"మాది నిజమైన తెలంగాణ? నైజాము ప్రాంతంలో ఎక్కువ భాగం తెలుగునాడే. వామీరందరు (మద్రాసు ప్రాంతంలో ఉండే ఆంధ్రులు) నిజమైన ఆంధ్రభూమిలో నిసించుట లేదు. ఆంధ్రులు పూర్వ చరిత్ర, ప్రసిద్ధి కెక్కిన అందరూ వంశీయుల చరిత్ర అంత తెలంగాణకు సంబంధించి ఉన్నది. వరంగల్ మెదలైన తెలంగాణ ప్రాంతాలలో జాగ్రత్త చేయబడిన శిలాశాసనాలు చూస్తే ఆంధ్రుల కీర్తి బోధపడుతుంది." సరోజినీదేవి తల్లిదండ్రులు బెంగాలీవారైనా హైదరాబాదులో స్ధిరపడ్డారు. తండ్రి అఘోరనాధ చటోపాధ్యాయుడు హైదరాబాదులో నిజం కళాశాల ప్రారంభకులలో ఒకరు. ఆ కళాశాలలోనే ఆచార్యుడిగా చివరివరకు పనిచేశారు. ఆమె లండన్ కింగ్స్ కాలేజీలోని, కేంబ్రిడ్జిలోను చదువుకున్నారు. అనారోగ్య కారణాలతో ఇంగ్లండ్ నుంచి స్వీటీజర్లండ్ వెళ్ళారు. అంతకు ముందే సరోజని దేవి ఆంగ్లంలో కవితలు రాసేవారు. స్వీటీజర్లండ్ లో ఆ కవిత వ్యాసంగా మరింత చురుకుగా సాగింది. ఆమె రాసిన కవిత్వం నాలుగు సంపుటాలుగా తర్వాతికాలంలో వెలువడింది. మధురమైన కవితల వల్ల ఆమెకు "నైటింగేల్ అఫ్ ఇండియా" అనే పేరు వచ్చింది. సరోజినీ కులాంతర వివాహం చేసుకున్నారు. డాక్టర్ గోవింరాజులు నాయుడుతో ఆమె వివాహాన్ని కందుకూరి వీరేశలింగ గారు జరిపించారు. 1905 వ సంవత్సరంలో జాతియేద్యమంలో ప్రవేశించాక ఆమె భారత రాజకీయరంగంలో కీలక గుట్టలన్నింటిలో తన ముద్రను వేశారు. అప్పటి నుంచి ఆమె జీవ చరిత్రకు జాతియేద్యమ చరిత్రకు పెద్ద తేడా ఉండదు. సరోజని దేవి స్వరాజ్య నినాదంతో భారతదేశమంతటా పర్యటించి ఆ నినాదం నేనుక ప్రజలను సమీకరించారు. కాన్పూరులో జరిగిన (1925) కాంగ్రెస్ మహాసభకు ఆద్యశురాలయ్యారు. కాంగ్రేస్ మహాసభకు ఒక మహిళా సారధ్యం వహించటం పరాధీన భారతంలో అదే మొదటిసారి. 1937 ఎన్నికలలో పాల్గొనటం అనేక వ్యక్తిగతంగా ఇష్టం లేకపోయినా కాంగ్రెస్ తరపున దేశమంతా తిరిగి ప్రచారం చేశారు. ఆమె మంచి ఉపన్యాసకురాలు. ఉప్పు సత్యాగ్రహ సమయంలో గాంధీజతో పటు దండికి బయలుదేరిన సాహసి సరోజినీదేవి. గాంధీ నెహ్రు అరెస్టుల తర్వాత సరోజినీ నాయకత్వం కింద ఉప్పు కొఠారుల మీదకు వెళ్ళిన సత్యాగ్రహాలా బృందాన్ని అపెందుకు పోలీసులు ప్రయత్నం చేసి చివరకు సరోజిమో దేవిని అరెస్టు చేశారు. ఆరోగ్య పరిస్ధితిని కూడా లెక్కజేయకుండా క్విట్ ఇండియా ఉద్యమంలోనూ అరెస్టయ్యారు. దేశం స్వతంత్రమయ్యాక ఈమె సంయుక్త రాష్ట్రాల గవర్నర్ గా పనిచేశారు. ఒక అగ్రశేణి నాయకురాలిగా జాతియేద్యమం వంటి పెద్ద ఉద్యమంలో ఉండటం సామాన్యమైన విషయం కాదు. ఉద్యమంలో నిర్ణయాధికారం స్ధానంలో ఉండేందుకు కావలసిన మేధ, చొరవ, వాక్చాతుర్యం, ధైర్యం వంటి గుణాలన్నీ సరోజినీదేవిలో ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత సంశోభ సమయాలలో సరోజినీ దేవి కీలకపాత్ర వహించేవారు. హాస్యంతో, చమత్కారంతో కూడిన ఆమె సంభాషణ చాతుర్యామ ఎంత క్లిష్ట సందర్భాన్నయినా తేలిక చేయగలిగేది. గాంధీ నుంచి మెదలుబెడితే ఎవరూ ఆమె హాస్య, వ్యంగ్య వాగ్బాణాలనించి తప్పించుకోలేకపోయారు. ఆధారం : రాష్ట్ర విద్య పరిశోధన శిక్షణ సంస్ధ