కౌసల్య సుప్రజా రామా... అ౦టూ సుప్రభాతంతో మాకు మేలుకొలుపు పాడుతూ మా శ్రీమతి కర్పూరపు హారతితో గదిలోకి అడుగు పెట్టింది. మా చిన్నీ ఒక్క అంగలో మంచంపై నుంచి వాళ్ళ అమ్మ ముందుకు ఉరికి కళ్లు రెండు గట్టిగా మూసుకుని చేతులు రెండు జోడించింది. ఓ క్షణం తరువాత కళ్లు తెరచి బక్తిగా హారతి అందుకుంది. తరువాత నాదగ్గరకొచ్చి డాడీ... నిన్న గుడికి వెళ్ళనప్పుడు కర్పూరాన్ని చెట్ల లు నుంచి తయారుచేస్తారని ఒకరు, రాదని మరొరకు వాదించుకోవడం విన్నాను. ఇంతకీ కర్పురం అంటే ఏమిటి, దాన్నెలా తయారు చేస్తారు, అమ్మ హారతిలో ఇచ్చే కర్పుారం, తర్దీంలో కలిపిన పచ్చకర్పూరం ఒకటేనా అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది. దాంతో అప్పుడే అందుకున్న పేపర్‌ను పక్కన పడేసి చిన్నీ ప్రశ్నలకు సమాధానం చెప్పడం మెుదలెట్టాను. చిన్నీ, మనం రోజూ చూసే చాలా వస్తువుల గురించి నీకొచ్చే డౌట్లే పెద్దలకు కూడా వస్తుంటాయి. చాలా వాటిని అడగలేక ఇబ్బంది పడుతుంటారు. అయితే చిన్నప్పడే ఇలాంటి విషయాలు తెలుసుకొంటే పెద్దాయ్యాక ఈ ఇబ్బందులు ఉండవు. సరే అసలు విషయానికొద్దాం. నిన్ను నువ్వు గుళ్లో విన్న వాదనలో ఒక పాయింట్ కరెక్టే. పచ్చకర్పూరం, తెల్ల కర్పూరం రెండూ చెట్ల నుంచే తయారు చేస్తారు. కాకపోతే రెండింటికి కొంచెం తేడా వుంటుంది. అడవుల్లో 40 అడుగుల ఎత్తు వరకు పెరిగెే కేంఫర్ ట్రీ అనే చెట్టు నుంచి ఈ కర్పుారాన్ని తయారుచెేస్తారు. ఈ కర్పూరపు చెట్ల అకులు దట్టంగా ఉండి మెరుస్తూ ఉంటాయి. ఈ చెట్ల వేర్లు, కొమ్మలు, ఆకులను ముక్కలుగా చేలి నీటిలో ఉడకబెడితే వచ్చే ఆవిర్ల నుంచి ఈ కర్పూరం తయారుచేస్తారు. అయితే ఆవిర్ల నుంచి గడ్డ కర్పుారం ఎలా తయారవుతుంది ఆ ఆవిర్లలో కాంఫిన్ అనెే ఒక రసాయనం పుడుతుంది. ఆ ఆవిరిని ఒక ప్లేటులోకి తీసుకువచ్చి సేకరిస్తారు. అంటే ఆవిరి ప్లేటు కింది భాగంలో పోడి రూపంగా మరిపోతుంది. ఈ పొడిని సేకరించి గడ్డగా తయారుచేస్తారు. పచ్చ కర్పుారాన్ని 'లీనీ కేంఫర్' అనే చెట్టు నుంచి, తెల్ల కర్పురాన్ని 'డిక్సట్ర్ కేంఫర్' అనే చెట్టు నుంచి తయారు చేస్తారు. పచ్చకర్పూరం తడిగా ఉంటుంది. అది ఘాటుగా ఉండటం వల్లే మందుల తయారీలో ఉపయోగిస్తారు. అయితే ఈ చెట్లు ఎక్కడైనా పెరుగుతాయా లేదు. ఎత్తయిన ప్రదేశాల్లో మాత్రమే పెరుగుతాయి. ఆధారం: బుద్ధుడు