వేదిక మీద ఒక టేబుల్ ఉంది. టేబుల్ మీద ఒక డజను కొవ్వొత్తులు నిలబెట్టి ఉన్నాయి. మెజిషియన్ సుబ్బు చేతిలో అదేదో మంత్రదండం అనిపించే రంగుకర్ర ఉంది. విద్యార్థులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అందరిలోను ఒకటే ఆలోచన, ఈ కొవ్వొత్తులతో ఏం మేజిక్ చేస్తాడొనని. మెజిషియన్ అందరి కోసం చూస్తూ తన చేతిలోని కర్రను అటూ ఇటూ తిప్పుతున్నాడు. “ఈ కొవ్వొత్తులు వెలగాలంటే ఏం చేయాలి?“ అని అడిగాడు. “వాటిని అగ్గిపెట్టెతో వెలిగించాలి.“ అన్నారంతా. “అది సరే, అగ్గిపెట్టెతో వెలగకుండా, అంటే అగ్గిపుల్లను వెలిగించకుండానే, కొవ్వత్తులన్నీ వాటంతట అవే వెలిగేలా చేస్తాను చూడండి“ అంటూ, మెజిషియన్ తన చేతి కర్రను కొవ్వొత్తుల మీదుగా అటూ ఇటూ కదిపి “హాంఫట్.“ అన్నాడు. అంతే కొవ్వొత్తులన్నీ వాటంతట అవే ఒకదాని తర్వాత ఒకటిగా వెలిగాయి. అంతా చప్పట్లు కొట్టారు. మెజిషియన్ ఏం మంత్రం వేశాడో అనుకున్నారు కొంతమంది. కాని కొందరు తెలివైన పిల్లలకి అనుమానం వచ్చింది. ఇందులో ఏదో సైన్స్ రహస్యం ఉంటుందని, సహజంగానే చురుగ్గా ఉండే అనిష్, సాకేత సైన్స్ టీచరును “అగ్గిపుల్లలతోనో, లైటర్ తోనో వెలిగించకుండానే కొవ్వొత్తులు ఎలా వెలిగాయ మేడమ్?“ అని అడిగారు. “ఇందులో మాయా లేదా మంత్రం ఏమీ లేవు. మెజిషియన్ రసాయన శాస్త్రం బాగా చదువుకున్నవాడు. ఈ మెజిక్ లో అతను ఉపయోగించింది పచ్చభాస్వరం. ఈ మేజిక్ మనం చెయ్యొచ్చు. కాని జాగ్రత్త అవసరం సుమా.“ సైన్స్ టీచర్ లక్ష్మీ వివరంగా చెప్పింది. ఇందుకు కావల్సినవి: పచ్చభాస్వరం, కార్బన్ డై సల్ఫేట్, ఒక డజను ఇంతకుముందు వెలిగించని కొవ్వొత్తులు, చైనాడిష్, డ్రాపర్ బాటిల్, గాజుసీసా. ఒక చైనాడిష్ (పిగాణి గిన్నె)లో సుమారు 10 మి.లీ. కార్బన్ డై సల్ఫేట్ ను తీసుకొని ఒక పచ్చభాస్వరం ముక్కను (ఒక వేరుశనగ గుడ్డు పరిమాణంలో) నీటిలో ఉండగానే చాకుతో కత్తింరించి, శ్రావనముతో పట్టుకుని (చేతితో ముట్టుకుంటే కాలుతుంది) వెంటనే చైనాడిష్ లోని కార్బన్ డై సల్ఫేడ్ లో వేయాలి. ఫాస్ఫరస్ ఈ ద్రావణిలో కరుగుతుంది. ఫాస్ఫరస్ ద్రావణాన్ని డ్రాపింగ్ బాటిల్ లో పోసి, వెడల్పు మూతి ఉన్న గాజుసీసాలో ఉంచి మూతపెట్టాలి. ఈ ద్రావణం కాగితం, గుడ్డ వంటి వాటి మీద పడితే అవి అంటుకుని మండుతాయి. కాబట్టి జాగ్రత్త అవసరం. ఒక డజను కొవ్వొత్తులను వాటి అడుగుభాగాలను కొద్దిగా కరిగించి టేబుల్ మీద ఒకదాని పక్కన ఒకటిగా నిలబెట్టాలి. డ్రాపర్ బాటిల్ ను బయటకి తీసి కొవ్వొత్తులను వరుసగా ఒక్కొక్క చుక్క ఫాస్ఫరస్ ద్రావమంతో తడపాలి. సుమారు 10-15 నిమిషాల్లో ఒకదాని తర్వాత ఒకటి వాటంతటే అవే వెలుగుతాయి. ఈ మేజిక్ ఉన్న రసాయనశాస్త్ర రహస్యం తెలుసుకుందాం. వత్తులను ఫాస్ఫరస్ ద్రావణంలో తడిపిన కొన్ని నిమిషాల్లో ఎక్కువ భాష్పశీలత ఉన్న కార్బన్ డై సల్ఫైడ్ ద్రావణి ఇగిరిపోతుంది. మిగిలిపోయిన ఫాస్ఫరస్ గాలిలో మండడం వల్ల కొవ్వొత్తులు వెలుగుతాయి. (తెల్ల భాస్వరం చాలా చురుకైనది. దీనికి విషస్వభావం ఉంది. నీటిలో కరగదు. కార్బన్ డై సల్ఫైడ్ తో కరుగుతుంది. గాలి తగిలితే మండుతుంది. అందుచేతనే దీన్ని నీటిలో నిల్వ ఉంచుతారు. ఇది నెమ్మదిగా ఎర్ర భాస్వరంగా పరివర్సనాన్ని వేగవంతం చేస్తాయి. తెల్లభాస్వరంలో కొంత ఎర్పభాస్వరం కలిపి ఉండడం వల్ల అది పసుపురంగులో ఉంటుంది. ఈ కారణం చేతనే తెల్లభాస్వరం అని కూడా అంటారు. భాస్వరం శరీరం మీద పడితే కాలి గాయాలవుతాయి. ఆధారం: ఇ.ఆర్. సుబ్రహ్మణ్యం