పిల్లలూ, ఇప్పుడు మనము సరదా సరదా హెలికాప్టర్ ను తయారుచేద్దాం చాలా సింపుల్. కావలసిన వస్తువులు : ఒక చిత్తు కాగితం. చేసే విధానం: ఒక చిత్తు కాగితాన్ని తీసుకొని దాన్నుంచి 3x6 cm2 కొలతలు గల దీర్ఘచతురస్రాకార రూపాన్ని కత్తిరించుకోండి. (కత్తెర లేకపోతే చేతో కూడా మడిచి చించుకోవచ్చును. ఇపుడు పటంలో చూపినట్లు ఆ కాగితం ముక్కను కత్తిరించండి. AB,CD,EF, లు కొలతలు పడ్డ రేఖలు. CD దూరం = EF దూరము = DE దూరము అయ్యేలా చేయండి. AB కొలత CF రేఖకు లంబంగా ఉండడమే కాకుండా అది CF రేఖకు 1 సెం.మీ. దూరంలో కొన ఆగిపోయేలా కత్తిరించుకోవాలి. ఇపుడు CR అంచు EH రేఖ మీద పడేలా DG దగ్గర మడవాలి. అలాగే FS అంచు DG రేఖ మీద పడేలా EH మీదుగా మడవాలి. మీ దగ్గర ఇప్పుడు T ఆకారంలో పటం చూపిన రూపం తయారవుతుంది. ఇప్పుడు AQ అంచు నీ వైపు వంగేలా మడవాలి. అలాగే PA అంచు నీకు దూరంగా ఉండేలా అటువైపు మడవాలి. ఇక పేపరు హెలికాఫ్టరు తయారయినట్టే. ఇక అసలు విషయానికొద్దాం. ఆ వస్తువుకు EFGH మడత మీద పట్టుకొని ఒక్కసారిగా వదిలేయండి. మీరేం గమనించారు? మీ పరిశీలనకు కారణమేమిటి? మీ జవాబును 25.3.2004 లోగా ఎడిటర్ చిరునామాకు చేరేలా పంపండి. యథా ప్రకారం ప్రధమ (30), ద్వితీయ (20), తృతీయ (10) రూపాయలు బహుమతులుంటాయి. నిర్వహణ : ప్రొఫెసర్ ఎ. రాయచంద్రయ్య.