ఎక్కడైనా పార్కులలో ఫౌంటేస్ చూసారా! సన్నని నాజిల్ గుండా నీరు పైకి చిమ్ముతూ వుంటుంది. మైసూర్ బృందావన్ గార్డెన్స్ లో రంగురంగుల విద్యుత్తు బల్బుల వెలుగులు రాత్రిపూట ఈ ఫౌంటేస్ చాలా ఆహ్లాదకరంగా వుంటాయి. మ్యూజికల్ ఫౌంటేన్లు అయితే పాటలకు సంగీతానికి అనుగుణంగా నాజిల్ అటు ఇటు వంగుతూ నీటిని అన్ని ప్రక్కలకు పైకి క్రిందకు ఎగజిమ్ముతూ నీరు నాట్యం చేస్తుంది. మారి మనం ఒక ఫౌంటేన్ ను తయారు చేద్దామా! సులభమే రండి చేసి చూద్దాం. కావలసిన పరికారాలు: ఒక హార్లిక్ సీసా, ఒక జగ్గు (లేక బకెట్) 4 స్ట్రాలు, ఇంకు, మరొక బకెట్. హార్లిక్స్ బాటిల్ తీసుకోని దాని మూతకు రెండు రంధ్రాలు చేయాలి. ఒక రంధ్రం గుండా స్ట్రాను 3సెం. మీ. వరకు దూర్చాలి. 3 స్ట్రాలు తీసుకోని ఒకదాని లో ఒకటై దూర్చి టేప్ తో అతికించి పొడవాటి గొట్టం తయారు చేయాలి. దీనిని మూత దూర్చాలి. మూత రంధ్రాల చుట్టూ ఫెవికాల్ కాని , ఎమ్సీల్ గాని పూసి నీరు కారకుండా చేయాలి (పటం బి.) బాటిల్ (పటం ఎ) లో కొంచెం నీరు పోసి సిసా మూతను అమర్చాలి. జగ్గును తీసుకోని దానిలో నిండుగా నీరు పోసి రంగు కోసం కాస్త ఇంకును కలిపి టేబుల్ పై అమర్చాలి. హార్లిక్స్ బాటిల్ ను తలక్రిందులుగాచేసి, వెంటనే చిన్న స్ట్రా జగ్గులోని నీటిలో మునిగేలా చేయాలి. పెద్ద స్ట్రో టేబుల్ ప్రక్కన బకేట్ లో అమర్చాలి (పటం సి). వెంటనే జగ్గులోని రంగునిరు చిన్న స్ట్రా గుండా ఎగబాకి ఫౌంటేన్ లా హార్లిక్స్ సీసాలో చిమ్ముతుంది. అంతే మన ఫౌంటేస్ తయారు! ఎలా సాధ్యం? తలక్రిందులుగా చేయడం వలన హార్లిక్స్ సీసాలోని నీరు పొడవాటి స్ట్రా గుండా క్రిందకు వచ్చేటప్పుడు సీసాలోని గాలి పీడనము తగ్గుతుంది. అపుడు జగ్గులో నీటి పైనున్న వాతావరణపు గాలి పీడనము తగ్గుతుంది. అపుడు జగ్గులో నీటి పైనున్న వాతావరణపు గాలి వత్తిడి వలన రంగు నీరు చిన్న స్ట్రా గుండా ఎగబాకి విరజిమ్మింది. ఈ ప్రక్రియ జగ్గులోని నీరు చిన్న స్ట్రా కు అందుతున్నంత వరకు జరుగుతుంది.