మెజీషియన్ సుబ్బు ఏదో ఆలోచిస్తున్నవాడిలా చేతిలో కర్రను అటు ఇటు కదుపుతూ వేదిక మీదకు వచ్చాడు. వేదిక మీద ఒక టేబిల్ ఉంది. టేబులు మీద ఒక మోర్టార్, ఒక రియెజంట్ బాటిల్ ఇందులో రంగులో రంగులేని ద్రవం, ఒక రంగు సీసా అందులో కొన్ని స్పటికాలు వున్నాయి. ఇప్పుడు మరో మేజిక్ చేసిచూపిస్తా అన్నాడు. మోర్టార్లోని రంగుసీసాలో ఉన్న కొన్ని స్పటికాలను తీసుకున్నాడు. స్పటికాలు నలుపు రంగులో కన్పించాయి. రియోజంట్ బాటిల్ నుంచి రంగులేని ద్రవాన్ని స్పటికాల మీద పోశాడు. ఒక గాజుకడ్డీని తీసుకొని మోర్టార్లోని స్పటికాలను ప్రపంలో అటుఇటు కదిపాడు. మిశ్రమాన్ని గరాటులో ఉంచిన వడపోత కాగితం మీద పోశాడు. ముందు గోధుమ రంగు ఘనపదార్ధం కాగితం మీద మిగిలింది. ఆ పదార్థాన్ని చేతితో తాకకుండానే వేదిక మెట్ల మీద. టేబుల్ కు కొంచెం దూరంగా వేదిక మీద చల్లుతూ, రెండో చేతిలోని మంత్రదండంలాంటి కర్రను గాలిలో ఊపుతూ ఏదో మంత్రం జపిస్తున్నట్లు నటించాడు. "స్టూడెంట్స్ మీలో ఎవరైనా ఇద్దరు ముగ్గురు ఒకరి తర్వాత ఒకరు వేదిక మీదకి రండి, అన్నట్లు, చెప్పులు విడిచి పెట్టకుండా నడిచిరండి" అన్నాడు. సహజంగానే ఎప్పుడూ, చదువుల్లో ముందుంటే అనిష్ సాకేత్, ఆశ్రిత మేం వస్తాం అంటూ బయలుదేరారు. రండిరండి అంటూ మెజీషియన్ ఆహ్వానించాడు. అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. వాళ్ళు మెట్లెక్కుతూ, అడుగు వేస్తున్న ప్రతిసారి చిటపట శబ్దాలు టపాకాయలు పేలినట్లుగా విన్పించాయి. “వయులెట్ రంగు ఆవిరులు కూడా వెలువడ్డాయి. అంతా చప్పట్లు కొట్టారు. ఈ ముగ్గురు విద్యార్థులు ఏ మాత్రం భయపడకుండా మెట్లెక్కి మెజీషియన్ దగ్గరికి వెళ్ళారు. మెజీషియన్ 'శభాష్' అంటూ వాళ్ళను అభినందించాడు. ఈ మేజికను మనం కూడా చేయవచ్చు. ఇందుకు కావాల్సినవి అయోడిన్ స్పటికాలు (సుమారు ఒక గ్రాము) ద్రవ అమ్మోనియా మోర్టార్, | గాజుకడ్డీ, సిల్వర్ పేపర్, గాజుగరాటు. మోర్టార్లో సుమారు ఒక గ్రాము అయోడిన్. స్పటికాలు తీసుకుని, ద్రవ అమ్మోనియా కలిపి గాజు కడ్డీతో బాగా రుద్దాలి. అప్పుడు ఎర్రటి అవక్షేపం ఏర్పడుతుంది. దీనిని వడపోత కాగితం మీద పోస్తే, ముదురు ఓ రంగు లేదా సల్లటి ఘనపదార్థం కాగితం మీద మిగులుతుంది. దీన్ని చేతితో తాకకుండా గదిలో చల్లాలి. కొంత సేపటికి అధికంగా ఉన్న అమ్మోనియా ఇగిరిపోతుంది. పదార్ధం ఆరిన తర్వాత దానికి ఏమాత్రం రాపిడి తగిలినా అది పేలి చిటపట శబ్దాలు వస్తాయి. వయోలేట్ రంగు అయోడిన్ ఆవిరులు కూడా వస్తాయి. అందుచేతనే, ఆరిన పదార్ధం మీద అడుగులు వేస్తే ఆ రాపిడికి టపాసులు పేలినట్లు శబ్దాలు వస్తాయి. అంతేకాదు పదార్థాన్ని ఒక ఈకతో తాకినా చిటపట శబ్దాలు వస్తాయి. ఈ మేజిక్ చేసేటప్పుడు వేళ్ళకు, చెవులకు రక్షణ అవసరం. ఈ పేలుడు శబ్దాలు ఎందుకువస్తున్నాయి? ఇందుకు ఏదైనా రసాయన చర్య కారణమా? ఈ చర్యలో ఏర్పడిన పదార్ధాన్ని డైనమైట్ లాగా ప్రేలుడు పదార్థంగా ఉపయోగించుకోగలమా? అయోడిన్ స్పటికాలకు ద్రవ అమ్మోనియా కలిపినప్పుడు ముందుగా అమ్మోనియేటెడ్ నైట్రోజన్ టై అయోడైడ్ అనే ముదురు జేగురంగు అవక్షేపాన్నిస్తుంది. ఇది పేలుడు స్వభావాన్ని కలిగి ఉంటుంది. అది ఆరినప్పుడు ఏ మాత్రం రాపిడి తగిలినా నైట్రోజన్, అమ్మోనియం అయొడైడ్, అయోడిన్లుగా వియోగం చెందుతుంది. అందుచేతనే చిటపటశూలతో పాటు వయోలెట్ రంగు ఆవిరులు (అయోడిన్) వస్తాయి. నేల మీద నారింజ, పర్ పుల్ మచ్చలు ఏర్పడతాయి. సోడియం థయోసలేట్ రావణం (హైపో ద్రావణం) తో కడిగితే ఈ మచ్చలు పోతాయి. నైట్రోజన్ టై అయోడైడ్ చాలా అస్థిరమైనది. నైట్రోజన్ అయోడిన్ పరమాణువుల సైజుల్లో తేడాలున్నాయి. నైట్రోజన్ పరమాణువు సైజులో చిన్నది అయోడిన్ పరమాణువులు పెద్దవి. నైట్రోజన్ పరమాణువు చుట్టూ మూడు అయోడిన్ పరమాణువులను స్థిరంగా ఉంచేందుకు తగినంత ప్రదేశం లేదు. వీటి మధ్య బంధాలు చాలా ఒత్తిడికి లోనై బలహీనపడతాయి. నైట్రోజన్ ట్రి అయోడైడ్ ఏర్పడేందుకు అవసరమైన శక్తికంటే, అది ప్రేలినప్పుడు విడుదలయ్యే శక్తి ఎక్కువ. అందుచేతనే ఈ పదార్ధానికి ప్రేలుడు స్వభావం వచ్చింది. ఏ మాత్రం రాపిడి వచ్చినా పేలిపోతుంది. దీనిని నిల్వచేయరు, రవాణా చేయడం కుదరదు డైనమైట్ లాగా పేలుడును నియంత్రించడం సాధ్యం కాదు. ఆధారం: డా. ఇ.ఆర్. సుబ్రహ్మణ్యం