హలో చిన్నారులు మనం ఈరోజు మన మిత్రుల బర్తడే ఎప్పుడో ఒక చిన్న లాజిక్ ద్వారా తెలుసుకుందాం. ఇది చాలా తమాషాగా వుంటుంది. దీని కొరకు మీ మిత్రులకు ఈ క్రింది ప్రశ్నలు అడగండి. మీరు పుట్టిన నెలను 2తో గుణించండి. వచ్చిన దానికి 5ను కలపండి. ఆ వచ్చిన మొత్తాన్ని 50తో గుణించండి ఆ వచ్చిన లబ్దానికి మీరు పుట్టిన తేదిని కలిపి చెప్పండి. ఈ నాలుగు స్టెప్స్ వారు చేసుకొని వారి మోత్తాన్ని చెప్పగానే వెంటనే వారు పుట్టిన నెల, తేదీ చెప్పవచ్చును. ఉదా: రమపుట్టిన తేది 28-6-1987. ఇక్కడ సంవత్సరంతో పనిలేదు. ఎందుకంటే మనం పుట్టిన నెల తేదీ మాత్రమే ప్రతి సంవత్సరం వస్తాయి కాని సంవత్సరము రాదు కదా... పుట్టిన నెల 6 x 2 = 12 12 + 5 = 17 17 x 50 = 850 850 + 28 = 878 878 అని చెప్పగానే మనం మీరు జూన్ 28న పుట్టారు అని చెప్పాలి. మరో ఉదాహరణ... ఉదా: 10-11-1965 11 x 2 = 22 22 + 5 = 27 27 x 50 = 1350 1350 + 10 = 1360 1360 అని చెప్పగానే నవంబర్ 10వ తేదీ అని చెప్పాలి. అది కూడా పెన్ను లేకుండానే సుమా... క్లూ చెప్పుతున్నాను జాగ్రత్తగా విని ప్రాక్టీస్ చేసుకోండి. క్లూ; చివరగా చెప్పిన మొత్తం నుండి 250ని తీసి వేయడమే. 878 – 250 = 628. 28వ లేదీ – 6 నెల అనగా జూన్ 1360 – 250 = 1110. 10వ తేదీ, 11 నెల నవంబర్, జవాబులోని ఒకట్లు పదుల సంఖ్య తేదీ, మిగిలిన సంఖ్య నెలగా మనం చెప్పాలి తెలిసిందా.. బైబై... ఆధారం: ఇ. చంద్రయ్య