పిల్లలూ! మీరంతా సినిమా హాలుకెళ్ళి సినిమా చూసి ఉంటారు కదూ! అయితే ఫిల్మ్ రీలును మీరెప్పుడైనా చూశారా? ఆ రీలులో హీరోగారు విలన్ పై ఒక దెబ్బ వేసే సన్నివేశం ఉందనుకోండి. అది చాలా బిట్స్ గా ఉంటుంది. ఒకదానిపై కొంచెం చెయ్యిపైకి లేచినట్లు, మరో దాంట్లో మరికొంత ఎత్తుకు .........ఒక దాంట్లో చెయ్యి దించుతున్నట్లు .......చివరి దాంట్లో విలన్ ని తాకినట్లు 1 సెకను కాలంలో 16 బొమ్మలు మన కంటిముందు కదిలితే అవన్నీ కలిసిపోయినట్లు మనకు కనిపిస్తాయి. మన దృష్టి నుండి ఒక వస్తువును తొలగించినా, 1 /16 సెకనుపాటు మనకు ఆ వస్తువు కనిపిస్తూనే ఉంటుంది. కాంతివున్న పెరిసి స్టెన్స్ పెర్ సిస్టెన్స్ అనబడే ఈ ప్రత్యక్ష లక్షణం వల్లనే మనం సినిమా చూడగలుగుతున్నాం. ఇలాంటి లక్షణంతో మనం ఓ తమాషా బొమ్మను తయారుచేద్దామా. 1. ఒక తెల్ల కాగితం ముక్కను తీసుకోండి. మడిచి ఆ మడతలో ఒక కార్బన్ పేపర్ ను ఉంచండి. 2. ఒక అబ్బాయి లేక అమ్మాయి ముఖాన్ని గీయండి. కనుగుడ్లు మాత్రం వేయవద్దు. 3. ఇప్పుడు ముఖం సిద్ధం. 4. కార్బన్ పేపర్ ను తొలిగించండి. 5. పై బొమ్మ కళ్ళకు ఎడమవైపు కనుగుడ్లు గీయండి. 6. కింది బొమ్మకు కుడివైపు కనుగుడ్లు గీయండి. 7. ఇప్పుడు పై కాగితాన్ని ముందుకు వెన్నక్కు వేగంగా కదిలించండి. 8. ఇప్పుడు బొమ్మలోని కనుగుడ్లు ఎడమ నుండి కుడి వైపుకు కదులుతున్నట్లుగా కనిపిస్తుంది. నిర్వహణ : - జి. కామయ్య, నెల్లూరు.