నీటి పైన ప్రయాణం చేయడానికి తెప్పలు, పడవలు, ఒడలు, స్టీమర్లు మొదలగునవి ఉపకరిస్తాయి. మరి నీటిలోపల ప్రయాణించాలంటే తపస్సు చేసి వరం పొందాలా? అవసరం లేదు. జలాంతర్గామి Sub Marine ఉంటే చాలు. హాయిగా నాటి లోపల ప్రయాణం చేయవచ్చు. మన దేశంలో ప్రయివేటు జలాంతర్గములు లేవు. ప్రభుత్వ నావికా దళం అధీనంలో Indian Navy జలాంతర్గములున్నాయి. దేశ సముద్ర తీర సంరక్షణ కోసం నిరంతరం నావికాదళ సైనికులు ఈ సబ్మెరైన్లలో నీటి లోపల తిరుగుతూ ఉంటారు. మరి మనకోసం కొన్ని సబ్ మెరైన్లు తయారు చేద్దామా? ఎలాగ అంటారా? రండి చేసి చూద్దాం! ఒక నారింజ పండు తీసుకొని దాని తొక్కతీయండి. ఈ అక్కను త్రిభుజాకారంలో ముక్కలుగా కత్తిరించండి. జెల్ పెన్ తో రంధ్రం చేసి అట్టముక్కుతో గొట్టం లాంటి ఆకారంను ఆ రంధ్రంలో అమర్చండి. ఇదే మన సబ్ మెరైన్. ఒక ప్లాస్టిక్ బాటిల్లో నీరు తీసుకొని అందులో మన సబ్ మెరైన్ ను వేసి, మూత మూయండి. ఇపుడు మూతను గట్టిగా నొక్కినట్లయితే నారింజ సబ్ మెరైన్ నీటిలో మెల్లగా క్రిందికి వెళ్ళి మరలా పైకి వస్తుంది. ఇది ఎలా సాధ్యం? నారింజ తొక్కలో సన్నటి రంధ్రాలలో అతి చిన్నని గాలి బుడగలు ఉంటాయి. వీటి వలన తొక్క నీటిలో తేలుతూ ఉంటుంది. బాటిల్ మూతపై గానీ, బాటిల్ కంఠం గానీ నొక్కినట్లయితే ఆ వత్తిడి (పీడనం) నీటి గుండా ప్రయాణించి తొక్కలోని గాలి బుడగలపై ప్రభావం చూపుతుంది. గాలిబుడగల పరిమాణం తగ్గడం వలన ఉత్పవనం Bouancy తగ్గి సబ్మెరైన్ నీటి లోపలికి ప్రయాణం చేస్తుంది. కాసేపటికి గాలి బుడగలు సధాస్థితికి చేరి సబ్ మెరైన్ పైకి చేరుకుంటుంది. నారింజ తొక్కలో పసుపు రంగు భాగం తెల్లటి భాగం ఉంటే బరువుగా ఉంటుంది. కనుక సబ్ మెరైన్ క్షితిజ సమాంతరంగా తేలుతూ వుంటుంది. సబ్ మెరైన్ తోపాటు చిన్నచిన్న సైనికుల్ని కూడా నింపవచ్చు. అగ్గిపుల్లల తలభాగం తుంచి బాటిల్లో వేసినట్లయితే, అవి కూడా నీటిలో సబ్మెరైన్ లతో పాటు పైకి క్రిందకు తిరుగుతూ ఏటాయి. ఎందుకంటే వీటిలో కూడా గాలి బుడగలు ఉంటాయి, కనుక ఎలా వుంది మన జలాంతర్గామి. బావుంది కదూ! ఆధారం: యుగంధర్