తెలంగాణ రాష్ట్ర రెసిడేన్షియల్ జూనియర్ కాలేజీలలో ప్రవేశం కొరకు టియస్.ఆర్.జె.సి. – సెట్ - 2015(TSRJC - CET - 2015) తెలంగాణ రాష్ట్ర రెసిడేన్షియల్ జూనియర్ కాలేజీలలో 2015-16 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రవేశం కొరకు తేది. 10-5-2015 జరుగు TSRJC - CET- 2015 (ప్రవేశ పరీక్ష)కు 10 వ తరగతి (మర్చి 2015) పరిక్షకి హాజరౌతున్న తెలంగాణ 10 జిల్లాల విద్యార్థులనుండి ఆన్ లైన్ ద్వార దరకాస్తులు కోరబడుచున్నవి. అర్హత: విద్యార్థులు తెలంగాణా కి చెందినా వారై ఉండాలి విద్యార్థులు పదవ తరగతిలో జి.పి.ఎ 6, BC, SC , ST విద్యార్థులకు జి.పి.ఎ. 5 మరియు జి.పి.ఎ. 4 ఇంగ్లీష్ లో అందరికి వచ్చి ఉండాలి. ఒకే సారి పరీక్షా రాసి (మార్చి / ఏప్రిల్) లో ఉత్తీర్ణులై ఉండాలి. పూర్వ సంవత్సర విద్యార్థులు అర్హులు కారు. మొత్తం కళాశాలలు: 4 జనరల్ జూనియర్ కళాశాలలు (ఇంగ్లీష్ మీడియం MPC, BPC మరియు MEC గ్రూపులు) బాలుర కొరకు: తెలంగాణ గురుకుల జూనియర్ కళాశాల, సర్వేల్, నల్గొండ జిల్లా బాలికల కొరకు: తెలంగాణ గురుకుల జూనియర్ కళాశాల, హసన్ పర్తి, వరంగల్ జిల్లా మైనారిటి జూనియర్ కళాశాలలు (ఉర్దూ మరియు ఇంగ్లీష్ మీడియం MPC, BPC మరియు CEC గ్రూపులు) మైనారిటి బాలుర కొరకు: తెలంగాణ గురుకుల జూనియర్ కళాశాల, ఎల్.బి.నగర్, నాగోలు, హైదరాబాద్ జిల్లా తెలంగాణ గురుకుల జూనియర్ కళాశాల, నాగారం, నిజామబాద్ జిల్లా ముఖ్యమైన తేదీలు: TSRJC -CET -2015 అన్ లైన్ దరకాస్తుల దాఖలు. తే.ది. 23-03-2015 నుండి 18-04-2015. పరీక్షా తేది : 10-05-2015 (ఉ. 10 గం. నుండి 12.30 ని. వరకు) దరఖాస్తు రుసుము : రు. 150. దరఖాస్తు చేయు విధానము కొరకు ఇక్కడ క్లిక్ చేయండి. మరిన్ని వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి. ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర రెసిడేన్షియల్ జూనియర్ కాలేజీలలో ప్రవేశం కొరకు ఏపి.ఆర్.జె.సి. – సెట్ - 2015(APRJC - CET - 2015) ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర రెసిడేన్షియల్ జూనియర్ కాలేజీలలో 2015-16 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రవేశం కొరకు తేది. 10-5-2015 జరుగు APRJC - CET- 2015 (ప్రవేశ పరీక్ష)కు 10 వ తరగతి (మర్చి 2015) పరిక్షకి హాజరౌతున్న ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర జిల్లాల విద్యార్థులనుండి ఆన్ లైన్ ద్వార దరకాస్తులు కోరబడుచున్నవి. మొత్తం కళాశాలలు: 10 అర్హత: విద్యార్థులు ఆంద్ర ప్రదేశ్ కి చెందినా వారై ఉండాలి. విద్యార్థులు పదవ తరగతిలో జి.పి.ఎ 6, BC, SC , ST విద్యార్థులకు జి.పి.ఎ. 5 మరియు జి.పి.ఎ. 4 ఇంగ్లీష్ లో అందరికి వచ్చి ఉండాలి. ఒకే సారి పరీక్షా రాసి (మార్చి / ఏప్రిల్) లో ఉత్తీర్ణులై ఉండాలి. పూర్వ సంవత్సర విద్యార్థులు అర్హులు కారు. ముఖ్యమైన తేదీలు: APRJC -CET -2015 అన్ లైన్ దరకాస్తుల దాఖలు తే.ది. 23-03-2015 నుండి 17-04-2015. పరీక్షా తేది : 7-05-2015(ఉ. 10 గం. నుండి 12.30 ని. వరకు) దరఖాస్తు రుసుము : రు. 150. దరఖాస్తు చేయు విధానం (ఇంగ్లీష్) కొరకు ఇక్కడ క్లిక్ చేయండి. మరిన్ని వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి. ఆధారము : ఏ.పి. రెసిడెన్షియల్