ఉద్దేశ్యం: కోబాల్టు క్లోరైడ్ ద్రావణంతో అక్షరాలను వ్రాసిన కనిపించని వాక్యాలను రసాయన చర్య తర్వాత చదవగలగడం. కావలసిన పరికరాలు: పరీక్షనాళిక, బ్రష్, కొవ్వొత్తి, అగ్గిపెట్టె. కావలసిన రసాయనాలు: కోబాల్ట్ క్లోరైడ్ (CoCl2) ప్రయోగ విధానం: కొంచెం కోబాల్ట్ క్లోరైడ్ లవణాన్ని తీసుకొని (0.1 గ్రా.) పరీక్ష నాళికలో వేసి, కొంచెం నీటిని (5 మి.లీ.) కలిపి ద్రావణాన్ని తయారుచేయాలి. బ్రష్ ను తీసుకొని ద్రావణంలో ముంచి ఒక తెల్ల పేపరుపై ఏదైనా అక్షరాలను వ్రాయాలి. ఇప్పుడు అక్షరాలు కనబడవు. చదవలేము. అక్షరాలు వ్రాసిన పేపరును కొవ్వోత్తి వేడిలో చదవాలి. పరిశీలనలు: కోబాల్టు క్లోరైడ్ ద్రావణంతో వ్రాసిన అక్షరాలు మెదటగా కనిపించవు. కారణం ద్రావణానికి రంగు లేత పింక్ ఉండును. పేపరు మీద వ్రాసిన పదార్థపు లక్షణం CoCl2. 6H2O గా ఉంటుంది. ఇక్కడ నీరు స్పటిక జలం కాదు. దీని అంతర నిర్మాణం (Co(H2O)6)Cl2 ఉంటుంది. కాని వేడిచేసినప్పుడు నీటి అణువులు ఆవిరై పోయి నిర్జల CoCl2 గా లవణం ఎండిపోతుంది. ఆ తర్వాత పింక్ గా మారుతుంది. CoCl2 కు CoCl2. 6H2O కు రంగులో తేడా ఉంటుంది. CoCl2. 6H2O కు దాదాపు రంగు లేదు. అది లేత పింక్ రంగైనా సజల ద్రావణం కాబట్టి రంగు కనిపించదు. కాని CoCl2 కు పింక్ రంగు ఉంటుంది. ఉపయోగాలు: ఈ ప్రయోగం ద్వారా ఒక మ్యాజిక్ ను ప్రదర్శించవచ్చు. మీకు తెలుసా? మనం ఉపయోగించే రంగులన్నీ రసాయన పదార్థాలే. ఆధారం: కె. లక్ష్మారెడ్డి