్గుపోయి కోపం వచ్చింది. ఆ మంత్రగాడిపైన. తమ భయాన్ని అలుసుగా చేసుకుని మంత్రాలు, మాయలు పేరిట ఎంత డబ్బు గుంజాడో అర్థం అయింది. ఆ మంత్రాలు, మాయలు అంతా బూటకమని తెలుసుకున్నారు. వెంటనే సుబ్బయ్యకు ఫోన్ చేసి జరిగిన తతంగమంతా వివరించారు. సుబ్బయ్య మంత్రగాడి దగ్గర డబ్బులు వసూలు చేసే పనిలో పడ్డాడు. (జరిగిన కథ ఆధారంగా) ఆధారం : Vigyan Prasar