హాలో చిల్డ్రన్ .... ఏంటి సెలవు రోజులను ఎలా గడపాలా అని తీవ్రంగా ఆలోచిస్తున్నట్లుంది. మరి అంతలా ఆలోచించకండి! అసలే వేడి రోజులు. మీ బుర్ర ఇంకా వేడెక్కుతుంది. అంటే దానర్ధం ఆలోచించొద్దని కాదు నా అభిప్రాయం . కాసేపు మీ ఆలోచనను పక్కన పీట్టి అంకెల మామయ్య చెప్పే గణిత గమ్మత్తులను నేర్చుకోండి. రెడినా........ మీ మిత్రులతో ఒక ఛాలెంజ్ చెయ్యండి. వరుసగా వున్న పడి సంఖ్యల మొత్తాన్ని క్యాలిక్యులెటర్ కంటే ముందే చేస్తానని. ఏంటి నమ్మలేకపోతున్నారా? రెండవ తరగతి స్టూడెంట్ కి. చెప్పనా మరి! మీ మిత్రున్ని ఎవరినైనా పిలిచి ఏదైనా ఒక సంఖ్యలో మొదలు పెటి అక్కడి నుండి 9 సంఖ్యతో అంటే దాన్తో కలిపి పది సంఖ్యలుండాలన్న మాట – ఉ.15 నుండి 24 వరకు 37 నుండి 46 వరకు, 83 నుండి 92 వరకు అనుకోమని చెప్పండి. 15 37 83 16 38 84 17 39 85 18 40 86 19 41 87 20 42 88 21 43 89 22 44 90 23 45 91 24 46 92 ఇప్పడు ఆ పది సంఖ్యల మొత్తాన్ని కుడి పెట్టుకోమని చెప్పండి. అంటే 15 నుండి 24 వరకు అన్ని సంఖ్యలను కుడాలన్న మాట. ఇందంతా అయిపోయిన తర్వాత మీకు ఆ సంఖ్యలను తర్వాత మీకు ఆ సంఖ్యలను పై నుండి క్రిందకు ఒకటోకటి చెప్పకుంటూ వెళ్లమనండి. 15,16,17,18,19,............24 అని వాళ్ళు చెబుతూ ఉంటె మీరు శ్రద్ధగా వింటూ చివరి సంఖ్య చెప్పిన వెంటనే ఆ మొత్తాన్ని చెప్పండి! ఎలాగంటారా? క్లూ ఏమిటంటే పై నుండి వారు చెప్పుతున్న సంఖ్యలను శ్రద్ధగా వినండి. అందులో ఐదవ సంఖ్య ఏమిటో గుర్తు పెట్టుకోండి. దాని ప్రక్కన 5 పెట్టి చెప్పండి . అర్ధంకాలేదా? 15 నుండి 24 లో ఐదవ సంఖ్య ఏది? 19 కదా దీని పక్కన 5 చేరిస్తే 195. ఇదే గదా జవాబు ! అనే 15 నుండి 24 వరకు కుడితే 195 వస్తుందన్నమాట. చూశారా? పెన్నుతో పని లేకుండానే కేవలం విని ఎంత స్పీడ్ గా జవాబు చెప్పచ్చో తెలిసిందా? చివరి సంఖ్య చెప్పిన తరువాతే జవాబు చెప్పాలి సుమా! 5వ సంఖ్య చెప్పిన వెంటనే జవాబూ చెప్పవనుకో అక్కడి వరకు కుడితే ఆ జవాబురాదు కదా ! పైగా క్లూ వెంటనే తెలిసిపోతుంది కదా! అందుకే వారు వరుసగా సంఖ్యలు చెప్పుతున్నంత సేపు శ్రద్ధగా వింటూ, చివరి సంఖ్య అయిపోగానే జవాబు చెప్పేసుకోవాలి. చేస్తారు కదా? మీ స్నేహితులతో ఇలా అడుకున్నావంటే లెక్కల్లో మీరే ఫస్ట్ . మీరూ కొన్ని నమూనాలు చేసి చుడండి మరి! 15 37 83 16 38 84 17 39 85 18 40 86 19 5 41 5 87 5 20 42 88 21 43 89 22 44 90 23 45 91 24 46 92 195 415 875 ఆధారం: ఇ. చంద్రయ్య