"మీరెప్పుడైనా ఇంద్రధనుస్సు చూశారా?" మేజిక షో కి వచ్చిన విద్యార్థుల్ని అడిగాడు మెజీషియన్ సుబ్బు, "'ఓ... చూశాం సార్. ఏడురంగులూ ఒక వరుసలో ఏలు మాదిరిగా వంచినట్లు కనిపిస్తుంది. చూడముచ్చటగా ఉంటుంది సార్! " ఎంతో ఉత్సాహంగా చెప్పారు విద్యార్థులంతా. "ఎండా, వాన ఈ రెండూ కలిసిన అనుకూల వరిస్థితి ఉన్నప్పుడు ఇంద్రధనుస్సు ఏర్పడుతుందన్నమాట. తెల్లని సూర్యకాంతి గాలిలోని వాన చినుకులో గుండా ప్రయాణిస్తుంది. అపుడు ఆ కాంతి ఏడు రంగులుగా విడిపోయి, చినుకుకు ఆవలి వైపున మనకు ఇంద్రధనుస్సు కన్పిస్తుందన్నమాట. ఇలా ఎండా, వానా అవసరం లేకుండానే, ఈ కాగితం మీదనే నేను ఇంద్రధనుస్సు సృష్టిస్తా! అదే ఈ రోజు మేజిక్. సరేనా." అన్నాడు మెజీషియన్. విద్యార్థులంతా ఆసక్తిగా “సరే సార్, సరే సార్!” అన్నారు. మెజీషియన్ టేబుల్ మీద వెడల్పాటి ఒక స్టీల్ గిన్నె పెట్టాడు. దాంట్లో నీరు పోసి నింపాడు. చిన్న సీసాలోంచి రెండు చుక్కల ద్రవం నీటికి కలిపాడు. ఒక నల్ల కాగితాన్ని నీటిలో ముంచి తీశాడు. దానిని టిష్యూ పేపర్ మీద ఉంచి ట్రై చేశాడు. ఆ కాగితాన్ని విద్యార్థుల చేతికిచ్చి చూడమన్నాడు. కాగితం మీద ఇంద్ర ధనుస్సు మాదిరిగా వేర్వేరు రంగులు కన్పించాయి. అంతా చప్పట్లు కొట్టారు. ఈ మేజిక్ చేయడం చాలా సులభం. ఇందుకు కావల్సినవి: నీటితో నింపిన వెడల్పు గిన్నె గోళ్ళ పాలిష్, నల్లకాగితం ముక్కలు. విధానం: స్టీల్ గిన్నెలోని నీటికి 1 లేదా 2 చుక్కలు గోళ్ళ పాలిష్ కలపాలి. పాలిష్ నీటి ఉపరితలం మీద అన్ని వైపులా విస్తరిస్తుంది. ఆలస్యం చేయకుండా నల్లకాగితాన్ని నీటిలో ముంచాలి. బయటికి తీసి, టిష్యూ పేపర్ మీద లేదా వడపోత కాగితం మీద డ్రై చేయాలి. ఇప్పుడు కాగితాన్ని వెలుగులో అటు ఇటు తిప్పిచూస్తే కాగితం మీద వేర్వేరు రంగులు ఇంద్రధనుస్సులో మాదిరిగా కన్పిస్తాయి. ఇలా ఎందుకు జరుగుతోంది? అంటే, కాగితాన్ని మనం నీటిలో ముంచినప్పుడు నెయిల్ పాలిష్ కాగితం మీద ఒక పల్చనిపొరలా ఏర్పడుతుంది. అది కాంతిని విడగొట్టింది. అపుడు ఆ కాంతి ఇలా ఇంద్రధనుస్సు మాదిరిగా ఏడు రంగులుగా కన్పిస్తాయి. నెయిల్ పాలిష్ ను నీటికి కలిపినప్పుడు అది చాలా తొందరగా నీటి ఉపరితలం మీద 'డ్రా'గా అయిపోతుంది. అప్పుడు అది కాగితానికి అంటుకోదు. అందుచేత పాలిష్‌ని నీటికి కలిపిన వెంటనే అంటే 10 లేదా 15 సెకన్లలో పే కాగితాన్ని నీటిలో ముంచాలి. లేదంటే డ్రై అయిపోయిన పాలిష్‌ని నీటిలోంచి తీసేసి, మళ్ళీ త్వరగా చేయాలి. ఆధారం: డా. ఇ.ఆర్. సుబ్రహ్మణ్యం