1 – 1894 ప్రముఖ భారతీయ భౌతిక శాస్త్రవేత్త సత్యేంద్రనాధ్ బోస్ జన్మదినం. వీరు ఆల్బర్ట్ ఐన్స్టీన్ కు సమకాలికులు. 2 – 1959 ఆనాటి రశ్యా దేశం వారు మొట్టమొదటి మానవ రహిత “ఛంద్రళోధని” లూనా – 1ని ప్రయోగించారు. ఈ పరిశోధనలకు శ్రీకారం చుట్టబడింది. 3 – 1906 ఖగోళ శాస్త్రవేత్త విలియం మోర్గాన్ జన్మించిన రోడు. ఈయన పాలపుంత సర్పింలాకారంలో ఉన్నదని వివరించారు. 4 – 1809 అంధుల కొరకు ప్రత్కేక లిపిని పూరొందించిన లూయిస్ బ్రెయిల్లీ జన్మించిన రోడు. 5 – 1555 సేఫ్టీ రెజర్ ను తయారుచేసిన కింగ్ క్యాంప్ గిల్లెట్ జన్మించిన రోజు. 8 – 1642 భౌతిక శాస్త్ర పితామహుడు హెలిలియో గెలీలి మరణించిన రోజు. ఈయన ఖగోళశాస్త్ర పరిశోధనలకు ప్రథమంగా టెలిస్కోపును వాడారు. 9 – 1922 మన దేశంలో జన్మించి అమెరికాలో స్థిరపడిన హర్ గోవింద్ ఖొరానా జన్మదినం ఈరోజే. వీరు 1968 సం.లో వైద్యశాస్త్రంలో వోబెల్ బహుమతి పొందారు. 12 – 1895 ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరిజిల్లాల్లో జన్మించి, అమెరికాలో స్థిరపడిన ప్రముఖ జీవ రసాయన శాస్త్రవేత్త డా.యల్లా ప్రగడ సుబ్బారావు గారి జన్మదినం ఈ రోజే. ఫోలిక్ ఆమ్లం, టైట్రాసైక్లిక్న్లు, కాన్సర్ నిరోధక ఔషధాలు తయారు చేశారు. 1995 సంవత్సరాన్ని సుబ్బారావు గారి శతదిలోత్సవ సంవత్సరంగా జరుపుకున్నారు. వీరిని “అద్భుత ఔషధ సృష్టికి మంత్రగాడు” అని అంటారు. 14 – 1742 బ్రిటిష్ గణిత, ఖగోళ శాస్త్రవేత్త ఎడ్మండ్ హేలీ మరణించిన రోజు. హేలీ మొట్టమొదటిసారిగా తోకచుక్క తిరిగి రావడాన్ని ఖచ్చితంగా లెక్కించి చెప్పారు. ఒక కాంతివంతమైన తోకచుక్కకు హేలీ పేరుపెట్టడం జరిగింది. 16 – 1961 భారతదేశపు రెండవ శోధనా రియాక్టర్ “సైరస్” (Cirus) ప్రారంభించిన రోజు. 18 – 1736 ఆవిరితో పనిచేసే ఇంజన్ ను రూపొందిచిన బ్రిటీషు ఇంజనీరు జేమ్స్ వాట్ జన్మదినం. అంతర్జాతీయ ప్రమాణాల్లో శక్తికి ప్రమాణంగా వాట్ పేరును వాడుతున్నారు. 23 – 1907 జపాన్ దేశానికి చెందిన భౌతిక శాస్త్రవేత్త హిడికి యుకావా జన్దినం. మెసానులు అనే మౌలిక కణాలున్నాయని ముందుగానే లెక్కించి చెప్పింన పరిశోధనకు గాను 1949లో నోబెల్ బహుమతి లభించింది. 24 – 1966 భారతీయ శాస్త్రవేత్త హోమీ జహంగిర్ భాభా విమాన ప్రమాదంలో మరణించిన రోజు. దేశంలో అణుశక్తి పరిశోధనలకు పునాదులు వేశారు. ముంబాయి సమీపంలో ఉన్న “భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్” వీరు స్థాపించినదే. 25 – 1627 వాయువులు ధర్మాలకు సంబంధించి అనేక పరిశోధనలు జరిపిన ఐరిష్ శాస్త్రవేత్త రాబర్ట్ బాయిల్ జన్మదినం. మూలకం, ఆమ్లము, క్షారము వంటి భావనలు వీరు ప్రతిపాదిచినవే. 26 – 1823 బ్రిటీష్ డా. ఎడ్వర్డ్ జెన్నర్ మరణించిన రోజు. టీకాలను ప్రారంభించినది వీరే. 29 – 1986 ఈ రోజున అమెరికన్ స్పేస్ షటిల్ “చాలెంజర్” ప్రయోగించబడింది. అయితే అది ప్రయోగించబడిన 73 సెకన్లకు పేలిపోయి దానిలో ఉన్న ఏడుగురు వ్యామోగాములు మరణించారు. 31 – 1913 అమెరికా రసాయన శాస్త్రవేత్త ఇర్వింగ్ లాంగ్ ముర్ జన్మించిన రోజు, పలుచని పొరలు, తాలాలుకు సంబంధించి చేసిన పరిశోధనలకు నోబెల్ బహుమతిని పొందారు.