మంచి తాజాపూలు 12 తీసుకోండి. వాటి కాడల్ని ఒకే సైజుకు కత్తిరించండి. ఆరు గాజు జాడీలు తీసుకోండి. వీటిలో సమానంగా నీళ్ళు పోయండి. రెండు జాడీల్లో ఒక్కొక్క స్పూను వంతున చక్కెర కలపండి. రెండు జాడీల్లో ఒక స్పూను వెనిగర్ కలపండి. మిగిలిన రెండు జాడీల్లో ఆస్పిరిన్ మాత్రలు పొడిచేసి కలపండి. జాడీలపై పేర్లు రాసి పెట్టండి. ఇప్పుడు ఒక్కో జాడీలో రెండేసి పూలను వుంచండి. 12 జాడీలో రెండేసి జాడీలు ఒకే గాలి, వెలుతురు వచ్చే చోట పెట్టండి. రోజూ బాగా గమనించండి. ఏ ఏ జాడీల్లోని పూలు వాడకుండా ఆరోగ్యంగా వున్నాయో చూడండి. ఇదే ప్రయోగాన్ని ఉప్పు, సోడాఉప్పు లాంటివి కలిపి కూడా చేయవచ్చు. చూడండి. మరి.