ప్లాస్టర్ ఆఫ్ పారిస్ అనేది ఒక రసాయన పదార్థం. దీనిని మనం అనేక విధాలుగా ఉపయోగిస్తూ ఉన్నాము. కానీ దాని వలన వచ్చే ప్రమాదాలను మాత్రం మనం గమనించము. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో కలిగే దుష్ఫలితాలు, ప్రమాదాలు:- ప్లాస్టర్ ఆఫ్ పారిస్ నీటిలో కలిసినప్పుడు నీటిని వేడిగా చేస్తుంది. మనిషిలో ఉండే జీవుల జీర్ణవ్యవస్థ, శ్వాస వ్యవస్థ, విసర్జక వ్యవస్థ పై ప్రభావం పడుతుంది. మనం ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వాయువును గాలి ద్వారా పీల్చుకున్నప్పుడు మెదడు దెబ్బతింటుంది. దాని వలన కోమాలోకి పోయే ప్రమాదం ఉంది. భారీ మూలకాలు శరీరంలోనికి పోయి మూత్రపిండాలు, విసర్జక వ్యవస్థ దెబ్బతింటుంది. అనీమియా, రక్త హీనత, జీర్ణవ్యవస్థ పై ప్రభావం పది డయేరియా, విరేచనాలు వంటి సమస్యలు వస్తాయి. నీటి ద్వారా కూడా ప్లాస్టర్ ఆఫ్ పారిస్ శరీరంలోనికి పోయి కీళ్ళనొప్పులు, నరాల సమస్యలు వస్తుంటాయి. మనకు 60-70 సంవత్సరాలకు రావలసిన సమస్యలు అన్ని 30-40 సంవత్సరాలకే రావడం అనేది ఒక సమస్యగా గుర్తించాలి. కలుషిత నీటి వలన చేపలు, రొయ్యలు వంటి జలచరాలపై ప్రభావం పడుతుంది. వాటిని ఆహారంగా తీసుకునే మనం వ్యాధుల బారిన పడుతున్నాము. అందుకే మన ఇంట్లో మనకు తెలియకుండానే 3 పెనుభూతాలు వచ్చాయి. మనల్ని ప్రతిరోజు భాదిస్తున్నాయి. అవి:ప్లాస్టర్ ఆఫ్ పారిస్, ప్లాస్టిక్ థర్మాకోల్ ` ప్లాస్టిక్:- ప్లాస్టిక్ కొన్ని లక్షల సంవత్సరాలు అయినా భూమిలో కలవదు. అలాగే నీటిలో కరగదు. కుళ్లిపోదు. ఈ ప్లాస్టిక్ వలన ఎన్నో జీవులు మరణిస్తున్నాయి. ప్లాస్టిక్ కాగితాల్ని తిని ఎన్నో ఆవులు మరణిస్స్తున్నాయి. ప్లాస్టిక్ కు దూరంగా ఉండండి పర్యావరణాన్ని కాపాడండి..... థర్మకోల్:- థర్మాకోల్ అనేది ప్లాస్టిక్ లాంటి పదార్థం. చాల విషపూరితం అయినది. దీని వలన ఎన్నో హానికర బ్యాక్టీరియా శరీరంలోనికి చేరతాయి. క్షక్షణం రేణువుల రూపంలో గాలిలో కలిసి వ్యాధులను కలిగిస్తుంది. ఈ 3 భూతాలకు దూరంగా ఉండండి ప్రక్కవాళ్లను వాటి నుండి కాపాడండి. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ కు బదులు మట్టిని వాడుదాం వినాయక చవితి పండుగలో మట్టి వినాయకుడితో పర్యావరణాన్ని కాపాడుదాం. పూర్వకాలంలో వినాయక చవితి అనగానే సహజమైన బంక మట్టితో వినాయకుడిని తయారుచేసి పూజించేవారు. ఎటువంటి రసాయన వినాయకులను కాకుండా ప్రకృతి ప్రకృతి హితమైన విగ్రహాన్ని తాయారు చేసుకోవాలి. ఒక తొట్టిలో విగ్రహాన్ని పెట్టి నిమజ్జనం నీటిలో మట్టి కరిగిన తరువాత మొక్కను నాటి పెంచేవారు. ఇప్పుడు మనం నాటిన మొక్క రేపటి భావితరాలకు మధుర ఫలాలను, చల్లని నీడను ఇస్తుంది. ప్రతి ఒక్కరు పర్యావరణాన్ని కాపాడాలి. ప్రకృతిని మనం కాపాడాలి - ఆ ప్రకృతి మనల్ని కాపాడుతుంది. ఆధారం: చెకుముకి