మెజిషియన్ సుబ్బు తన సంచీలోంచి అరడజను నారింజ కాయలు తీసి టేబుల్ మీద పెట్టాడు. టేబుల్ మీద కొన్ని లోహపు కడ్డీలు, ఒక చాకు, కొన్ని కప్పులు, కరెంట్ తీగలు కూడా ఉన్నాయి. మెజీషియన్ ఫిజిక్స్ మాస్టార్ ని పిలిచి ఏదో చెప్పాడు. ఆయన తన ల్యాబ్ నుంచి ఒక పరికరాన్ని, ఒక ఫ్లాష్ బల్బ్ ని తెచ్చి టేబుల్ మీద పెట్టాడు. మెజీషియన్ నారింజ కాయల్ని పొడిచి ఒక్కొక్క దానిలో దగ్గర దగ్గరగా రెండు రంధ్రాలు చేశాడు. ఇప్పుడు నారింజ కాయల్ని విడివిడిగా కప్పుల్లో పెట్టాడు. టేబుల్ మీదున్న లోహపు కడ్డీల్ని తీసుకొని నారింజ కాయల రంధ్రాల్లో పెట్టాడు. కరెంట్ తీగల్ని తీసుకుని పక్క పక్కనే ఉన్న కాయల్లోని లోహపు కడ్డీలను ఒక పద్ధతి ప్రకారం కలిపాడు. మెుదటి, చివరి కాయలలోని తీగల చివరలను ఫిజిక్స్ మాస్టారు తెచ్చిన పరికరానికి కలిపాడు. ఇప్పుడు మెజీషియన్ విద్యార్ధులతో కొంచెం సేపు మాట్లాడాడు. చూశారుగా... నారింజ కాయల్లో లోహపు కడ్డీలను దించి వాటిని తీగలతో కలిపాను. ఇప్పుడు చూడండి. ఈ ఫ్లాష్ బిల్ల ను తీగలతో కలిపి సర్క్యూట్ పూర్తి చేస్తాను. ఏమవుతుందో చూడండి. అదే ఈ రోజు మ్యాజిక్ అన్నాడు. విద్యార్ధుల్లో ఉత్కంఠ రేగింది. ఫ్లాష్ బల్బ్ ఒక్కసారిగా వెలిగింది. ఆశ్చర్యపడడం విద్యార్ధుల వంతు అయింది. అంతా చప్పట్లు కొచ్చారు. థాంక్యూ అన్నాడు మెజీషియన్. ఈ మ్యాజిక్ ను మనం కూడా చెయ్యగలం కాని, నారింజ కాయల్తో ఫ్లాష్ ఎలా వచ్చింది? ఈ విషయాలు మనం తెలుసుకోవాలి. మెజీషియన్ ఉపయోగించిన లోహపు కడ్డీలు జింక్, కాపర్ ఎలక్ట్రోడ్ లు. ఇక్కడ నారింజ కాయలు వోల్టాయిక్ ఘటంగా పని చేస్తున్నాయి. అంటే రసాయన శక్తి విద్యుచ్ఛక్తగా మారుతుంది. చాలా తక్కువ విద్యుత్ ఉత్పత్తి అవుతుంది కాబట్టి సుమారు ఒక నిమిషం పాటు కెపాసిటర్ దీన్ని గ్రహించి నిల్వ చేస్తుంది. తర్వాత ఫ్లాష్ బల్ల్ కు కలిపితే అది వెలుగుతుంది. ఇందుకోసమే మెజీషియన్ కొంతసేపు విద్యుద్వాహకం కాబట్టి జింక్, కాపర్ ఎలక్ట్రోడ్లతో వోల్టాయిక్ ఘటం ఏర్పడుతుంది. ఎలక్ట్రోడ్లను ఒకదానినొకటి తాక్కుండా దగ్గర దగ్గరగా నారింజ కాయల్లోన్ రంద్రాల్లో గుచ్చాలి. ఇలా గుచ్చేటప్పుడు రసం టేబిల్ మీద పడి ఖరాబు కాకుండా ఉండేందుకు నారంజ కాయల్ని కప్పుల్లో ఉంచాలి. ఆధారం: డా. ఇ.ఆర్. సుబ్రహ్మణ్యం