ఆటలు, కృత్యాలు -బలం మరియు చలనం ప్రాథమిక సమాచారం ఈ ఆట వలన పిల్లలు బలం అనే భావనను నేర్చుకొంటారు. బలం అంటే నెట్టడం లేదా లాగడం అని అలాగే చలనంలో ఉన్న వస్తువుపై బలం ఉపయోగించినపుడు వేగంలోగానీ మరియు దిశలో గానీ లేదా రెండింటిలో మార్పు ఉండవచ్చని అవగాహన చేసుకొంటారు. సమయం : 01 గంట 20 నిముషాలు పరిచయం: ప్రస్తుతం ఎంతమంది ఉపాధ్యాయులు సృజనాత్మకంగా భొదిస్తున్నారు? ఎంతమంది బొధనాభ్యసనం ఆటలు,కృత్యాలు మరియూ ప్రహేళికల తో ఉంటే బాగుంటుందని అనుకొంటున్నారు ? ఈ కృత్యం మూడింటిని కలిగిఉంది : ఆటలు,కృత్యాలు మరియూ ప్రహేళికలు. ఈ కృత్యం ద్వారా ఉపాధ్యాయులు ఆటలు,కృత్యాలు,ప్రహేళికలు ద్వారా కొన్ని భావనలను బోధించవచ్చని తెలుసుకొంటారు. ఈ కృత్యాన్ని యదాథతంగా తరగతిగదిలో ఉపయోగించవచ్చు. అజీమ్ ప్రేమ్ జి ఫౌండేషన్ వారు భావనను అందించగా బెంగుళూరు Madrat Games వారు ఈ ఆటలను రూపొందించారు. లక్ష్యం: మొదటి స్థాయి ఆట: విద్యార్థులు నిజజీవితంలో వారు నిర్వర్తించే వివిధ పనులలో నెట్టడం,లాగడం వంటి చర్యలను గుర్తించడానికి సహాయపడడం . ఉన్నత స్థాయి ఆట : ఈ ఆట వలన పిల్లలు బలం అనే భావనను నేర్చుకొంటారు. బలం అంటే నెట్టడం లేదా లాగడం అని అలాగే చలనంలో ఉన్న వస్తువుపై బలం ఉపయోగించినపుడు వేగంలోగానీ మరియు దిశలో గానీ లేదా రెండింటిలో మార్పు ఉండవచ్చని అవగాహన చేసుకొంటారు. సోపానాలు: మొదటి స్థాయి, ఉన్నత స్థాయి ఆటలను పి.డి.ఫ్. రూపం లో ఇక్కడ ఇచ్చారు. మొదటిస్థాయి ఆట – (pull) లాగండి or (Push) త్రోయండి. ఉన్నతస్థాయి ఆట – (Force) బలము మరియు (Motion) కదలిక. శాస్త్రవేత్తలను తయారుచేసే దిశలో ప్రాథమిక సమాచారం పిల్లలు సహజంగానే జిజ్ఞాసను కలిగిఉంటారు. ప్రతి క్రొత్త విషయాన్ని తెలుసుకోవాలని అన్వేషించాలను వూవిళ్ళురుతుంటారు. చక్కటి ప్రణాళికతో పరిశీలన, కొలతలు, వర్గీకరించడం మరియు నమోదుచేయడం వంటి నైపుణ్యాలను 2 , 3 తరగతులలనుండే పెంపొదించవచ్చు పాఠ్య ప్రణాళిక వివరాలు నిడివి : 03 గంటలు పరిచయం: పిల్లలు సహజంగానే జిజ్ఞాసను కలిగిఉంటారు. ప్రతి క్రొత్త విషయాన్ని తెలుసుకోవాలని అన్వేషించాలను వూవిళ్ళురుతుంటారు. చక్కటి ప్రణాళికతో పరిశీలన, కొలతలు, వర్గీకరించడం మరియు నమోదుచేయడం వంటి నైపుణ్యాలను 2 , 3 తరగతులలనుండే పెంపొదించవచ్చు.శాస్త్రీయ దృక్కోణానికి ఈ నైపుణ్యాలు పునాది వంటివి. విద్యార్థుల రోజువారి కార్యక్రమాల్లో కొన్ని కృత్యాలను భాగంగా చేయడం ద్వారా ఈ నైపుణ్యాలను ఎలా అభివృద్ధి చెయ్యవచ్చో ఈ వ్యాసం వివరిస్తోంది. సాధారణ కృత్యాలకు కూడ ఈ నైపుణ్యాలను విస్తరించవచ్చు. లక్ష్యం: విద్యార్థులలో శాస్త్రీయదృష్ఠిని అభివృద్ది చెయ్యడం. అన్వేషణా నైపుణ్యాన్ని పెంపొదించడం. పరిశీలన మరియు సమాచార నైపుణ్యాన్ని పెంచడం. ఙ్ఞానతృష్ణను రగల్చడం. ప్రకృతి ఆరాదనకు సహాయపడడం. సోపానాలు: పిల్లలు టివి చూడడమైనా లేదా ఆటాడుతున్నా వారిలో అవధారణ చాలా కొద్ది సమయం మాత్రమే ఉంటుందనేది నిరూపించబడినది. కావున వారికోసం రూపొందించే కృత్యాలు వారిని ఆకర్షించేలా మరియు కొంత సంక్లిష్ఠతను కూడా కలిగిఉండాలి. పిల్లలలోని అత్యధిక సామర్థ్యాన్ని ఉపయోగించుకొనేందుకు వారిలో అధిక ప్రేరణను కలిగించాలి. కావున వారు చేసే తొలికృత్యాలు సరలంగా ఉన్నా తరువాత కృత్యాలు దశలు వారీగ సంక్లిష్ఠతను కలిగిఉండాలి కానీ సంక్లిష్టత వారిని ఆ కృత్యాన్ని వీడేలా ఉండకూడదు. విఙ్ఞానశాస్త్రపెట్టె ఈ భావనను అవగాహన చేసుకోవడానికి విఙ్ఞానశాస్త్రపెట్టెను అన్వేషించవచ్చు. ఇవి పిల్లలలోపరిశీలన, కొలచడం, విభజించడం,నమోదు చెయ్యడం, సమాచారాన్ని అందించడం వంటి నైపుణ్యాలను పెంపొందించే సామాగ్రిని కలిగి ఉంటాయి. ఈ సామాగ్రిని ప్రతి విద్యార్థికి పెట్టెలోనో , బుట్టలోనో ,సంచిలోనో ఉంచి దానికి ఆ విద్యార్థిపేరుని వ్రాయాలి. ఈ పెట్టె పెన్సిల్, పెన్ను ,రబ్బరు, అద్దాలు భూతద్దం , జ్యామితి పరికరాలు అయస్కాంతాలు మొదలైన వాటిని కలిగిఉండవచ్చు. ఈ పధ్డతి వలన పిల్లలమధ్య సామాగ్రి కోసం తగువులు ఉండవు. నిజానికి గుర్తుపట్టడమనే నైపుణ్యాన్ని వారి పెట్టెలను గుర్తించడం ద్వారా ప్రారంభించవచ్చు. పాఠశాలే ప్రతి విద్యార్థికి ఇలాంటి సామాగ్రిని అందించడం చాలా కష్టం కావున కావలసిన సామాగ్రిని విద్యార్థులే తెచ్చుకోవాలి. పరిశీలన : పరిశీలనా నైపుణ్యం శాస్త్రీయ-పరిశోధనకి ఉండాల్సిన ప్రాథమిక నైపుణ్యం. ఇది విద్యార్థులలో నమ్మకాన్ని బలపరచడమే కాక , ఉత్సాహాన్ని, సామార్థ్యాన్నిఇస్తుంది. పరిశీలన అన్వేషణను కూడా ఉత్సాహపరుస్తుంది. పరిశీలిన పరోక్షంగా అనుకోకుండా గానీ, ఉద్దేశ్యపూర్వకంగా ప్రత్యక్షంగాగానీ ఉండవచ్చు. విద్యార్థులలో పరిశీలనా నైపుణ్యాన్ని అభివృధ్ధి చేసేందుకు వారిని తరచుగా నీవేమి చూస్తున్నావు? అని ప్రశ్నించవచ్చు. దీని వలన అతడు పరిశీలించాల్సిన అంశంపై దృష్టిని కేంద్రీకరిస్తాడు. మొదటి కృత్యం: ఒకటవ తరగతికి కావలసిన సామాగ్రి: ఒక ప్రకృతిని చూపించే చిత్రం, సంత జరిగే ప్రదేశం కానీ లేదా ఇంకేదైనా సూక్ష్మంగా పరిశీలించ గల అంశాలను కలిగినచిత్రం. ఉదాహరణకు ప్రకృతిచిత్రం పరిశీలించకుండానే కనిపించే అంశాలు పెద్ద పెద్ద పర్వతాలు, నది, పడవ,కొట్టం, ఒకచెట్టు సూక్ష్మమైన విషయాలు,: చెట్టుమీద పక్షి,బోటులో ఉన్నతెడ్డు,కొట్టం చుట్టూ ఉన్న కంచె-పర్వతాల నీడ మరియు మేఘాలు మొదలైనవి. సూచనలు: ఇచ్చిన చిత్రంలోని వివిధ అంశాల జాబితాను తయారుచెయ్యమని విద్యార్థులకు చెప్పండి. వారు చిత్రంలో గుర్తించకుండా మరచిపోయిన అంశాలకు సంబంధించిన ప్రాంతాన్ని జాగ్రత్తగా పరిశీలించమని చెప్పండి. పిల్లలు ప్రతి విషయాన్ని నిశితంగా పరిశీలించడం మొదలు పెట్టిన తరువాత వారికి పెన్సిల్, లేదా ఒక స్టిక్కెర్, రబ్బరు మొదలైన వాటిని బహుమతులుగా ఇవ్వవచ్చు. రెండవ కృత్యం: (మూడవ తరగతి కోసం) కావలసిన సామాగ్రి: ఒక పుష్పం (తాజాది లేదా ఎండినది) జీవంలేని కీటకాలు, ఒక చిన్న మొక్క మొదలైనవి. ఉపాధ్యాయుడు ఇచ్చిన సూక్ష్మదర్శిని లేదా భూతద్దం (తరగతిని కొన్ని బృందాలుగా విభజించి ప్రతి బృందానికీ ఒక భూతద్దాన్ని ఇవ్వాలి). సూచనలు: విద్యార్థి మొదట ఇచ్చిన వస్తువుని సాధారణంగా పరిశీలించి తన పరిశీలనలను నమోదు చేస్తాడు. తరువాత విద్యార్థి ఆ వస్తువుని సూక్ష్మదర్శిని లేదా బూతద్దం సహాయంతో పరిశీలిస్తాడు.(ఈ కృత్యం విద్యార్థిలో ఉత్సాహాన్ని రేకెత్తిస్తుంది) ఉదాహరణకు: మొక్క సాధారణ పరిశీలనలో కాండము,పత్రము, పుష్పము, వేర్లు, ఆకర్షక పత్రాలు, మొదలైనవి. భూతద్దం ద్వారా: పత్రంలోని ఈనెలు, పుష్పం లోని కేశరావళి,అండాశయం, కాండము మీద కనుపులు, మొదలైనవి పరిశీలిస్తాడు. ఉపాధ్యాయునికి సూచన: ఉంటే దూరం లోనున్న వస్తువులను దగ్గరగా చూడడానికీ ఉపయోగపడే సాధనంటెలెస్కొప్ అని తెలుపవచ్చు. అందుబాటులో ఉంటే దీనిని ప్రదర్శించవచ్చు. దీని పనిసూత్రం వివరించక పోయినా అది దూరం వస్తువులను దగ్గరకి ఎలా చూపిస్తుందోవిద్యార్థులకు చూపాలి. కొన్ని విషయాలు : విఙ్ఞానశాస్త్రంలో రాశులు మరియు కొలతలకు సంబదించిన నైపుణ్యాలు ఆవశ్యకమైనవి, క్రమంగాఉన్నత తరగతులలో కొలతలు సంక్లిష్టమయ్యే కొద్దీ గణిత నియమాలు కూడా దీనికి తోడవుతాయి. కానీ ప్రాథమిక కొలతలైన పొడవు,వెడల్పు మరియు ఎత్తులను సాదారణ పనిముట్లను ఉపయోగించి కొలవవచ్చు. ఈ కృత్యాలకు సరలమైన సంకలనము వ్యవకలనాలను జత చెయ్యవచ్చు. రెండవ కృత్యం : రెండు మరియుమూడవ తరగతులకు : అవసరమైన సామాగ్రి: 12 ఇంచులు కొలతగల ఒక స్కేల్ మరియు 06 ఇంచులు కొలత కలిగిన ఒక స్కేల్, ఒక దారపు ఉండ/వివిధ పొడవులలో ఉన్న కట్టెలు/వివిధ పరిమాణాలలో గాజులు /పెద్ద మరియు చిన్న రాల్లు? సూచనలు: పొడవు/పొట్టి/దగ్గర/ దూరం ఎత్తు భావనలను వివరించాక తరతి గదిలో ఎవరు ఎత్తుగా ఉన్నారు ఎవరు పొట్టిగా ఉన్నారు లాంటి అభ్యాసాలను చేయించవచ్చు. అలాగే పొడవైనవి మరియు పొట్టికట్టెలు లేదా పెట్టెలను గుర్తించవచ్చు మరియు వీటిని ఆరోహణా క్రమంలో ఉంచవచ్చు. ఒక రాళ్ళ కుప్ప నుండి చిన్నవీ పెద్దవీ వేరు చెయ్యవచ్చు. ఖచ్చితమైన కొలతలకి సంబందించినవి అంటే ఒక బల్ల యొక్క పొడవుని లేదా పెన్సిల్ బాక్స్ పొడవుని కొలవమని చెప్పవచ్చు. కొంత కొత్తదనాన్ని జోడించడానికి రెండు బల్లల మధ్య లేదా రెండు కిటికీల మధ్య పొడవుని దారం సహాయంతో కొలిచి ఈ దారాన్ని చిన్నగా సరైన పరిమానంలో మడచి తరువాత స్కేల్ తో పోల్చవచ్చు. ఇక్కడ ప్రాథమిక గణితాన్ని బోధించవచ్చు. కిటికీ పొడవు = 3 దారల పొడవు ఒక్కొక్క దారపు పొడవు = 10 ఇంచులు కావున కిటికీ పొడవు 3X10=30 ఇంచులు లేదా 10+10+10=30. అలాగే వివిధ పరిమాణాల గాజుల వ్యాసాన్ని, గాజు పరిమాణాన్ని కాగితము పై ఉంచి వాటి బాహ్య లేదా అంతర పరిదిని గుర్తించి కనుగొన వచ్చు. అన్నీ ఒక గూటి పక్షులే: ప్రాథమిక దశలలోనే పోలికల ఆధారంగా వస్తువుల సేకరించడం వర్గీకరించడం చెయ్యడాన్ని ప్రొత్సహించాలి. ఇచ్చిన రాసి నుండి ఒక లక్షణం ఆధారంగా వేరు చెయ్యడం లాంటిది.కృత్యాలు: వివిధ రకాలైన మూతలు (టిన్, ప్లాస్టిక్,లోహపు) వివిధ రంగుల బంతులు(వివిధ రకాలైన దుస్తులు(సాక్స్,రుమాలు,టవల్)వివిధ జ్యామితి ఆకారాలు గల వస్తువులు మొదలైనవి గలవి. ఇలా కలసిన రాసి, వస్తువులను వర్గీకరించమని చెప్పండి.ఉదాహరణకు అన్ని ప్లాస్టిక్ వస్తువులు (పదార్థం ఆధారంగా) అన్నీ ఎర్రవి (రంగు ఆధారంగా) అన్నీ గుండ్రనివి(ఆకారం ఆధారంగా) మొదలైనవి. ఇంకా వీలైనన్ని రకాలుగా వర్గీకరించమని చెప్పండి అంటే జ్యామితి ఆకారాలు ఆధారంగా, దుస్తులు మొదలైనవాటి లాగా. ఉపాధ్యాయులకు సూచన : విద్యార్థులను పై వాటిని చిత్రించమని చెప్పి వాటికి వరుస సంఖ్యలను కేటాయించవచ్చు. ఙ్ఞానాన్ని ఇతరులతో పంచుకోవడం కూడా అభ్యసనమే: పిల్లలలొ అభివృధ్ధి చెయ్యాల్సిన ముఖ్యమైన నైపుణ్యాలు పరిశీలనలను నమోదు చెయ్యడం మరియు సంభాషించడం. పిల్లలు పరిశీలించే, కొలిచే, వర్గీకరించే వాటిని సరలమైన భాషలో నమోదు చెయ్యడాన్ని ప్రొత్సహించాలి. ప్రాథమిక స్థాయిలో వచనరూపంలో నమోదు చెయ్యడం సాధ్యంకాక పోవచ్చు. వారి పరిశీలనలను బొమ్మలరూపంలో నమోదు చేయడం ఆసక్తికరంగా ఉంటుంది. ఇది ఒకరకంగా సృజనాత్మక కృత్యం మరియు నమోదుచేసే నైపుణ్యం కూడా. నమోదు చేసిన తరువాత వారు ఆ విషయాలను తరగతికి ఉపాధ్యాయునికి చెప్పగలగాలి. ఈ విధంగా ఙ్ఞానాన్ని పంచుకోవడం వలన విద్యార్థులలో సమాచారనైపుణ్యం పెరిగి విద్యార్థుల మధ్య మంచి సంభాషణలకు దారి తీస్తుంది. ఉదాహరణకు ఒక విద్యార్థి ఒక చిన్న మొక్కను పరిశీలిస్తే దానిని బొమ్మగా చిత్రీకరించవచ్చు అలాగే భూతద్దం తో చూసినప్పుడు ఎలాకనిపిస్తోందో కూడా చిత్రీకరించచ్చు. విద్యార్థులకు సూక్ష్మదర్శినిని ఉపయోగించి కొత్త వస్తువులను పరిశీలించవచ్చో తెలపాలి. ఈ కృత్యం విద్యార్థులకు వర్ధనం భావనను బోధించడానికి ఉపయోగించవచ్చు. అలాగే వివిధ పరిమాణాల గాజుల వ్యాసాన్ని, గాజులను కాగితము పై ఉంచి వాటి బాహ్య లేదా అంతర పరిదిని గుర్తించి కనుగొనవచ్చు. నీటిలో మునిగే వస్తువులు మరియు తేలేవస్తువులు - ది స్కూల్ వాటర్ పోర్టల్ రిసోర్స్ వివరాలు : ప్రాథమిక సమాచారం నీటిలో కొన్ని వస్తువులు ఎందుకు మునుగుతాయి ? కొన్ని వస్తువులు ఎందుకు తేలుతాయి ? ఈ క్రింది కృత్యం మరియు గేయం పిల్లలకు ఈ భావనను కఠిన పదాలైన సాంద్రత మొదలైన వాటి అవసరం లేకుండా పరిచయం చేయడానికి ఉపయోగపడుతుంది. నిడివి : 10 గంటలు పరిచయం: పిల్లలకు నీటిలో కొన్ని వస్తువులు మునుగడం , కొన్ని వస్తువులు తేలడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఈ క్రింది కృత్యం ద్వారా ఈ భావనను వారికి వివరించండి. సోపానాలు: మొదటి రోజు : సామాగ్రి : సగభాగాన్ని నీటితో నింపిన టబ్బు ఒకటి కొన్ని తేలే వస్తువులు మరికొన్ని మునిగే వస్తువులు (స్పాంజి, కట్టే ముక్క, పెన్సిల్,రబ్బరు ఖాళీ బాక్స్ మొదలైనవి ) పద్ధతి: పిల్లలకు మునగడం మరియు తేలడం , భావనలను పరిచయం చెయ్యండి. సామాగ్రిలో పేర్కొన్న వస్తువులను ఒక్కోక్కటిగా నీటిలో వేయండి. ఏ వస్తువు నీటి అడుగుగుకు చేరుతుందో, ఏ వస్తువు నీటిపై తేలుతుందొ పరిశీలించమనండి. పిల్లలు అందరు వస్తువు మునిగినప్పుడు మునిగిందని తేలినప్పుడు తేలిందని సామూహికంగా చెప్పవచ్చు. రెండవ రోజు దీని కోసంఉపాధ్యాయుడు ముందు రోజే తరగతిగదిని సంసిధ్ధం చేయాలి. తరగతిని రెండు విభాగాలుగా చెయ్యండి ఒకటి మునిగేది రెండవది తేలేది వారి గ్రూపు ఆధారంగా వారిని మునిగే లేదా తేలే వస్తువుని తెమ్మని చెప్పండి పిల్లలను ఒక టవ్వాల్ కూడా తెచ్చుకోమని చెప్పండి సామాగ్రి సగబాగాన్ని నీటితో నింపిన రెండు టబ్బులు మునిగేవి, తేలేవి labels పాఠశాలలో సాధారణంగా లభ్యమయ్యే పదివస్తువులు కొన్ని టవ్వాళ్ళు విడిగా (వీటిని మరిచి పోయిన పిల్లలకోసం) పద్ధతి ప్రతి విద్యార్థిని పిలిచి అతను ఏ బృందంలో ఉన్నాడో కనుక్కోండి. వారిని వారి వస్తువులను తమకు చెందిన టబ్బులో ఉంచమనండి. అది సరైనదైతే వారు ఆ బృందంలోనే ఉంటారు లేకపోతే ఎదుటి బృందంలో చేరుతారు. ఏ బృందంలో ఎక్కువ మంది విద్యార్ధులు ఉంటే ఆ బృందమే విజేత ఉపాధ్యాయునికి సూచన: ఏ విద్యార్థి అయినా నీటిలో తేలే వస్తువుని, మునిగేలా చేయగలడా ? (ఖాళీగా ఉన్న వస్తుని మరేవస్తువుతోనైనా నింపి) ఏ విద్యార్థి అయినా నీటిలో మునిగేవస్తువుని, తేలేలా చేయగలడా ? ( ఒక లోహపు రేకుని పడవగా చేయడం మొదలైన వాటి ద్వారా) గేయం ఎందుకు ? ఎందుకు ? ఎందుకు ? కొన్ని వస్తువులు నీటిలో తేలుతాయి ఎందుకు ? ఎందుకు ? ఎందుకు ? కొన్ని వస్తువులు నీటిలో మునుగుతాయి తేలే వస్తువుల బరువు నీటికన్నా తక్కువ,తక్కువ తక్కువ అందుకే అవి నీటిలో తేలుతాయి, నీటిలో తేలుతాయి అందుకే అవి నీటిలో తేలుతాయి, నీటిలో తేలుతాయి మునిగేవస్తువులు బరువు నీటికన్నా ఎక్కువ, ఎక్కువ, ఎక్కువ అందుకే అవి నీటిలో మునుగుతాయి, నీటిలో మునుగుతాయి బలాలు - టీచర్ ప్లస్ రిసోర్స్ వివరాలు : ప్రాథమిక సమాచారం మనంచేసే వివిధ పనులలో బలాలు : మన జీవితం సాఫీగా జరగడానికి ఎన్నో బలాలు తోడ్పడుతున్నాయి. ఈ బలాలలో కొన్ని సహజమైనవి కొన్ని కృత్రిమమైనవి. సహజబలాల ఉదాహరణకు గురత్వాకర్షణశక్తి, హృదయ రక్తప్రసరణకు అవసరమైనశక్తి. మనకు తెలియకుండా మనపై పనిచేసే శక్తులు చాలా ఉన్నాయి. పిల్లలు ఒకరినొకరు తోసుకోవడం,వస్తువులను తోయడం, బెలూనును ఊదడం, లేదా వాననీటిలో తేలియాడే కాగితపు పడవలను చేయడం వీటన్నింటికి శక్తి అవసరం. మనం చేయాల్సిందల్లా వారికి ఇలాంటి అవకాశాలను కల్పిస్తూ వాటి వెనుక గల విజ్ఞానాన్ని అవగాహాన చేసుకోవడానికి సహాయపడడమే. ముందుగా మనం చేయాల్సింది పిల్లలకు వివిధ వస్తువులపై పనిచేస్తున్న బలాలను పరిశీలించడానికి తగిన అవకాశాలను కల్పించడం. రబ్బరుని క్రిందికి పడవేయడం, బల్లను తోయడం, బెలూనుని ఊదడం లాంటి పనులను విద్యార్థులకు ప్రదర్శించాలి.బలాల గురించి మరింతగా అవగాహన చేసుకోవడానికి అనువుగా వారికి వేగంగా వెళ్లడం, వేగాన్ని తగ్గించడం, దిశను మార్చుకోవడం, ముందుకు తోయడం మొదలైన పదాలను పరిచయం చెయ్యాలి. కిందకి దొర్లించడం : వేగంగాదొర్లే వస్తువు యొక్క శక్తిని తెలుసుకోవడానికి బాగా ఉపయోగపడేది ఏటవాలు తలం. పిల్లలు చాలా సులభంగా ఏటవాలు తలంపై అన్ని వస్తువులు దొర్లవని తెలుసుకొంటారు. విద్యార్థులను కొన్ని బృందాలుగా విభజించండి. వారికి కొన్ని గోళీలు, రబ్బర్లు ఇవ్వండి. ఈ వస్తువులను వాటి దొర్లేశక్తిని అంచనా వేసి ఈ క్రింది పట్టికను పూరించమని చెప్పండి. అవి ఆ వస్తువు దొర్లుతుంది/దొర్లదు /ఒక నిర్ణీత కోణంలో ఉంచితేనే దొర్లుతుంది. బొమ్మలో చూపిన విధంగా ఒక ఏటవాలు తలాన్ని ఏర్పాటు చేయండి. పిల్లలను వారికిచ్చిన వస్తువులను ఆ ఏటవాలు తలంపై దొర్లించమని చెప్పండి. ఈ ప్రయోగాన్ని నిర్వహించిన తరువాత వారి అంచనాలను, ప్రయోగఫలితాలతో సరిపోల్చుకోమని చెప్పండి. దొర్లని వస్తువులు ఒక ప్రత్యక కోణంలో ఉంచితే దొర్లుతాయేమోనని కనుక్కోమని పిల్లలకు చెప్పండి. ఉదాహరణకు ఒక పెన్సిల్ ను నిలువుగా ఉంచినప్పటికంటే అడ్డంగా ఉంచినప్పుడు ఎక్కువుగా దొర్లుతుంది. పిల్లలు కొన్ని వస్తువులు వేగంగా దొర్లుతాయని, కొన్ని నిదానంగా దొర్లుతాయని తమ పరిశీలన వలన తెలుసుకొంటారు. దీనికి గల కారణం ఏంటో ఆలోచించమని చెప్పండి? ఏటవాలుతలం యొక్క ఎత్తుని కొద్దిగా పెంచండి లేదా తగ్గించండి ? వస్తువులు దొర్లేవేగంలో ఏమైనా తేడాలున్నాయా గమనించండి ? ఏటవాలుతలంపై వస్తువుల వేగం ఆ వస్తువు యొక్క ఆకారం పైననేగాక ఏటవాలు తలం యొక్క కోణం , తలం యొక్క స్వభావంపై ఆధారపడి ఉంటుంది. ఏటవాలుతలంపై ఒక గరుకైన (sand paper) కాగితాన్ని ఉంచి, ప్రయోగాన్ని మరొకసారి చేయమని చెప్పండి. ఈ ఫలితాలను ముందు నిర్వహించిన ప్రయోగం యొక్కఫలితాలతో పోల్చి వీటికి గల కారణాలను కనుక్కోమని చెప్పండి. బలాల గురించి పిల్లలకు బోధించడానికి జారుడుబల్ల చాలా అనువైనది ఎందుకంటే పిల్లలు ఈ జారుడుబల్లపై ఆడడానికి చాలా ఇష్టపడుతారు. విద్యార్థులను రెండు లేదా అంతకంటే ఎక్కువ బృందాలుగా విభజించండి. ఒక బృందాన్ని జారుడుబల్లపై జారమని చెప్పండి. మిగిలిన పిల్లలను ఈ కృత్యాన్ని పరిశీలించి తమ పరిశీలనలను నమోదు చేయమని చెప్పండి. అలాగే ఎవరు వేగంగా జారారు ? ఎవరు మధ్యలోనే నిలబడి పోయారు ? ఎవరు జారడానికి బయపడ్డారు ? జారుడుబల్ల ఉపరితలం నునుపుగా ఉందా ? గరుకుగా ఉందా ? పిల్లలు, మనం దొర్లేవేగం మనం ఆ తలంపైకలిగించే బలంపై ఆధారపడి ఉంటుందని గ్రహిస్తారు. జారుడుబల్ల రాయితోకానీ రబ్బరుతో కానీ చేసినదైతే వారు జారగలరా అని విద్యార్థులను అడగండి. ఇప్పుడు ఒక అట్టపెట్టెపై కూర్చొని జారమని చెప్పండి. వారు ఎంత సులభంగా జారగలిగారు ? ఇంతకు ముందు జారినంత వేగంగా జారగలిగారా ? లేదా ? లేకపోతే వారి దృష్టిలో దీనికిగల కారణమేమి? 2, 3 తరగతుల విద్యార్ధులు వివిధ పనులకు కారణం వివధరకాలైన బలాలు కారణమని తెలుసుకోగలిగితే చాలు, కానీ 4వ తరగతి విద్యార్థులైతే అది ఎలా జరిగింది? ఎందుకు జరిగింది అన్నది ? కూడా అవగాహనచేసుకోవడం అవసరం. ఉదాహరణకు వీరికి గురుత్వాకర్షణ శక్తి గురించి కూడా కొద్దిగా వివరించవచ్చు. వస్తువులను భూమి తన వైపునకు ఆకర్షిండాన్ని గురుత్వాకర్షణ శక్తి అంటారు. అందుకనే వస్తువులన్నీ క్రిందకు పడుతాయి లేదా జారుతాయి ? అన్ని వస్తువులుజారుడుతలంపై నుండిక్రిందకు పడుతాయా ? ఈ ప్రయోగాన్ని నిర్వహించడానికి అవసరమైన సామాగ్రి ఈకలు కాగితాలు ఆకులు రాళ్ళు సెల్లో టేప్ గోళీలు పిల్లలకు అపాయాన్ని కలిగించే వస్తువులు లేకుండా జాగ్రత్త పడండి. పిల్లలకు ప్రయోగాన్ని ఎలా నిర్వహించాలో ముందుగానే వివరించండి. పిల్లలకు వస్తువులను నిర్ణయించిన ఎత్తు నుండే జారవేయమని చెప్పండి. అవి ఎంత వేగంగా భూమిని చేరాయో నమోదు చేసుకోమని చెప్పండి. ముందుగా పిల్లలను వస్తువుల దొర్లేవేగాన్ని ఊహించమని చెప్పండి. ఈకలు రాళ్ళంత వేగంగా క్రిందకు పడతాయా ? పిల్లలను వివిధ వస్తువులను అతివేగంగా నుండి, అతి నెమ్మదిగా క్రిందకు పడే క్రమంలో అమర్చమని చెప్పండి. ప్రతి బృందాన్ని ఈ ప్రయోగాన్ని చెయ్యనివ్వండి. ప్రతి బృందానికి వస్తువులు క్రిందకు చేరే సమయాన్ని నమోదుచేసుకోనేందుకు అనువుగా ఒక స్టాప్ క్లాక్ ను ఇవ్వండి. వారి అంచనాలను ఫలితాలతో పోల్చుకోనివ్వండి. ఇలా ఊహించడానికి పిల్లలు కష్టపడితే వారిని వస్తువులను క్రిందకు జారవిడిచి ఏ వస్తువులు వేగంగా భూమిని చేరుతాయి ఏవి నిదానంగా చేరుతాయో నమోదు మాత్రమే చెయ్యమనండి. వివిధ వస్తువులు భూమిని చేరడానికి వివిధ సమయాలను ఎందుకు తీసుకొంటాయో కారణాలను ఊహించమని చెప్పండి. ఇందులో గాలి యొక్క ప్రభావం ఏమైనా ఉందా ? పరిశీలించమని చెప్పండి ? పిల్లలను ఈకను ఒక సారి గాలి వేగంగా వీస్తున్నప్పుడు ఒకసారి, గాలి సాధారణ వేగంతో ఉన్నప్పుడు మరొకసారి క్రిందికి వేయమని చెప్పండి ? మరొక ప్రయోగాన్ని చెయ్యమని చెప్పండి ? ఈ సారి ఇచ్చిన వస్తువులలో నీటిలో తేలే వస్తువులను, మునిగే వస్తువులను నమోదు చేయమని చెప్పండి ? ఈ ప్రయోగం నిర్వహించడానికి కావలసిన సామాగ్రి : పెన్సిల్ రబ్బర్ సూదులు చిన్న చిన్న చెక్క ముక్కలు కాగితంతో చేసిన పడవ ప్లాస్టిక్ క్లిప్స్ చిన్న రాళ్ళు ప్లాస్టి సైన్ వీటిని ఒక నీటి తొట్టిలో ఉంచినప్పుడు అవి మునుగుతాయా తేలుతాయా ఊహించమనిచెప్పండి. వస్తువులను రెండు విభాగాలు చేయవచ్చు. నీటిలో మినుగేవి నీటిలో తేలేవీ నీటితొట్టిని ఒక దగ్గర ఉంచి ఒక్కొక్క వస్తువుని నీటిలో వేస్తూ నీటిలో తేలేవస్తువులేవో మునిగే వస్తువు లేవో నమోదుచేయమని చెప్పండి. నాల్గవ తరగతి విద్యార్థులకు నీరు తన ఉపరితలంపై గల వస్తువులపై కొంత బలాన్ని ప్రయోగిస్తుందని వివరించవచ్చు. వస్తువు నీటికంటే బరువైనదైతే అది నీటిలో మునుగుతుంది, లేకపోతే తేలుతుంది. ఒక రాయి నీటిలో మునుగుతుంది అదే ఒక ప్లాస్టిక్ క్లిప్ అయితే తేలుతుంది. ఎంతో పెద్దదైన ఓడ సముద్రపునీటిలో తేలుతుండడం చూసిఉంటారు. ఎంతో బరువైన కొన్ని వస్తువులను వాటి ఆకారాన్ని మార్చి మునిగిపోకుండా చేయవచ్చని పిల్లలకు చెప్పండి. వస్తువు యొక్క ఆకారమే అది నీటిలో మునగడానికి లేదా తేలడానికి కారణమని పిల్లలు గమనించేలా చేయండి. వస్తువు పరిమాణం ఎంత పెరిగితే అది అంతబాగా తేలగలదు. ఉదాహరణకు ప్లాస్టి సైన్ తో చేసిన బంతి నీటిలో మునిగితే ప్లాస్టిక్ తో చేసిన పడవ నీటిలో తేలుతుంది. ప్రాచీనకాలంలో పడవలను చాలా తేలికైన కలప,కలుపు మొక్కలతో లేదా చెట్టుబెరడుతో తయారు చేసేవారు. ప్రస్తుతం పడవలను ప్లాస్టిక్, fibreglass, అల్యూమినియం, స్టీల్ మొదలైన వాటితో చేస్తున్నారు. కాగితంతో చేసిన బంతిని, ఒక కాగితాన్ని నీటిలో ఉంచండి. కాగితంతో చేసిన బంతి నీటిలో తేలుతుంది. కాగితం మాత్రం నీటిలో తడిచిన తరువాత మాత్రమే మునిగిపోతుంది. కాగితంతో చేసిన బంతిలో గాలి ఉంటుందని పిల్లలను అవగాహన చేసుకోనివ్వండి. నీటిపై తేలే వస్తువుల సహాయంతో నీటిలో మునిగే వస్తువులకు ఆధారాన్ని ఇవ్వవచ్చా ? ఈ కృత్యం కొంచం క్లిష్టంగా అనిపించవచ్చు కానీ ఇది పిల్లలలో సమస్యా పరిష్కార నైపుణ్యాన్ని సృజనాత్మక ఆలోచనా నైపుణ్యాన్ని పెంచుతుంది. నీటిలో మునిగే వస్తువుకు అది తేలేందుకు ఆధారాన్ని ఇచ్చే ఒక వస్తువుని కనుక్కోమని చెప్పండి. నీటిలో తేలే అన్ని వస్తువులు నీటిలో మునిగే అన్ని వస్తువులకు ఆధారాన్ని ఇవ్వవని పిల్లలు తెలుసుకొంటారు. ఇలా ఆధారాన్ని ఇచ్చే వస్తువు యొక్క సామర్థ్యం భారం ,ఆకారం అవి గాలిని నిల్వ చేసుకోగల సామర్థ్యం లాంటి చాలా అంశాలపై ఆధారపడి ఉంటుంది. Experiential leraning కు చాలా అభ్యాసం అవసరమౌతుంది. కావున పిల్లలకు ఈ ప్రయోగాలను వివిధ పరిస్థితులలో చాలా మార్లు చేసే అవకాశాన్ని కల్పించాలి. ప్రతి ప్రయోగాన్ని ఒక సారాంశంతో ముగించాలి. పిల్లలకు ఇలా అవకాశాన్ని ఇస్తే వారు నిజంగానే వారి వారి సామర్థ్యాలతో మిమ్ములను ఆశ్చర్యపరుస్తారు. ఉపాధ్యాయులకు సూచన : పెలికాన్ పక్షులు నీటిపై ఎపుడూ తేలియాడుతూ ఉంటాయి . దీనికి కారణం వాటి ఈకల మధ్య గాలిని నిల్వచేసుకోవడమే. కీటకాలు నీటిపై నడుస్తాయి. వాటి పాదాలు కొన్ని ప్రత్యేకమైన రోమాలను కలిగిఉండి ఇవి శరీర బరువుని పంచుకోవడం వలన అవి తేలుతూ ఉంటాయి. ఇవి నీటి ఉపరితలంపై ఉండే చిన్న కీటకాలను ఆహారంగా తీసుకొంటాయి. ఈ రచనకు ఆధారం: Junior Education లోని వ్యాసం. నిడివి : 03 గంటలు పరిచయం: మనం ఈ భూమిపై నిలబడి ఉండడానికి, పక్షులు గాలిలో ఎగరడానికి, పడవలు మరియు ఓడలు నీటిపై తేలడానికి కారణమేమి ? వీటన్నిటికి వివిధ రకాల బలాలు కారణం. ఈ బలాల గురించి experiential learning ద్వారా బాగా అవగాహన చేసుకోవచ్చు. ఈ కృత్యాలను నిర్వహించడం ద్వారా పిల్లలు వివిధ బలాలను అనుభూతిని చెందడమే కాక అవి ఎలా పనిచేస్తాయో పరిశీలించి తెలుసుకొంటారు. అలాగే వారి పరిసరాలలో జరుగుతున్న కొన్ని దృగ్విషయాలకుగల కారణాలను కూడా ఈ కృత్యాలను ఆనందంగా నిర్వహిస్తూ తెలుసుకొంటారు. లక్ష్యం: “బలాల” గురించి కృత్యాధార పద్ధతిలో అభ్యసిస్తారు. వివిధ చర్యలలో ఇమిడిఉన్న బలాల గురించి ప్రయోగాలు నిర్వహించడం, పరిశీలించడం ద్వారా తెలుసుకొంటారు. విద్యార్థులలో శాస్త్రీయఅవగాహనను అభివృద్ధి చెయ్యడానికి విద్యార్థులలో సమస్యాపరిష్కార నైపుణ్యాలను వృద్ది చెయ్యడానికి విద్యార్థులలో సృజనాత్మకతను ప్రోత్సహించడం. పెద్దవిగా కనిపించడానికి - ది స్కూల్ వాటర్ పోర్టల్ రిసోర్స్ వివరాలు : ప్రాథమిక సమాచారం ఈ కృత్యం ద్వారా నీటి బిందువులను భూతద్దాలుగా ఎలా ఉపయోగించవచ్చో పిల్లలకు చూపవచ్చు. ఈ కృత్యం ద్వారా నీరు వస్తువులను పెద్దదిగా చేసిచూపిస్తుందని ప్రదర్శించవచ్చు నిడివి : 15 నిముషాలు పరిచయం: నీరు వస్తువులను పెద్దదిగా చేసిచూపిస్తుందని ప్రదర్శించడం సోపానాలు: సామాగ్రి : 5 మంది విద్యార్థులకు ఒకటి చొప్పున ఒక కాగితం ( వార్తాపత్రిక మొదలైనవి ) ఒక పారాదర్శకమైన ప్లాస్టిక్ కాగితం ఒక ప్లాస్టిక్ తో చేసిన ఇంక్ ద్రాప్పర్ నీటితో నింపిన చిన్న గిన్నె పద్ధతి : ప్రతి బృందాన్ని వృత్తాకారంలో కూర్చోమని చెప్పండి. ప్రతి బృందానికి మధ్యలో వారి దగ్గరున్న కాగితాన్ని ఉంచి ఒక వార్తపై ప్లాస్టిక్ కాగితాన్ని ఉంచండి పిల్లలను డ్రాపర్ తో కానీ వారి వ్రేళ్ళను కాని ఉపయోగించి కొన్ని చుక్కల నీటిని ప్లాస్టిక్ కాగితంపై వేయమనండి. అడగవలసిన కొన్ని ప్రశ్నలు ప్లాస్టిక్ కాగితంపై నీటిచుక్కలు ఏ ఆకారంలో ఉంది ? ఈ నీటిచుక్కల క్రింద ఉన్న అక్షరాలు, నీటిచుక్కలు లేని ప్రదేశంలోని అక్షరాల పరిమాణం కంటే చిన్నవిగా ఉన్నాయా ? ఇంటి దగ్గర పరీక్షించండి మీ ఇంటి దగ్గర మీతల్లి తండ్రులు లేదా అమ్మమ్మ లేదా తాతలు కంటి అద్దాలు దరిస్తారా ? పిల్లలను వారి తల్లి తండ్రులు లేదా వారి అమ్మమ్మ లేదా తాతలను వారి కంటి అద్దాల ద్వారా వార్తాపత్రికలో అక్షరాలూ ఎలా కనిపిస్తాయో చూపించమని చెప్పండి. అలాగే పిల్లలకు ఈ విధంగా పలుమార్లు చేయవద్దని చేస్తే కంటికి అపాయమని చెప్పండి. నీటి చుక్కలు కంటి అద్దాలవలె పనిచేసి అక్షరాలను పెద్దవిగా చేస్తాయని చెప్పండి. గణితఆకారాలు ఈ రెండు అభ్యాసపత్రాలు విద్యార్థులు సృజనాత్మకంగా జ్యామితీ ఆకారాలను అభ్యసించడానికి ఉపయోగపడుతాయి. గణితఆకారాలు - అభ్యాసపత్రం 1 గణితఆకారాలు - అభ్యాసపత్రం 2 గణితశాస్త్ర అభ్యాసపత్రం - పదసమస్యలు పదసమస్యలను సాధించడం వలన విద్యార్థులలో ఆలోచనా సామర్థ్యాన్ని పెరుగుతుంది. ఈ అభ్యాసపత్రం విద్యార్థుల సృజనాత్మకతకు కూడా తోడ్పడుతుంది. ఈ పదసమస్యలను చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి. జ్యామితి -అభ్యాసపత్రాలు ప్రత్యుత్తరప్రశ్నల ద్వారా పిల్లలకు రేఖాగణితంలోని వివిధ భావనలను పరిచయం చెయ్యడమే ఈ అభ్యాస అభ్యాసపత్రం యొక్క ముఖ్య ఉధ్ధేశ్యం. అభ్యాసపత్రాలను పూర్తీచేయడం ద్వారా విద్యార్థులు సిధ్ద్ధాంతలకు అవసరమైన ఉపపత్తులును పరోక్షంగా తెలుసుకొంటారు. విద్యార్థుల స్వీయాధ్యయనానికి, విద్యార్థులకు రేఖాగణితభావనలను పరిచయం చేయడానికి లేదా పునర్విమర్శ నిర్వహించేందుకు ఈ అభ్యాసపత్రాలను ఉపయోగించుకోవచ్చు. ఒకటవ అభ్యాసపత్రం విద్యార్థులు అభిముఖ కోణాలఅవగాహనచేసుకొనేందుకు దోహదపడుతుంది. అలాగే రెండవ,మూడవ మరియు నాల్గవ అభ్యాసపత్రాలు రెండు సమాతరరేఖలను ఒక తిర్యగ్రేఖ కండించినపుడు ఏర్పడేకోణాల గురించి అవగాహనచేసుకోవడానికి ఉపయోగపడుతాయి. జ్యామితి - అభ్యాసపత్రం 1 జ్యామితి - అభ్యాసపత్రం 2 జ్యామితి - అభ్యాసపత్రం 3 జ్యామితి - అభ్యాసపత్రం 4 భద్రత మరియు ప్రథమ చికిత్స ప్రాథమిక సమాచారం విద్యార్థులను మరియు ఉపాధ్యాయులను ప్రత్యక్ష లేదా పరోక్ష పరిశీలనల ద్వారా సమాచారాన్ని సేకరించి ఈ సేకరించిన సమాచారాన్ని పరిక్షించేందుకు ప్రొత్సహించేదే “విఙ్ఞానశాస్త్రం “. ఉపాధ్యాయులకు ఉండే కాలపరిమితుల వలన, వృత్తిభాధ్యతల వలన వీరు తరచుగా తక్కువసమయలో బోధనను ముగించడానికి, మరియు దీనికోసం తయారవ్వడానికి తక్కువ సమయం పట్టే పధ్ధతులనే ఎంచుకొంటున్నారు. పాఠ్య ప్రణాళిక వివరాలు సమయం : 02 గంటలు పరిచయం: విద్యార్థులను మరియు ఉపాధ్యాయులను ప్రత్యక్ష లేదా పరోక్ష పరిశీలనల ద్వారా సమాచారాన్ని సేకరించి ఈ సేకరించిన సమాచారాన్ని పరిక్షించేందుకు ప్రొత్సహించేదే “విఙ్ఞానశాస్త్రం “. ఉపాధ్యాయులకు ఉండే కాలపరిమితుల వలన, వృత్తిభాధ్యతల వీరు తరచుగా తక్కువసమయలో బోధనను ముగించడానికి, మరియు దీనికోసం తయారవ్వడానికి తక్కువ సమయం పట్టే పధ్ధతులనే ఎంచుకొంటున్నారు. దీని వలన విద్యార్థులు ఙ్ఞానాన్ని సమపార్జించినా దానిని అనుప్రయోగం గురించి తెలియదు.ఈ పాఠ్యప్రణాళిక నిత్య జీవిత అనుభవాలను అభ్యసనానికి అనుసంధానిస్తుంది. విఙ్ఞానశాస్త్ర బోధనలో సృజనాత్మకత ఒక భాగం.ఈ పాఠ్యప్రణాళికను “కథాపద్దతి”ని ఉపయోగించి వ్రాసారు. అభ్యసనాన్ని మరింత ఆసక్తికరం చెయ్యడానికి వార్తాపత్రికలను ఒక వనరు ఉపయోగించు కొన్నారు. బోధనాభ్యసనం ఆసక్తికరంగా ఉండడానికి ఈ పాఠ్యాంశాన్ని బోధించడానికి “కథాపద్ధతి” ఎన్నుకొన్నారు. పిల్లలకు పాఠ్యాంశాన్ని లేదా ఒక భావనను ఒక “కథ” ద్వారా బొధించినపుడు వారు బాగా అవగాహన చేసుకొంటారు.ఈ పధ్ధతి పిల్లలలో స్వతంత్ర ఆలోచనలలను కూడా ప్రొత్సహిస్తుంది. ఈ పాఠ్యాంశం నాలుగు అంశాలను కలిగి ఉంది. ఇంటి వద్ద భద్రత రోడ్డు పై భద్రత ప్రథమచికిత్స అగ్నిప్రమాదాలు మరియు నివారణా చర్యలు : లక్ష్యం: విద్యార్థులు ప్రమాదాల గురించి ప్రథమ చికిత్స గురించి మరియు నివారణా చర్యల గురించి నేర్చుకొంటారు. సోపానాలు: సెషన్ 1 : ఇంటి వద్ద జరిగే ప్రమాదాలు విద్యార్థులు ఇంటి దగ్గర ప్రమాదాలు ఎలా జరుగుతాయో వివరిస్తారు. విద్యార్థులు ఈ జ్ఞానాన్ని ఇంటి వద్ద జరిగే ప్రమాదాలను నివారించడానికి ఉపయోగిస్తారు. విధ్యార్థులు ఈ ప్రమాదాలు జరగడానికి గల కారణాల జాబితాను తయారు చేస్తారు. అధార సామాగ్రి: ఈ సెషన్ ను ప్రారంభించే ముందు సిధ్ధం చేసుకోవల్సిన సామాగ్రి. కథలను చెప్పే సెషన్ కు తయారుకండి అనే వనరుని చదవండి. 1 A-వనరు ప్రతులు (మొదటి సోపానం- ఆసక్తిని కలిగించడం) 1. 1B వనరు- ఒక ప్రతి, ఇది ఉపాధ్యాయుల కోసం. కథలను చెప్పే సెషన్ కు తయారు కండి (రెండవ సోపానం) 2. వనరు 1C ప్రతులు దీనిని మూల్యాంకనం కోసం ఉపయోగించవచ్చు. (మూడవ సోపానం) సోపానాలు : మొదటి సోపానం : ఆసక్తిని కలిగించడం : 1. తరగతిని 5 బృందాలుగా విభజించండి(ఒకొక బృందం లో 5 గురు విద్యార్థులు ఉండేలా ) 2. A వనరులో ఇచ్చిన వార్తా పత్రిక నకలుని పంపిణీ చెయ్యండి ( అందరినె చదవమని చెప్పండి. మీ ప్రాంతీయ వార్త పత్రిక ఆధారంగా కూడా ఒక విషయాఅన్ని ఇందుకోసం మీరు తయారు చేసుకోవచ్చు. 1 A వనరు లో ఐదు వార్తాంశాలను ఇచ్చారు. మీరు మీ ప్రాంతీయ వార్తపత్రికలనుండి కూడా వీటిని సేకరించ వచ్చు.వార్తల యొక్క శీర్షిక చాలు. దీని కొసం ఎక్కువ సమయము కూడా అవసరం కాదు. 3. చర్చను ప్రారంభించండి. మీరందరూ ఈ సమాచారాన్ని చూసి ఉండవచ్చు. ఇది ఏ విషయానికి సంబంధించినది.? ప్రమాదమనగా నేమి ? నీ వెప్పుడూ ప్రమాదాన్ని ఎదుర్కొనలేదా? ఆ ప్రమాదాన్ని తిరిగి గుర్తుకు తెచ్చుకోగలవా ? నీ అనుభూతి ఏమిటి ? నీ అభిప్రాయంలో ప్రమాదాలు ఎందుకు జరుగుతాయి? విద్యార్ధులు చెప్పే అన్ని సమాధానాలను అంగీకరించండి. అందరు విద్యార్థులూ చర్చలో పాల్గొనేలా ప్రొత్సహించండి. రెండవ సొపానం: కథను చెప్పడం: 1. సెషన్ ను వనరు 1B లో ఇచ్చిన కథతో ప్రారంభించండి. 2. ప్రశ్నలను అడగండి. ఉదాహరణకు పెద్దల సహకారం లేకుండా కుర్చీ పై నిలబడడం మంచిదా ? చాక్లెట్లు కల డబ్బ పిల్ల వాని పై పడితే ఏమౌతుంది.? కుర్చీ తల క్రిందులయ్యే అవకాసం ఉందా? 3. మీరు ఇంటిలో ఇంకా ఎక్కడెక్కడ ప్రమాదాలు జరుగగలోవో ఊహించగలరా? సూచన: మనము మన ఇంటిని చాలా సురక్షితమైన ప్రదేశంగా భావిస్తాము. కానీ చాలా ప్రమాదాలు మన ఇంటి వద్దనే జరుగుతాయి.కూరగాయలను తరుగుతున్నప్పుడో, కిటిలో నుండి ఆకాశం లోకి ఎగిరకె పక్షిని చూస్తున్నప్పుడో, మెటికెలు ఎక్కుతున్నప్పుడో, మొనదేరిన వస్తువులపై కాలుఉంచినప్పుడో, మన గోళ్ళలోకి ఏదైనా కట్టె వెల్లినప్పుడో ఇలాఇంటి వద్దే ఎక్కువ ప్రమాదాలు జరుగుతాయి. ఈ సన్నివేశాలన్నంటినీ వివరించి వారి సమాధానాలను నమోదు చెయ్యండి. మన అజాగ్రత్తల వలనే ప్రమాదాలు జరుగుతాయని వారికి వివరించండి. జాగ్రత్తగా ఉండడం వలన చాలాప్రమాదాలను నివారించవచ్చు. సెషన్ 2 రహదారి భద్రత లక్ష్యాలు/స్పష్టీకరణలు విద్యార్థులు రహదారులలో జరిగే ప్రమాదాలకు కల కారణాల జాబితాను చేస్తారు ప్రమాదాలు ఎలా జరుగుతాయో విద్యార్థులు వర్ణిస్తారు. విద్యార్థులు ప్రమాదాలను నివారించడానికి ఈ ఙ్ఞానాన్ని ఉపయోగిస్తారు ఆధార సాఅమాగ్రి: షెషన్ మొదలు పెట్టడానికి ముందే ఈ సామాగ్రిని తయారుగా ఉంచుకోండి. 2 A వనరు ప్రతి (మొదటి సోపానం ఆసక్తిని కలిగించడం) 2B వనరు- ఒక ప్రతి, ఇది ఉపాధ్యాయుల కోసం. కథలను చెప్పే సెషన్ కు తయారు కండి (రెండవ సోపానం కథను చెప్పడం) వనరు 2 C ప్రతులు దీనిని మూల్యాంకనం కోసం ఉపయోగించవచ్చు. (మూడవ సోపానం మూల్యాంకనం) సోపానాలు మొదటి సోపానం : ఆసక్తిని కలిగించడం. పిల్లలను రెండు వృత్తాలుగా ఏర్పడమని చెప్పండి. 2 A లో ఇచ్చిన చిత్రాన్ని పిల్లలకు చూపండి (ఉపాధ్యాయుడే స్వంతంగా రహదారి పై ప్రమాదం జరగాడానికి అవకాసాన్ని చూపిస్తూ ఒక కరపత్రం చేసుకోవచ్చు . మంచి నటుడైతే అభినయించి చూపవచ్చు లేదా విద్యార్థులను నటించమని చెప్పవచ్చు.) అంశాన్ని పరిచయం చెయ్యండి అక్కడ మీరేమి చూస్తున్నారు ? తరువాత ఏమి జరుగుతుంది ? కారణం చెప్పగలవా? సూచన: పిల్లలలను రహదారి నింభందనలను అతిక్రమించడం,వహనాన్ని ఇష్టం వచ్చినట్లు నడపడం వ్లన ఏమౌతుందో ఊహించి చెప్పడాన్ని ప్రోత్సహించాలి. మన అజాగ్రత్తవలననే ఎక్కువగా రహదారి/ రోడ్డు ప్రమాదాలు జరుగుతాయి. కొన్ని సందర్భాలలో మరణానికి కూడా దారితీయవచ్చు. రెండవ సొపానం: కథను చెప్పడం : 1. అదే బృందాలను కొనసాగించండి 2. కథ యొక్క మొదటి భాగాన్ని విధ్యార్థులకు క్లుప్తంగా చెప్పండి. 3. వనరు 2B లో ఇచ్చిన కథను కొనసాగించండి మధ్యలో నిలపి (ఎక్కడ నిలపాలో సూచనను కథలో ఇచ్చారు) చర్చను మొదలు పెట్టండి. రాము చర్యలను వ్యాఖ్యానించమని చెప్పండి. రాము చేసినది తప్పని తెలిస్తే, రాముకు ఏవిధమైన సలహా ఇస్తావు.? రహదారిని నీవెలా దాటుతావు ? రహదారిని దాటేముందు నేవు దేనిని పరీక్షించుకొంటావు.: రహదారి జాగ్రత్తల పాటించేలా చెయ్యండి. మనం రహదారులను జీబ్రాగీతల వద్ద మాత్రమే దాటాలి. రహదారులు ప్రయాణాసాధనాల కొసమే ఏర్పరచినవి. ఎప్పుడూ పాదాచారుల కోసం కేటాయించిన స్థలం లోనే నడవండి. నడుస్తూ కానీ వహణం డపుతూ కానీ ఫోన్ మాట్లాడవద్దు. మీ తల్లితండ్రులను ఇరుగుపొరుగుని మిత్రులకి ఈ విషయాలను చెప్పండి. ఈ రహదరుల ప్రమాదాల వలన ప్రపంచమంతటా రోజూ చాలా మంది చనిని పోతున్నారు. ఈ సంఖ్య రోజుకి దాదాపుగా 3200 వరకు ఉంటుంది. మీరు ఏదైన కార్, లేదా రెండు చక్రాల మోటర్ సైకిల్ ప్రమాదాన్ని చూసినపుడు వారికి మీరు చాలా విధాలుగా సహాయ పడవచ్చు. వెంటనే అపాయకరమైన అంటే మండే పధార్థాలు ఉంటే వాటిని ప్రక్కకు తీసి పెట్టండి ఉదాహరణకు మండే వస్థువులు, గాజు మొదలైనవి తరువాత అంబులెన్స్ నిపిలవండి. గాయపడిన వారిని వదలి ఎక్కడికీ పోకండి. సరైన సమయం లో చేసే సహాయం ఎందరి జీవితాలనో కాపాడుతుంది. సెషన్ 3 ప్రథమ చికిత్స సమయం 40 నిమిషాలు లక్ష్యాలు : విద్యార్థులు భద్రతానియమాలను గుర్తుతెచ్చుకొంటారు . విద్యార్థులు ప్రథమచికిత్స యొక్క అర్థాన్ని తెలుసుకొంటారు. చిన్న చిన్న ప్రమాదాలకు చెయ్యాల్సిన ప్రథమ చికిత్సను విద్యార్థులు ప్రదర్శిస్తారు. ఆధార సామాగ్రి బోధనోపకరణాలు: 1. ప్రథమ చికిత్స పెట్టె( ఒకట సోపానం: ఆసక్తిని కలిగించడం: ఉపాధ్యాయుడే దీనిని తయారు చేసుకోవాలి 2. 3A వనరులో ఇచ్చిన కథ యొక్క నకలు ( రెండవ సోపానం వివరణ) 3. వనరు 3B ప్రతులు సోపానాలు: ఒకట సోపానం: ఆసక్తిని కలిగించడం విద్యార్థులను రెండు వృత్తాలుగా ఏర్పడమని చెప్పండి. ప్రథమ చికిత్స పెట్టెలోని వస్తువులను గుర్తించమని చెప్పండి. అందరి జవాబులను ఆమోదించండి, మరియూ అందరినీ చర్చలో పాల్గొనేలా చెయ్యండి. ఈ విధమైన ప్రశ్నలను అడగండి దీనిని మనమెప్పుడు ఉపయోగిస్తాము? దీనిలో ఉంచే పదార్థాల పేర్లలను చెప్పండి. 3. అంశాన్ని పరిచయం చెయ్యండి. ప్రమాదం జరిగిన వెంటనే మరియూ వైద్యుని వద్దకు తీసుకొని వెల్లే ముందు రోగికి ఇచ్చే ఖచ్చితమైన వైద్యాన్ని ప్రథమ చికిత్స అంటారు . ఇది గాయాన్ని తగ్గించడమే కాకుండా ప్రాణాపాయం లేకుండా కాపాడుతుంది. రెండవ సోపానం వివరణ 1. 3A వనరు లో ఇచ్చిన కథతో పాఠాన్ని కొనసాగించండి. 2. కొంత విరామం తీసుకొని కొన్ని ప్రశ్నలను అడగండి. నీవు క్రికెట్ ఆడతావా ? ఎక్కడ ఆడతావు ? ఎవరన్న మైదానం మధ్యలో వచ్చినపుడు కూడా నీవు బంతిని కొడతవా ? దానిని నేవెందుకు చెయ్యవు ? కథను పూర్తీ చేసి చిన్న చిన్న ప్రమాదాలకు చెయ్యవలసిన ప్రథమ చికిత్స గురించి క్లుప్తంగా వివరించండి. మీ సూచనలలోకి క్రిందివాటిని కూడా చేర్చండి. ప్రథమచికిత్స చేస్తున్నప్పుడు ప్రశాంతంగా ఉండడం మరియూ వేగంగా ప్రతిస్పందించడం ముఖ్యం. క్రింది వాటికి ఈ క్రింది విదంగా చెయ్యండి. గాయాలను శుభ్రంగా నీటితో కడిగి డెట్టాలో ముంచిన పత్తితో కడగండి. కీటకాలు కుట్టినపుడు: మొనతేలిన వస్తువుతో ముల్లుని తీసివెయ్యండి దీనిని వత్తితే విషం మరింతగ శరీరంలోకి పొయ్యే అవకాశం ఉంది. మంటతగ్గేంతవరకు మంచుముక్కలను ఉంచండి. లేపనాన్ని పూయండి. ముక్కు నుండి రక్తస్రావం : వ్యక్తిని నెమ్మదించమని చెప్పండి. ముందుకు కోర్చొన మని చెప్పండి. ముక్కును గట్టిగా వ్రేళ్ళతో 5-10 సెకండ్ల సమయం గట్టిగా పట్టిఉంచండి. కృత్యం : తరగతిని మూడు విభాగాలుగా విభజించి 3B వనరులను పంపిణీ చెయ్యండి. విద్యార్థులను మొదట సూచనలను చదివి తరువాత వాటిని ప్రదర్శించమనండి. మిగిలిన బృందాలను వారిని పరిశీలించి వారిని అంచనా వెయ్యమనిచెప్పండి. సూచన : 3B లోఇచ్చిన సూచనా పత్రాల ప్రతులను తయారు చెయ్యాలి. ప్రదర్శనకు అవసరమైన సామగ్రిని కూడా సిధ్దంగా ఉంచాలి. ఇందుకోసం నల్లబల్లపై ఒక పట్టికను చిత్రించవచ్చు. వారికి ప్రదర్శనకు కావలసిన కిటుకులను వారికి చెప్పండి ప్రతి బృందం నుండి ఒక సభ్యుని ఆ సన్నివేశాన్ని వర్ణించమని సారాంశం చెప్పమని ప్రోత్సహించండి. ముక్కులో జరిగే రక్త స్రావానికి: ప్రతమ చికిత్స: కావలసినవి ఒక కుర్చీ, కొంత క్లాత్, వ్యక్తిని నిదాన పరచమ్డి, కర్చీఫ్ ని అతని ముక్కు పై ఉంచండి. షెషన్ 4 అగ్ని ప్రమాదాలు: సమయం 40 నిమిషాలు: విద్యార్థులు అగ్ని ప్రమాదాలకు గల కారణాలను ఊహిస్తారు. విద్యార్థులు అగ్ని ప్రమాదాలు ఏలా జరుగుతాయో అని వర్ణిస్తారు. విద్యార్థులు అగ్ని ప్రమాదాలు ఏలా నివారించ వచ్చో ఊహిస్తారు. బోధనోపకరణాలు: 1. 4A వనరునుపయోగించి ఒక కరపత్రాన్ని తయారుచెయ్యండి. 2. 4B వనరును ముందుగా చదివి తయారుగా ఉండాలి. 3. మూల్యాంకనపు వనరు 4c ప్రతులు సొపానాలు: మొదటి సోపానం ఆసక్తిని కలిగించడం 1. విద్యర్థులను రెండు వృత్తాలుగా ఏర్పడమనండి. 2. కరపత్రాన్ని చూపి ప్రశ్నలను అడగండి దీనిని ముందెపుడైనా చూసావా ? ఎక్కడ? దీని నువ్వు ప్రజలు ఉపయోగిస్తుండగా నేవెప్పుడైనా ఇంతకు మునుపే చూసావా ? ఈ పనిముట్టు పేరు నీకు తెలుసా? అంశాన్ని పరిచయం చెయ్యండి. మనకు ఆహారం వండుకోవడానికీ మరియూ చలికాలం లో వెచ్చగా ఉండడానికి మంట చాలాఅవసరము, అదే సమయంలో అది మన నివాసాలను అడవులను కూడా కాల్చివెయ్యగలదు.అది మనకు ముందే హెచ్చరికలను జారీ చెయ్యదు. అది మనము చాలా అజాగ్రత్తగా మనము విసిరివేసిన మండుచున్న చిన్న అగ్గిపుల్ల వలన కూడా సంభవించవచ్చు. రెండవ సొపానం : కథను చెప్పడం: 4B లో ఇచ్చిన కథ యొక్క మూడవ భాగాన్ని కొనసాగించండి. కథ చివరలో అగ్ని ప్రమాదాలు జరగడానికి గల కారణాలు మరియూ నివారణా చర్యల గురించి వివరించండి. అగ్ని ప్రమాదాల పట్ల జాగ్రత్తగా ఉండండి, మండుతున్న అగ్గిపుల్లలను విసిరివెయ్యకండి, మండుతున్న కొవ్వొత్తిని పిల్లల దగ్గర వదలి వెళ్ళకండి.పిల్లలను అగ్గిపుల్లలతో ఆడుకోనివ్వకండి. సూచన: మీరు ప్రమాదవ శాత్తూ అగ్ని ప్రమదంలో చిక్కొన్నట్లైతే మొదట మీ ముక్కు నోరూని ఒక వస్త్రంతో మూసిపెట్టుకోండి. ఎక్కువ మంది, మంటల కంటే ఎక్కువగా పొగవలనే చనిపోతారు. నేల పై పొర్లుతూ గది బయటకు వెళ్ళాలి. అగ్ని ప్రమాదం కరెంటు వలన అయితే మంటలను నీటితొ ఆర్పరాదు. పెట్రోల్ వలన అగ్ని ప్రమాదం అయితే ఇసుకను ఉపయోగించి మంటలను ఆపాలి. మండే స్వభావంగల వస్తువులను ముందుగా తొలగించాలి. మీరు దుస్తులతో పాటు మంటలలో చిక్కుకొన్నట్లైతే నేల పై పొర్లాలి. సూచించబడిన సామాగ్రి "వీల్స్ ఆన్ బస్ గో రౌండ్ అండ్ రౌండ్" పాట జాతీయ రహదారుల మరియు రవాణా మంత్రింత్రిత్వ శాఖల వెబ్ సైట్స్ ని దర్శించండి. ఈ వెబ్ సైట్స్ లో సరళమైన ఆటలు ఉన్నాయి. 5వ తరగతి పాఠ్యపుస్తకం (I.C.S.E. పాఠ్యప్రణాళిక) 6వ తరగతి పాఠ్యపుస్తకం (కర్ణాటక రాష్ట్రపాఠ్యప్రణాళిక) 5వ తరగతి పాఠ్యపుస్తకం (పాండిఛేరి రాష్ట్రపాఠ్యప్రణాళిక) ఉపాధ్యాయులకి సూచన : మీరు ఎముకల విరుపు కోసం కూడా ఇలాగే పాఠ్యప్రణాళికను రూపొందించవచ్చు. (కాళ్ళ మరియూ చేతుల విరుపును దీనిని ఎలా గుర్తించవచ్చు మారియూ దీని ప్రథమచికిత్స గురించి న విషయాలు) మూల్యాంకనం: 1 వ సెషన్ : ఇంటి దగ్గర జరిగే ప్రమాదాలు 1. 1C వనరులో ఇచ్చిన అభ్యాసపత్రం ప్రతిని విధ్యార్థులకు ఇచ్చి పూర్తీ చెయ్యమ చెప్పండి. 2. జవాబులను చెప్పండి 2వ సెషన్ : రోడ్డుపై భద్రత 1.2C వనరు లో ఇచ్చిన అభ్యాసపత్రాన్ని పంపిణీ చెయ్యండి. 2.దీనిని ఇంటిదగ్గర పూర్తీ చేసి తరగతిలో చర్చించమనండి 3వ సెషన్ : ప్రథమచికిత్స 3B వనరులో ఇచ్చిన ప్రకారం 4వ సెషన్ : అగ్నిప్రమాదాలు మరియు నివారణాచర్యలు 3B వనరు ప్రతిని విద్యార్థులందరికీ ఇవ్వండి. సమాధానాలను చర్చించండి. వ్రాసేనైపుణ్యాన్ని ఆనందకరమైన కృత్యాలతో అభివృద్ధిచేయడం ప్రాథమిక సమాచారం విద్యార్థులను నిత్యజీవితంలోని అంశాల గురించి కానీ లేదా వారు సులువుగా అవగాహన చేసుకోగలిగిన అంశాలగురించి వ్రాయమన్నప్పుడు ఈ నైపుణ్యం ఆసక్తికరంగానూ ఆనందంగానూ మారుతుంది. పిల్లలు తగినంతగా పదజాలాన్ని వ్యక్తీకరణ నైపుణ్యాన్ని కలిగిఉండరు గనుక సాధారణంగా వ్రాయడానికి విసుగును ప్రదర్శిస్తారు. చర్చలను నిర్వహించడంతో మొదలుపెట్టి మేధోమథనం, ఆలోచనలను క్రమంలో ఉంచడం, పదజాలాన్ని పెంపొందించడం మొదలైన కృత్యాల ద్వారా విద్యార్థులలో విద్యార్థులలో వ్రాయడంఅనే నైపుణ్యాన్ని పెంపొందించవచ్చు. నిడివి : పూర్తి రోజు పరిచయం: పిల్లలలో వ్రాసే నైపుణ్యాన్ని అభివృధ్ధి చేయడానికి కొంత మార్గదర్శకత్వం అవసరం. వ్రాసేవారు నిరంతరం వ్రాసిన వాటిలో వ్యాకరణానికి సంబంధించిన దోషాలపై దృష్టిపెడితే వారిలో సృజనాత్మకతకు ఆటంకాలు ఏర్పడతాయి. సృజనాత్మక వ్యక్తీకరణ పిల్లలకు ఆనందాన్ని ఇవ్వడమేకాక వారిలోని ఉధ్వేగాలను వెలిబుచ్చేందుకు ఒక మాధ్యమంగా ఉపయోగపడుతుంది. ఇక్కడ సూచించిన కొన్ని కృత్యాలు పిల్లలలో వ్రాయడంలో భయాన్ని అధిగమించడానికే కాక భాషపై ఆసక్తిని పెంచడానికి కూడా ఉపయోగపడుతాయి. సోపానాలు: ఈ క్రింద ఇచ్చిన వనరులలో కొన్ని ప్రత్యేకపధ్ధతులలో వ్రాయడానికి ఉపయోగపడితే కొన్ని స్వేచ్ఛగా వ్యక్తీకరించడానికి తోడ్పడుతాయి. కొన్ని సూచనలు కూడా ఇయ్యబడ్డాయి. కృత్యాలు : 1. వర్ణనాత్మకంగా వ్రాయడం 1a. నాగురించి వ్రాయడం చాలా మంది పిల్లలు తమను గురించి వ్రాయడానికి ఇష్టపడుతారు. ఇందుకోసం మనం వారికి ప్రత్యుత్తరసూచక ప్రశ్నలద్వారా సహాయం చేస్తే వారిగురించి వారే ఒక పేరాను సులువుగా వ్రాయగలరు. ఉదాహరణకు నీ పేరేమిటి ? నీ వయస్సు ఎంత ? మీ నివాసం ఎక్కడ ? ఎవరితో కలసి నివసిస్తూ ఉంటారు ? మీ గురించి వర్ణించడానికి కనీసం మూడు విశేషణాలను ఉపయోగించండి. నీకు ఇష్టమైన పనులు ఏవి ? మరిన్ని వివరాలకోసం మొదటి అభ్యాసపత్రం : నాగురించి చూడండి. 1b. పరిసరాలను వర్ణించడం విద్యార్థులను వారికి తెలిసినవాటి గురించి వ్రాసేలా ప్రోత్సహించాలి. ఉదాహరణకు వారి పాఠశాల, వారు సందర్శించిన జాతర, లేదా వారి పెంపుడు జంతువు గురించి , వారు ఎంచుకొన్న అంశం గురించి వ్రాయడానికి అవసరమైన పదాలను తెలుసుకోవడానికి మేధోమదనాన్ని నిర్వహించవచ్చు. వారు పదాలను చెపుతుండగా నల్లబల్లపై వాటిని వ్రాయవచ్చు లేదా కొన్ని పదాలను సూచించడం ద్వారా మార్గదర్శనం చేయవచ్చు. ఇందుకోసం రెండవ అభ్యాసపత్రం : పాఠశాలలో ఒక రోజు మూడు అభ్యాసపత్రం : నా పెంపుడు జంతువు కుక్క నాల్గవ అభ్యాసపత్రం : వర్షాకాలంపై ఇచ్చిన అభ్యాసపత్రాలను పరిశీలించండి. 1c. వ్యక్తులను వర్ణించడం పిల్లలలో తగినంతగా పదజాలాన్ని పెంపొందించడానికి వారికి వివిధ హావబావాలును ప్రదర్శిస్తున్న ముఖచిత్రాలను ఇవ్వాలి. విద్యార్థులు వాటిని వర్ణించాలి. ఉపాధ్యాయులు, విద్యార్థులకు కొన్ని కొత్తపదాలను ఉదాహరణకు వంపులు తిరిగిన కేశాలు, కొనతేలిన ముక్కు, వెడల్పుగా ఉన్న కళ్ళు లాంటి పదాలను పరిచయంచేసి సహాయపడవచ్చు. ఈ విధంగా వారు చివరకు వ్యక్తులను స్పష్టంగా వర్ణించేలా అభివృధ్ధి చేయవచ్చు. విద్యార్థులను వార్తాపత్రికలలో ప్రచురించే వివిధ వ్యక్తుల చిత్రపతాలను సేకరించి తరగతిగదికి తీసుకొని రమ్మని చెప్పడంద్వారా భావనకు తగిన పునర్భలాన్ని ఇవ్వవచ్చు. ఇందుకోసం ఐదవ అభ్యాసపత్రం : వ్యక్తులను చూడవచ్చు. 1d. భావాలను వర్ణించడం విద్యార్థులను కొందరు వ్యక్తుల చిత్రాలను తీసుకొనిరమ్మని చెప్పాలి. వీటిని వార్తాపత్రికలు లేదా పత్రికలనుండి సేకరించవచ్చు. విద్యార్థులను చిత్రాలలో కనిపించేముఖభావాలను వర్ణించమని చెప్పండి. ఈ కృత్యాన్ని పదజాలాభి వృధ్ధికి కూడా ఉపయోగించవచ్చు. ఇందుకోసం ఉపాధ్యాయుడు కూడా కొన్ని కొత్తపదాలను వారికి పరిచయం చేయవచ్చు. ఇందుకోసం ఆరవ అభ్యాసపత్రాన్ని : భావాలేమిటి ? చూడండి. 1e. పొరుగువారిని వర్ణించడం విద్యార్థులను ఇప్పుడు వారు నేర్చుకొన్న కొత్తపదాలను ఉపయోగించి వారి పొరుగువారిని వర్ణించమని చెప్పండి. ఇందుకోసం వారి వర్ణనలో పొరుగువారు ఎలా కనిపిస్తారు, ఎలాంటి వారు మొదలైన అంశాలు ఉండవచ్చని తెలపండి. అతను లేక ఆమె దయగలిగిన వ్యక్తి లేక క్రూరుడు,సిగ్గరి, మొదలైనవి ఇందుకోసం ఏడవ అభ్యాసపత్రం : నాకిష్టమైన పొరుగువారు చూడండి. 2. వివరాణాత్మకంగా వ్రాయడం విద్యార్థులకు కొన్ని ప్రత్యుత్తరప్రశ్నలను ఇవ్వడం ద్వారా సహాయపడవచ్చు. ఇందుకోసం ఎనిమిదవ అభ్యాసపత్రం : గ్రామంలో జరిగే జాతర సందర్శన చూడవచ్చు. 3. విశదీకరించి వ్రాయడం విద్యార్థులను ఒక సంఘటనకు సంబంధించిన కారణాన్ని లేదా వివరణను వ్రాయమని చెప్పండి. ఇది ఒక ఇతివృత్తాన్ని తర్కాన్ని కలిగి ఉండాలి. ఇందుకోసం తొమ్మిదవ అభ్యాసపత్రం : నాకిష్టమైన ఆటను చూడవచ్చు. 4. వృత్తాంత వివరణ విద్యార్థులను పాఠశాలలో జరిగిన స్వాతంత్ర్యదినోత్సవ వేడుకల గురించి లేదా మరేదైనా వృత్తాంతం గురించి వివరణ రూపొందించమని చెప్పవచ్చు. ఈ నివేదికలోని అంశాలు యధార్థాలై ఉండాలని వారి అభిప్రాయాలను ఇందులో వ్రాయకూడని చెప్పాలి. ఇందుకోసం వార్తాపత్రికలలో వచ్చిన కొన్ని వృత్తాంతవివరణలను చదివివినిపించవచ్చు. ఇందుకోసం పదవ అభ్యాసపత్రం : మా పాఠశాలలో జరిగిన స్వాతంత్ర్యదినోత్సవ వేడుకలు ను చూడవచ్చు. 5. ఉత్తరాలను వ్రాయడం ఉత్తరాలు సాధారణంగా ఐదుభాగాలను కలిగి ఉంటాయి. శీర్షిక ఇందులోనే తేదీతో పాటు చిరునామా కూడా ఉంటుంది. శీర్షిక తరువాత తగినత ఖాళీని వదలాలి సంబోధన సంబోధనను ఎపుడూ కామాతో ముగించాలి. దీనిని సాధారణంగా ప్రియమైన పదాన్ని చేర్చుతూ పాటు మనం ఉత్తరాన్ని వ్రాస్తున్నవ్యక్తికి మనతోకల సంబంధాన్ని దృష్టిలో ఉంచుకొని వ్రాయాల్సి ఉంటుంది. ఉదాహరణకు ప్రియమైన మామయ్యకు, ప్రియమైన శర్మా గారికి, లేదా హాయ్ మీనా ఉత్తరంలోని ముఖ్యవిషయం: ఇందులో మనం తెలియచేయాల్సిన విషయాన్ని వ్రాస్తూఉంటాము. ముగింపులో సంబోధన: ఇది ఏకవవాక్యంలో ఉండి కలిగి కామాతో పూర్తీఅవుతుంది. ఉదాహరణకు ప్రేమతో, నమస్సులు సంతకం ఉత్తరం రాసే వారి సంతకం లేదా పేరుని టైపుచేయడం. సంతకాన్ని నలుపు లేదా నీలపు రంగుపెన్నుతో చేయవచ్చు. అవసరంలేనిచో ఈ భాగంలేకుండా కూడా ఉత్తతరాన్ని వ్రాయవచ్చు. సంతకం క్రింది వ్రాసే సమాచారం : సంతకం చేసిన తరువాత వ్రాయాల్సిన సమాచారం ఏదైనా ఉంటే వ్రాయవచ్చు. ఈ భాగంకూడా ముఖ్యవిషయాలను కలిగి ఉండవచ్చు. ఇందుకోసం పదకొండవ అభ్యాసపత్రం : సాధారణలేఖ ను చూడవచ్చు. ఇందుకోసం పన్నెండవ అభ్యాసపత్రం : వ్యావఖారిక లేఖ ను చూడవచ్చు. విద్యార్థులను తమ తక్షణ అవసరాలగురించి తక్షణం ప్రతిస్పందించాల్సినఅంశాలపైఉత్తరాలను వ్రాసేలా ప్రోత్సహించాలి.( మాదిరి ఉత్తరాలనుఅభ్యాసపత్రాలుగా ఇచ్చారు). నిజానికి విద్యార్థులు పోస్ట్ కార్డ్ పైతల్లితండ్రులకు ఉత్తరాలను వ్రాసి పోస్ట్ చేయాలి. ఈ కృత్యం ద్వారావిద్యార్థులకు దేశంలో గల తపాలావ్యవస్థను పరిచయం చేయవచ్చు. 6. పుస్తక సమీక్ష విద్యార్థులు పుస్తక సమీక్షను వ్రాసేందుకు మార్గదర్శకత్వం వహించాలి. మార్గదర్శకత్వానికి అవసరమయ్యే కొన్ని ప్రశ్నలు పుస్తకం పేరేమిటి ? రచయిత ఎవరు ? పుస్తక ఇతివృతం ఏమిటి ? ముఖ్య పాత్రలు ఎవరు ? కథలో ఏమి జరుగుతుంది ? ఈ పుస్తకమంటే మీకేందుకు ఇష్టం ? ఇందుకోసం పదమూడవ అభ్యాసపత్రం : నా కిష్టమైన పుస్తకం ని చూడండి. 7. కథలు 7a. కథలు వ్రాయడం పిల్లలకు పదాల వ్యాకరణం అంటే కష్టం కావున వ్రాయడానికి విసుగుని చూపిస్తారు. మనం వారు వ్రాసేవిషయాల్లో వ్యాకరణానికి సంబంధించిన పదాలనిర్మాణంలో తప్పులను వెదుకుతూ ఉంటే వారు సృజనాత్మకంగా వ్రాయలేరు. సృజనాత్మకంగా వ్రాయడం పిల్లలకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ప్రారంభంలో విద్యార్థులను వారి భావాలను స్వేచ్ఛగా వ్యక్తీకరించడానికి అవకాశం కల్పించాలి, పదనిర్మాణాన్ని, వ్యాకరణాన్ని చూడకూడదు. విద్యార్థులను స్వంతంగా సరళమైన భాషలో కథలను వ్రాయడానికి ప్రోత్సహించాలి. పిల్లలు కథలను వ్రాయడానికి సహాయకారిగా ఇక్కడ కొన్ని కృత్యాలను ఇచ్చారు. ఒక చిత్రం సహాయంతో దీనిని ప్రారంబించవచ్చు. విద్యార్థులకు ఒక చిత్రాన్ని చూపి దాని ఆధారంగా ఒక కథను వ్రాయమని చెప్పండి. మీరు కథ మొదటి పేరా మొదటి వాక్యాన్ని చెపుతూ పిల్లలకు సహాయపడవచ్చు. లేదా కథముగింపుని తెలియచేసే వాక్యాన్ని తెలిపి దాని ఆధారంగా కథను వ్రాయమని చెప్పవచ్చు. కథను వ్రాయడానికి అవసరమైన సూచనలను సలహాలను ఇవ్వండి. కథ దేని గురించి ? కథ ఎక్కడ జరుగుతున్నది ? కథ మొదట్లో ఏమి జరుగుతుంది ? తరువాత ఏమౌతుంది ? సూచన: అద్భుతమైన కథలు ఆసక్తికరమైన ముగింపుని ఇస్తాయి. ఇందుకోసం పద్నాల్గవ అభ్యాసపత్రం : కథను వ్రాయడం ని చూడండి. 7b. కథల పుస్తకాన్ని తయారుచేయడం: ఇపుడు విద్యార్థులను కథను మొదట చిత్తుప్రతిగా వ్రాసి దానిని సవరించి, సంకలన పరచమని చెప్పండి.ఈ ప్రతిని మీరు కొన్ని సూచనలతో సరిచేయవచ్చు. కథను కొన్ని విభాగాలుగా చేయవచ్చు. ప్రతివిభాగానికి ఒక చిత్రాన్ని జతచేయండి. ఈ చిత్రం ఆ భాగంలోని ఇతివృత్తాన్ని ప్రతిబింబించేలా చూడండి. 8. గొడపత్రికను ఏర్పాటుచేయడం విద్యార్థులను గొడపత్రికను ఏర్పాటుచేసేలా ప్రోత్సహించాలి. ఇందులోని వివిధవిభాగాలను నిర్వహణకోసం వేరు వేరు విద్యార్థులకు కేటాయించాలి ఉదాహరణకు సంఘటనలపై నివేదికలను రూపొందించడం ఒకరికి, ప్రకటనల విభాగం ఒకరికి, సాహిత్యవిభాగం ఒకరికి,ప్రహేళిక విభాగం ఒకరికి కార్టూనుల, జోకుల విభాగం ఒకరికి లేదా సృజనాత్మకంగా మరేదైనా విభాగాన్ని ఏర్పాటుచేస్తే దానికోసం ఒకరిని ఇలా విద్యార్థుల ఆసక్తికి అనుగుణంగా ఏర్పాటుచేయాలి. విద్యార్థులు వ్యక్తిగతంగా కానీ లేదా బృందంగా గానీ పనిచేయవచ్చు. ఒకరిద్దరు విద్యార్థులు ఈ పనిని సరిచూడవచ్చు. ఈ మొత్తం కృత్యాన్ని విద్యార్థులే చేయాలి. ఈ విషయంలో ఉపాధ్యాయుడు కొంతవరకు సహాయం చేయవచ్చు. ఈ కృత్యం విద్యార్థులలో వ్రాయడానికి ఆసక్తిని కలిగించడమేకాక విద్యార్థులు తొందరగా నిర్ణయాలు తీసుకోవడానికి దోహదపడుతుంది 9. సహాయక వాక్యాలను వ్రాయడం సహాయక వాక్యాలను వ్రాయమని చెప్పడం ద్వారా ద్వారా పిల్లలలో భావవ్యక్తీకరణను ప్రోత్సహించవచ్చు. ఈ సహాయక వాక్యాలు విద్యార్థుల సృజనాత్మకు దోహదపడుతాయి. ఇవి వారిలో వ్రాసేనైపుణ్యాలు మెరుగౌతాయి. 9a. విశదంగా వ్రాసేందుకు సహాయక వాక్యాలను అందించడం విశదంగా వ్రాసేందుకు సహాయక వాక్యాలు ఒక సంఘటనలోని దశలను తెలియచేస్తాయి. విద్యార్థులు వీటిని సరైన క్రమంలో ఉంచి వీటిని వివరించవచ్చు. ఇవి ఒక వాస్తవమైనవి కావచ్చు లేదా ఒక కాల్పనికానికి చెందినవైనా అవవచ్చు. ఉదాహరణకు, నేను తప్పిపోయిన రోజు, మిమ్ములను ఎక్కడికైనా తీసుపోగల ఒక మాయాతివాచి గురించి, మీ నానమ్మ మిమ్ములను చూడడానికి వచ్చినరోజు పాఠశాలలో మీ మొదటిరోజు మిమ్ములను ఒకరోజు మీ పాఠశాలప్రధానోపాధ్యాయున్ని చేస్తే, ఒక రోజు నిద్రలేవగానే మీరు అంతర్దానమయ్యారని మీరు తెలుసుకొన్నారు, తిరిగి మీరు యధాస్థితికి ఎలా వచ్చారో వ్రాయండి. 9b. అనునయపూరిత సహాయవాక్యాలను వ్రాయడం: వీటి వలన విద్యార్థి తనదృక్కోణానానికి వెనుకగల కారణాలను తర్కాన్ని వివరిస్తాడు. 9c. విశదంగా వ్రాయడానికి సహాయాపడే వాక్యాలు : ఒక ప్రక్రియను క్రమంలో అవగాహనచేసుకొనేందుకు ప్రక్రియను వివరించేందుకు ఈ వాక్యాలు ఉపయోగపడుతాయి. ఉదాహరణకు మీకిష్టమైన ఆటను ఆడేవిధానం గురించి వ్రాయండి ప్రతి వ్యక్తికి స్నేహితులు ఉండాల్సిన అవసరం ఉందా? మీ పట్టణంలో నివసించడంలో ఉన్న సౌలభ్యాలు, కష్టాలు ఏమిటి వ్రాయండి? సహేతుకంగా వివరించండి. 10. పత్రికలకోసం వ్రాయడం విద్యార్థులను పత్రికలకు వ్రాసేలా ప్రోత్సహించాలి. కొన్ని కాగితాలను ఒక దినచర్య పుస్తకంలా తయారుచేసుకొని విద్యార్థులను ఈ పుస్తకంలో ప్రతిరోజూ ఒక పేజీ వ్రాసేలా ప్రోత్సహించాలి. విద్యార్థులు తమ భావాలను స్వేచ్ఛగా వ్యక్తీకరించడానికి అవకాశాన్ని కలిగించడమే దీని ముఖ్యఉధ్ధేశ్యం, కావున పద నిర్మాణాన్ని, వ్యాకరణాన దోషాలను చూడకూడదు. విద్యార్థులు ఈ కృత్యాన్ని కొనసాగించేలా చూడడమే ఉపాధ్యాయుని ముఖ్యకార్యం. వారికి ఆమోదయోగ్యమైతే ఈ విషయాలను ఇతర విద్యార్థులతో పంచుకోవచ్చు. ఈ కృత్యాలన్నింటి ద్వారా ఉపాధ్యాయులు విద్యార్థులను అవగాహన చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. సాధారణంగా విద్యార్థులు దినచర్యపుస్తకంలో ఇతరులతో మాట్లాడని విషయాలనే వ్రాసే అవకాశంఉంది. సరళయంత్రాలు - పరిచయం - చిత్ర వెంకట్రామన్ ప్రాథమిక సమాచారం విజ్ఞానశాస్త్రం యొక్క ముఖ్యలక్షణం, పరిశీలన ద్వారా ప్రత్యక్షంగాకానీ, పరోక్షంగాకానీ సమాచారాన్ని సేకరించి వివిధ పధ్ధతుల ద్వారా దీనిని పరీక్షించడం. తరచూ ఉపాధ్యాయులు పాఠ్య ప్రణాళికను పూర్తిచేయాలనే సమయాభావంతో భొధనకు కానీ, బోధన కోసం తయారవ్వడానికి కానీ తక్కువ సమయం పట్టే పద్ధతుల వైపే మొగ్గు చూపుతుంటారు. పిల్లలు ఈ పధ్ధతిలో ఙ్ఞానాన్ని సమపార్జించినా, వారు అనుప్రయోగఙ్ఞానాన్ని అభివృద్ది చేసుకోలేక పోతున్నారు. ప్రత్యక్షానుభావాలను అభ్యసనంతో అనుసంధానించుటకు ఈ పాఠ్య ప్రణాళిక ప్రయత్నం చేస్తోంది. సమయం : 40 నిముషాలు పరిచయం: విజ్ఞానశాస్త్రం యొక్క ముఖ్యలక్షణం, పరిశీలన ద్వారా ప్రత్యక్షంగాకానీ, పరోక్షంగాకానీ సమాచారాన్ని సేకరించి వివిధ పధ్ధతుల ద్వారా దీనిని పరీక్షించడం. తరచూ ఉపాధ్యాయులు పాఠ్య ప్రణాళికను పూర్తిచేయాలనే సమయాభావంతో భొధనకు కానీ, బోధన కోసం తయారవ్వడానికి కానీ తక్కువ సమయం పట్టే పద్ధతుల వైపే మొగ్గు చూపుతుంటారు. పిల్లలు ఈ పధ్ధతిలో ఙ్ఞానాన్ని సమపార్జించినా, వారు అనుప్రయోగఙ్ఞానాన్ని అభివృద్ది చేసుకోలేక పోతున్నారు. ప్రత్యక్షానుభావాలను అభ్యసనంతో అనుసంధానించుటకు ఈ పాఠ్య ప్రణాళిక ప్రయత్నం చేస్తోంది. లక్ష్యం: విద్యార్థులు యంత్రాలను గుర్తిస్తారు. విద్యార్థులు తమ స్వంత మాటల్లో యంత్రాలను వర్ణిస్తారు. విద్యార్థులు యంత్రాల యొక్క ఉపయోగాలను తెలియ చేస్తారు. సోపానాలు : సోపానాలను చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి. మొదటి సోపానం : ఆసక్తిని కలిగించడం మొదటి కృత్యం : విద్యార్థులను ఒక వృత్తంగా ఏర్పడమనండి ఈ వృత్తం మధ్యలో ఒక బల్లపై చెక్కపెట్టెను ఉంచండి. విద్యార్థులను పిలుస్తూ ప్రతి ఒక్క విద్యార్థిని ఆ పెట్టె నుండి ఒక వస్తువుని తీసుకోమని చెప్పండి. ఆ వస్తువుని గుర్తించి దాని ఉపయోగాలను చెప్పమని చెప్పండి. (ఉపాధ్యాయుడు ప్రత్యామ్నయంగా సామాగ్రి యొక్క చేతిప్రతులను ఉపయోగించవచ్చు) చర్చను ప్రారంభించి ఈ అంశాన్ని పరిచయం చెయ్యండి. మీకు యంత్రం అనగానే ఏమి గుర్తుకు వచ్చింది ? మీరు యంత్రాలను చూసారా? ఎక్కడ చూసారు ? మనం రోజు ఉపయోగించే కొన్ని యంత్రాల పేర్లను చెప్పండి ? (యంత్రం అంటే మన పనిని సులువు చేసే ఒక పరికరం అని వివరించండి). రెండవ సోపానం : వివరణ : రెండవ కృత్యం : 1. 1B వనరు ప్రతిని విధ్యార్థులందరికీ ఇవ్వండి 2. 1B వనరు లోని కృత్యాన్ని అందరూ పూర్తీ చెయ్యమని చెప్పండి. (ఈ కృత్యం ముగించిన తరువాత జవాబులను చర్చించండి, మనము కొన్ని పనులను ఇతరుల (మనుష్యుల) సహయంతో చెయ్యవచ్చు. కొన్ని మనమెవ్వరూ చెయ్యలేము) మూడవ సోపానం : పునారావలోకనం : మూడవ కృత్యం: 1. విద్యార్థులను సమూహాలుగా ఏర్పడమని చెప్పండి. 2. ఒక్కొక సమూహాన్ని పిలిచి పెట్టలోని ఒక అంశాన్ని ఎంచుకోమని చెప్పండి. (1A వనరు ఆధారంగా ఉపాధ్యాయుడు తయారుచేసిన జాబితా నుండి ) ( ఇప్పుడు జాబితానుండి బొమ్మలను, యంత్రం కాని వాటిని తొలగించండి . వీటి ద్వారా విద్యార్థుల నుండి ఖచ్చితమైన జావాబులను ఆశించవచ్చు) 3.విద్యార్థులను వారు ఎంచుకొన్న యంత్రం గురించి చాలా ఎక్కువగా మాట్లడమని చెప్పండి. (ఈ యంత్రం పేరు చెప్పండి ? ఈ యంత్రం యొక్క ఉపయోగమేమిటో చెప్పండి ? దీని ఇంతకు ముందు ఎక్కడ చూసావు ? ఈ ప్రశ్నలను కొద్దిగా వివరించమని చెప్పండి?) సరళ యంత్రాలు - శ్రమ మరియు లోడ్ ప్రాథమిక సమాచారం విజ్ఞానశాస్త్రం యొక్క ముఖ్యలక్షణం, పరిశీలన ద్వారా ప్రత్యక్షంగాకానీ, పరోక్షంగాకానీ సమాచారాన్ని సేకరించి వివిధ పధ్ధతుల ద్వారా దీనిని పరీక్షించడం. తరచూ ఉపాధ్యాయులు పాఠ్య ప్రణాళికను పూర్తిచేయాలనే సమయాభావంతో భొధనకు కానీ, బోధన కోసం తయారవ్వడానికి కానీ తక్కువ సమయం పట్టే పద్ధతుల వైపే మొగ్గు చూపుతుంటారు. పిల్లలు ఈ పధ్ధతిలో ఙ్ఞానాన్ని సమపార్జించినా, వారు అనుప్రయోగఙ్ఞానాన్ని అభివృద్ది చేసుకోలేక పోతున్నారు. ప్రత్యక్షానుభావాలను అభ్యసనంతో అనుసంధానించుటకు ఈ పాఠ్య ప్రణాళిక ప్రయత్నం చేస్తోంది. సమయం : 40 నిముషాలు పరిచయం : విజ్ఞానశాస్త్రం యొక్క ముఖ్యలక్షణం, పరిశీలన ద్వారా ప్రత్యక్షంగాకానీ, పరోక్షంగాకానీ సమాచారాన్ని సేకరించి వివిధ పధ్ధతుల ద్వారా దీనిని పరీక్షించడం. తరచూ ఉపాధ్యాయులు పాఠ్య ప్రణాళికను పూర్తిచేయాలనే సమయాభావంతో భొధనకు కానీ, బోధన కోసం తయారవ్వడానికి కానీ తక్కువ సమయం పట్టే పద్ధతుల వైపే మొగ్గు చూపుతుంటారు. పిల్లలు ఈ పధ్ధతిలో ఙ్ఞానాన్ని సమపార్జించినా, వారు అనుప్రయోగఙ్ఞానాన్ని అభివృద్ది చేసుకోలేక పోతున్నారు. ప్రత్యక్షానుభావాలను అభ్యసనంతో అనుసంధానించుటకు ఈ పాఠ్య ప్రణాళిక ప్రయత్నం చేస్తోంది. లక్ష్యం : విద్యార్థులు తమ స్వంత పదాలలో లోడ్ (Load) మరియు శ్రమని నిర్వచిస్తారు. విద్యార్థులు ఈ లోడ్ (Load) మరియు శ్రమ మద్య సంభందాన్ని కనుగొనడానికి ఒక కృత్యాన్ని చేస్తారు. విద్యార్థులు ఇచ్చిన ఉదాహరణలలో లోడ్ (Load) మరియు శ్రమని గుర్తిస్తారు. సోపానాలు : సోపానం A చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి. సోపానం B చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి. బొధనోపకరణాలు: 1. అనుబంధం A లో సూచించబడిన ప్రయోగాలకు అవసరమైన సామాగ్రి (ఆరు జతలు) 2. అనుబంధం B ప్రతులు ( పునరావలోకనం). సోపానాలు: మొదటి సోపానం : ఆసక్తిని కలిగించడం : మొదటి కృత్యం : 1. ఒకరిని స్వచ్చందంగా ముందుకు రమ్మనండి. 2. ఒక విద్యార్థిని తరగతిగది తలుపు దగ్గర నిలబడి దానిని తోయమని చెప్పండి (తలుపు అందుబాటులో లేనట్లైతే ,విద్యార్థులను ఒక కుర్చీని లేదా బల్లను ఎత్తమని చెప్పండి.ఈ ప్రశ్నలను అడగండి) అతడు లేదా ఆమే ఏమి చేస్తోంది/చేస్తోన్నాడు ? దానిని వేరెవరైనా మరోవిధంగా చెయ్యడానికి ప్రయత్నం చేస్తారా. ఇప్పుడు మనము ఉపయోగించిన “తొయ్యడం” “ లాగడం” అన్నదే “బలం” లేదా “శ్రమ ” అని అంశాన్ని పరిచయం చెయ్యండి) రెండవ సోపానం : రెండవ కృత్యం : విద్యార్థులను 5 సమూహాలుగా విభజించండి ప్రతి సమూహానికి ఒక ప్రయోగ కిట్ ఇవ్వండి(A అనుబంధం లోని సామాగ్రి తో ఉపాధ్యాయునిచే తయారు చేసినది). అనుబంధం A లో ఇచ్చిన ఆదేశాలను ఒకటి తరువాత ఒకటి చెప్పండి ( కృత్యాన్ని ఏలా చెయ్యాలి అని) లోడ్ (Load) మరియు శ్రమ పదాలను వివరించండి. మూడవ సోపానం : మూడవ కృత్యం : పునరావలోకనం 1. అనుబంధం B ప్రతులను పంపిణీ చెయ్యండి 2. జవాబులను విద్యార్థులతో చర్చించండి (అనుబంధం B లో ఇచ్చిన సన్ని వేశాలను ఉపాధ్యాయుడు వివరించవచ్చు లేదా ప్రదర్శించవచ్చు తరువాత విద్యార్థులను లోడ్ (Load) మరియు శ్రమ అంటే ఏమిటో అడగండి ) సరళ యంత్రాలు - తులాడండం ప్రాథమిక సమాచారం విజ్ఞానశాస్త్రం యొక్క ముఖ్యలక్షణం, పరిశీలన ద్వారా ప్రత్యక్షంగాకానీ, పరోక్షంగాకానీ సమాచారాన్ని సేకరించి వివిధ పధ్ధతుల ద్వారా దీనిని పరీక్షించడం. తరచూ ఉపాధ్యాయులు పాఠ్య ప్రణాళికను పూర్తిచేయాలనే సమయాభావంతో భొధనకు కానీ, బోధన కోసం తయారవ్వడానికి కానీ తక్కువ సమయం పట్టే పద్ధతుల వైపే మొగ్గు చూపుతుంటారు. పిల్లలు ఈ పధ్ధతిలో ఙ్ఞానాన్ని సమపార్జించినా, వారు అనుప్రయోగఙ్ఞానాన్ని అభివృద్ది చేసుకోలేక పోతున్నారు. ప్రత్యక్షానుభావాలను అభ్యసనంతో అనుసంధానించుటకు ఈ పాఠ్య ప్రణాళిక ప్రయత్నం చేస్తోంది. సమయం : 40 నిముషాలు పరిచయం : విజ్ఞానశాస్త్రం యొక్క ముఖ్యలక్షణం, పరిశీలన ద్వారా ప్రత్యక్షంగాకానీ, పరోక్షంగాకానీ సమాచారాన్ని సేకరించి వివిధ పధ్ధతుల ద్వారా దీనిని పరీక్షించడం. తరచూ ఉపాధ్యాయులు పాఠ్య ప్రణాళికను పూర్తిచేయాలనే సమయాభావంతో భొధనకు కానీ, బోధన కోసం తయారవ్వడానికి కానీ తక్కువ సమయం పట్టే పద్ధతుల వైపే మొగ్గు చూపుతుంటారు. పిల్లలు ఈ పధ్ధతిలో ఙ్ఞానాన్ని సమపార్జించినా, వారు అనుప్రయోగఙ్ఞానాన్ని అభివృద్ది చేసుకోలేక పోతున్నారు. ప్రత్యక్షానుభావాలను అభ్యసనంతో అనుసంధానించుటకు ఈ పాఠ్య ప్రణాళిక ప్రయత్నం చేస్తోంది. లక్ష్యం : 1. విద్యార్థులు తులాడండాన్ని వివరిస్తారు. 2. ప్రయోగం ద్వారా తులాడండాల సూత్రాన్ని సాధారణీకరిస్తారు. 3. విద్యార్థులు ఆధారం యొక్క స్థానాన్ని (fulcrum) అంచనా వేస్తారు. సోపానాలు : సోపానాలను చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి. బోధనోపకరణాలు: 1. గట్టిగా మూసిన డబ్బా మరియు చెంచా (Spoon) (మొదటి సోపానం కోసం) 2. అనుబంధంలోని సామాగ్రి (ఆరు జతలు) సోపానాలు : మొదటి సోపానం : ఆసక్తి కలిగించడం : 1. విద్యార్థుల సంఖ్య ఆధారంగా 5 లేదా 6 సమూహాలుగా విభజించండి. 2. గట్టిగా మూసిన డబ్బాను చేతిని మాత్రమే ఉపయోగింఛి తెరవడానికి ప్రయత్నించండి. 3. తరువాత చెంచా (Spoon) ని ఉపయోగించి డబ్బామూతను తెరవండి. (అన్నిరకాల జవాబులను అనుమతిస్తూ చర్చను ప్రారంభించండి) సాధారణంగా డబ్బా మూతను నీవెలా తెరుస్తావు ? మూత గట్టిగా ఉంటే నీవేమి చేస్తావు ? చెంచా (Spoon) తో డబ్బా మూతను తీయడం సులభమా ? మన పనిని సులభతరం చేసే వస్తువుని ఏమంటావు ? కావున చెంచా (Spoon) కూడా ఒక యంత్రమే, మీరందరూ దీనికి అంగీకరిస్తారా? ఈ యంత్రం పేరేమిటో చెప్పగలవా ? తులాడండం అంశాన్ని ఇక్కడ పరిచయం చెయ్యండి. మన పనిని సులభతరం చేసే ఒక సరళయంత్రమే తులాడండం. స్థిరంగా నిలచి సులభంగా తిరగగలిగే పొడవైన కడ్డీనే తులాడండం. ఏ వస్తువునైతే దీనిని ఉపయోగించి ఎత్తామో లేదా కదిలించామో దానిని లోడ్ (Load) అని అంటాము. ఆ వస్తువుని ఎత్తడానికి ఉపయోగించేదే బలం (శ్రమ) రెండవ సోపానం : వివరణ : 1. చెప్పిన సామాగ్రిని ఒక బృందానికి ఒక జత ఇవ్వండి. 2. అనుబంధంలో ఇచ్చిన ఆదేశాలను ఒకటి తరువాత ఒకటి చెప్పండి. 3. అనుబంధంలో గల పట్టికను పూర్తి చెయ్యమని విద్యార్థులకు చెప్పండి. (పట్టికను నల్లబల్ల పై గీయండి.విద్యార్థులను ఈ ప్రయోగం యొక్క ఫలితమేమిటో తెలుసుకొని రమ్మని చెప్పండి. ప్రయోగం యొక్క లక్ష్యంతో సరి పోల్చండి. తులాదండం అంటే మన పనిని సులభతరం చేసే ఒక సరళ యంత్రంఅని విద్యార్థులకు అవగాహన కలిగించండి) మూడవ సోపానం : మూల్యాంకనం : పునరావలోకనం 1. అనుబంధంగా ఇచ్చిన అభ్యాసపత్రాన్ని పంపిణీ చెయ్యండి. 2. .పూర్తి అయిన తరువాత జవాబులను చర్చించండి. సరళ యంత్రాలు - తులదండాలలో రకాలు ప్రాథమిక సమాచారం విజ్ఞానశాస్త్రం యొక్క ముఖ్యలక్షణం, పరిశీలన ద్వారా ప్రత్యక్షంగాకానీ, పరోక్షంగాకానీ సమాచారాన్ని సేకరించి వివిధ పధ్ధతుల ద్వారా దీనిని పరీక్షించడం. తరచూ ఉపాధ్యాయులు పాఠ్య ప్రణాళికను పూర్తిచేయాలనే సమయాభావంతో భొధనకు కానీ, బోధన కోసం తయారవ్వడానికి కానీ తక్కువ సమయం పట్టే పద్ధతుల వైపే మొగ్గు చూపుతుంటారు. పిల్లలు ఈ పధ్ధతిలో ఙ్ఞానాన్ని సమపార్జించినా, వారు అనుప్రయోగఙ్ఞానాన్ని అభివృద్ది చేసుకోలేక పోతున్నారు. ప్రత్యక్షానుభావాలను అభ్యసనంతో అనుసంధానించుటకు ఈ పాఠ్య ప్రణాళిక ప్రయత్నం చేస్తోంది. సమయం : 40 నిముషాలు పరిచయం : విజ్ఞానశాస్త్రం యొక్క ముఖ్యలక్షణం, పరిశీలన ద్వారా ప్రత్యక్షంగాకానీ, పరోక్షంగాకానీ సమాచారాన్ని సేకరించి వివిధ పధ్ధతుల ద్వారా దీనిని పరీక్షించడం. తరచూ ఉపాధ్యాయులు పాఠ్య ప్రణాళికను పూర్తిచేయాలనే సమయాభావంతో భొధనకు కానీ, బోధన కోసం తయారవ్వడానికి కానీ తక్కువ సమయం పట్టే పద్ధతుల వైపే మొగ్గు చూపుతుంటారు. పిల్లలు ఈ పధ్ధతిలో ఙ్ఞానాన్ని సమపార్జించినా, వారు అనుప్రయోగఙ్ఞానాన్ని అభివృద్ది చేసుకోలేక పోతున్నారు. ప్రత్యక్షానుభావాలను అభ్యసనంతో అనుసంధానించుటకు ఈ పాఠ్య ప్రణాళిక ప్రయత్నం చేస్తోంది. లక్ష్యం : విద్యార్థులు తులాదండం నిర్వచనాన్ని ఙ్ఞప్తికి తెచ్చుకొంటారు విద్యార్థులు వివిధ రకాల తులాదండాలను వర్గీకరిస్తారు. విద్యార్థులు మూడు రకాల తులాదండాలను గుర్తిస్తారు. సోపానాలు : సోపానాలను చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి. మొదటిసోపానం : ఆసక్తిని కలిగించడం : ఒకటవ కృత్యం : 1. ఒక పుస్తకాన్ని బల్లపై ఉంచి ఒకరిని పిలవండి. 2. విద్యార్థిని రెండు వనరుల సహాయంతో పుస్తకాన్ని కదిలించమని చెప్పండి (అందుబాటులో ఉండే ఏదైనా వస్తువు అంటే స్కేల్, పెన్సిల్, కట్టే, ఏదైనా ఒక వస్తూవుని ఉపయోగిస్తూ విద్యార్థులందరిని గమనించమని చెప్పండి. విద్యార్థులకు తులదండాలంటే ఏమిటో గుర్తుతెచ్చు కొనేందుకు అవకాశం కల్పించండి. విద్యార్థి ఉపయోగించే స్కేల్ గానీ కట్టె గాని కూడ తులాదండమనే చెప్పండి.) రెండవ సోపానం : వివరణ : రెండవ కృత్యం 2 : 1. విద్యార్థులను ఆరు సమూహాలుగా చెయ్యండి. 2. ప్రయోగానికి కావలసిన సామగ్రి గల ఆరు పెట్టెలలను తయారు చేసి ఆరు సమూహాలకు ఇవ్వండి (అనుబంధం Aలో గల సామాగ్రి ) 3. అనుబంధం Aలో గల ఆదేశాలను ఒక దాని తరువాత మరొకటి చెప్పండి 4. విద్యార్థులను తమ పరిశీలనలను ఒక పట్టిక రూపంలో నమోదు చెయ్యమని చెప్పండి. ( పట్టికను నల్లబల్లపై వ్రాయండి). (వివరణ: తులాడండాలు మూడు రకాలు ఉన్నయి. అవి మొదటి రెండవ మరియు మూడవ రకం తులాడండాలు)మొదటి రకం తులాదండాలలో ఆధారం,లోడ్ (Load) కి శ్రమ కి మద్య న ఉంటుంది. రెండవ రకం తులాదండాలలో లోడ్ (Load),ఆధారం కి శ్రమ కి మద్య న ఉంటుంది.మూడవ రకం తులాదండాలలో శ్రమ లోడ్ (Load) కి ఆధారం కి మద్య న ఉంటుంది.) మూడవ సోపానం : మూల్యాంకనం : 3 తులాదండాలనూ ప్రతిబింబించే చిత్రాలను గియ్యండి సరళయంత్రాలు - కప్పీలు (Pulleys) ప్రాథమిక సమాచారం విజ్ఞానశాస్త్రం యొక్క ముఖ్యలక్షణం, పరిశీలన ద్వారా ప్రత్యక్షంగాకానీ, పరోక్షంగాకానీ సమాచారాన్ని సేకరించి వివిధ పధ్ధతుల ద్వారా దీనిని పరీక్షించడం. తరచూ ఉపాధ్యాయులు పాఠ్య ప్రణాళికను పూర్తిచేయాలనే సమయాభావంతో భొధనకు కానీ, బోధన కోసం తయారవ్వడానికి కానీ తక్కువ సమయం పట్టే పద్ధతుల వైపే మొగ్గు చూపుతుంటారు. పిల్లలు ఈ పధ్ధతిలో ఙ్ఞానాన్ని సమపార్జించినా, వారు అనుప్రయోగఙ్ఞానాన్ని అభివృద్ది చేసుకోలేక పోతున్నారు. ప్రత్యక్షానుభావాలను అభ్యసనంతో అనుసంధానించుటకు ఈ పాఠ్య ప్రణాళిక ప్రయత్నం చేస్తోంది. సమయం : 40 నిముషాలు పరిచయం : విజ్ఞానశాస్త్రం యొక్క ముఖ్యలక్షణం, పరిశీలన ద్వారా ప్రత్యక్షంగాకానీ, పరోక్షంగాకానీ సమాచారాన్ని సేకరించి వివిధ పధ్ధతుల ద్వారా దీనిని పరీక్షించడం. తరచూ ఉపాధ్యాయులు పాఠ్య ప్రణాళికను పూర్తిచేయాలనే సమయాభావంతో భొధనకు కానీ, బోధన కోసం తయారవ్వడానికి కానీ తక్కువ సమయం పట్టే పద్ధతుల వైపే మొగ్గు చూపుతుంటారు. పిల్లలు ఈ పధ్ధతిలో ఙ్ఞానాన్ని సమపార్జించినా, వారు అనుప్రయోగఙ్ఞానాన్ని అభివృద్ది చేసుకోలేక పోతున్నారు. ప్రత్యక్షానుభావాలను అభ్యసనంతో అనుసంధానించుటకు ఈ పాఠ్య ప్రణాళిక ప్రయత్నం చేస్తోంది. లక్ష్యం : విద్యార్థులు కప్పీలను ఒక యంత్రం అని గుర్తిస్తారు. విద్యార్ధులు కప్పీలను వర్ణిస్తారు. విద్యార్థులు కప్పీలను యంత్రాలని నిర్ధారిస్తారు. విద్యార్థులు కప్పీలనుపయోగించి సమస్యలను పరిష్కరిస్తారు సోపానాలు : సోపానాలను చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి. బోదనోపకరణాలు : సరళయంత్రాలు - కప్పీలు, అనుబంధంమలోని సామాగ్రి (5 జతలు) సోపానాలు : మొదటి సోపానం ఆసక్తిని కలిగించడం : 1. విద్యార్థులను ఐదు 5 సమూహాలుగా విభజించండి. 2. ఒక ఆసక్తికరమైన సంఘటనను వర్ణించండి. (ఎ. ఒక పిల్లవాడు బావిలో పడి పోయాడు. నీవెలా రక్షిస్తావు ? బి. నీవు రోడ్డు పై నడుస్తున్నావు బాగా దాహం వేస్తోంది. దగ్గరలోనే ఒక బావి కనిపించింది. దాని నుండి నీవు నీటిని ఎలా తీసుకొంటావు ? విద్యార్థులు చెప్పే అన్ని సమాధానాలను అంగీకరించండి.వారి చర్చను నిలిపివేసి చివరిలో మరి దీనిని చర్చిస్తామని చెప్పండి) 3. వారికి ఒక కప్పీని చూపండి. (దీనిని మేరెప్పుడైన చూసారా? ఇది మనం చేసే పనిని సులభతరం చేస్తుందా ? దీనిని మనం యంత్రం అనవచ్చా ? వర్ణించండి, అన్ని సమాధానాలను అంగీకరించండి) రెండవ సోపానం : వివరణ : కృత్యం 1. అనుబంధంలో చూపించిన సమాగ్రి (5జతలు ) 2. సంచులను పంపిణీచేసి అనుబంధంలో ఇచ్చిన ఆదేశాలను ఒక్కొక్కటిగా చెప్పండి. (నీవు బరువుని వివిధ పధ్దతులలో ఎత్తావు ఏ ప్దదతి లో బరువుని ఎత్తినపుడు నీకు సులభమనిపించింది ? పునరావలోకనం : 1. మొదటి సోపానం లో వర్ణించిన సంఘటనను గుర్తుకు తెచ్చుకోండి. 2. ఈ సంఘటనకు తగిన పరిష్కారాలను సూచించమని చెప్పండి. ఒరిగామితో గణితం - V.S.S. శాస్త్రి - లెర్నింగ్ కర్వ్ పిల్లల నెవరినైనా ఒక కాగితాన్ని మడచమని చెప్పండి, ఆ పిల్లవాడు వెంటనే ఎందుకు ? అని ప్రశ్నిస్తాడు. ఈ పనిని బరువైనదిగా బావిస్తాడు. అదే పిల్లలను కాగితాన్ని మడిచి పడవనో, పక్షినో చేయమని కొంత మార్గదర్శకము చేస్తే ఆ పనిని వెంటనే మొదలుపెట్టడమే కాక చాలా ఆనందంగా చేస్తాడు. ఈ నమూనాలను చేసిన తరువాత వాటిని విప్పి వాటి ద్వారా గణితఅంశాలైన కోణాలను, రేఖలను, వైశాల్యాలను బోధించవచ్చు. వారికి ఇది ఒక ఆవిష్కార మార్గమౌతుంది. మొత్తం ప్రక్రియ పిల్లలకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. కాగితాన్ని మడచి వివిధ ఆకారాలుగా తయారుచేయడాన్ని “ఒరిగామి” అని అంటారు . కొన్ని నమూనాలను తయారు చేయడానికి కాగితాన్ని కొన్ని వందలసార్లు మడచవలసి వస్తుంది అలాగే కొన్నిసంక్లిష్టమైన ఆకారాలను తయారు చేయడానికి రెండు లేదా ఇంకా ఎక్కువ ఆకారాలను తయారుచేసి వాటిని ఒకదానితో మరోకదానిని కలపవలసి వస్తుంది. ఒరిగామితో గణితాన్ని బోధించినపుడు వారికి వివిధ ఆకారాలు వారి ముందే ఆవిష్కృతమౌతాయి . ఈ పద్ధతి గణితంలోని అమూర్త భావనలను ఆసక్తితో ఆన్వేషించడానికి ఉపయోగపడుతుంది. ప్రస్తుతం ఒరిగామిలోని సంక్లిష్టమైన నమూనాలను ప్రక్కకుపెట్టి సాధారణమైన, సరళమైన నమూనాలను చూద్దాం. ఇందుకోసం నేను ఎనిమిది మడతలు లేదా అంతకంటే తక్కువ మడుతలు గల నమూనాలను మాత్రమే ఉపయోగిస్తున్నాను. ఇవి సరళమైనవే కాక చిన్న నమూనాలు. గణితాన్ని బోధించడానికి అనువైనవి. మన దేశంలో ఈ “ఒరిగామి” ఒక జానపదకళగా మాత్రమే ఉంది, విస్త్రుత ఉపయోగంలో లేదు. ప్రస్తుతం ఏ ఉపాధ్యాయుడూ కాగితాన్ని ఉపయోగించి కప్పుని, పడవని, పక్షిని తయారుచేయడాన్ని బోధించడంలేదు. వీటిని వారి సహోపాధ్యాయుల ద్వారా వీటిని నేర్చుకోగలిగితే వారు చాలా అదృష్టవంతులౌతారు. సరళమైన ఒరిగామి నమూనాలతో కొన్ని గణితభావనలను ఎలా బోధించవచ్చో ఉదాహరణలతో వివరిస్తున్నాను. కాగితంతో నెమలి : ఈ క్రింది ఇచ్చిన సులువైన సూచనల ఆధారంగా కాగితాన్ని మడచి “నెమలి” నమూనాను తయారు చేయవచ్చు. ఇపుడు నెమలి సిద్ధంగా ఉంది. చతురస్రాకారపు కాగితంతో నెమలి బొమ్మను చేయగానే పిల్లలు ఆడడం మొదలు పెడతారు. కొన్ని సందర్భాలలో ఆ నమూనా చిరిగిపోవచ్చు కూడా. పిల్లలను ఆ నమూనా మడతలను విప్పి తిరిగి చతురస్రాకారపు కాగితంలా చేయమని చెప్పండి. కానీ ఆ కాగితంలో సరళరేఖలు, కోణాలు, వైశ్యాల్యాల మొదలైనవి మడతల రూపంలో అలాగే ఉండిపోతాయి. వీటిని పెన్సిల్ తో గుర్తించవచ్చు. నమూనా మడతలను విప్పి తిరిగి చతురస్రాకారపు కాగితంలా చేయమని చెప్పండి. ఇక్కడ ADG కోణం 90 డిగ్రీలు ఇది 6 ఆరు సమభాగాలుగా విభజించబడింది. ఇప్పుడు మనకు ఆరు కోణాలు ( 15 30, 45, 60, 75, మరియు 90 డిగ్రీలు)ఈ కోణాలన్నింటిని కోణమానిని లేకుండానే కొలవవచ్చు. ఇదే పిల్లవానికి ఒక అద్భుతమైన విషయం. ఇదే నమూనాను ఈ క్రింది వానిని వివరించడానికి ఉపయోగించవచ్చు. కోణాల విభజన అధిక మరియు అల్పకోణాలు అధికకోణ త్రిభుజం అల్పకోణ త్రిభుజం సమద్విబాహు త్రిభుజం సమబాహు త్రిభుజం సమద్విబాహు లంబకోణ త్రిభుజం త్రిభుజంలోని మూడు కోణాల మొత్తం 1800 త్రిభుజంలోని ఎదురెదురు అంతరకోణాల మొత్తం బాహ్యకోణానికి సమానం సదృశ్యకోణాలు కావున ఒక సాధారణమైన నెమలి ఆకారం దాదాపు “10 “ కంటే ఎక్కువ గణిత భావనలను బోధించడానికి ఉపయోగించ వచ్చు. ఇలాంటివి కొన్ని వందల గణిత నమూనాలు ఉన్నాయి. ఇవన్నీ పిల్లలలో ఆ భావనల పునర్భాలాన్ని ఇవ్వడానికి ఉపయోగపడుతాయి. ఒరిగామితో “సప్తభుజి” సప్తభుజి నమూనా నిర్మించడం చాలా కష్టం. దీనికి దీనిలోని 128.57 డిగ్రీల అంతర్ కోణం ఉండడమే ఇందుకు కారణం. ఈ కోణాన్ని ఇంత కచ్చితంగా ఏ కోణమానినితోనూ కొలవలేము . కానీ ఒకే పొడవున్న 7 పుల్లలను సప్తభుజి ఆకారంలో అమర్చవచ్చు లేదా ఏడు రేఖల ద్వారా కాగితంపై సప్తభుజిని గీయవచ్చు. కానీ ఒరిగామినుపయోగించి ఈ కోణాన్ని కచ్చితంగా కొలవవచ్చు. ఈ క్రింది సూచనలు ప్రకారం ఒక చతురస్రాకారపు కాగితాన్ని ఉపయోగించి సప్తభుజి నమూనాను చేయవచ్చు. ఈ విధంగా మడచిన ఏడు 7 కాగితాలను ఒకదానికొకటి కలిపి సప్తభుజిని తయారుచేయవచ్చు. సుదూరకాలంలో ప్రాథమిక తరగతులకు ఒరిగామిని ఒక ఆనందాన్నిచ్చే కళలాగా బోధించవచ్చని కలలు కంటున్నాను. ఏడాదికి 8-10 నమూనాలను వారు నేర్చుకోవచ్చు. ఈ నమూనాలను ఉపయోగించే తరువాత దశలలో వారికి గణితాన్ని బోధించవచ్చు. అపుడు బోధన భాధ కాదు. ఉన్నత తరగతులలో కూడా ఒరిగామి ద్వారా గణితాన్ని బోధించవచ్చు. నిజానికి Karnataka Rajya Vigyan Parishath, Bangalore వారు పదవ తరగతిలోని గణితభావనలను వివరించడానికి “Desk Book on Mathematics through Origami” అనే పుస్తకాన్ని వెలువరించారు V.S.S. శాస్త్రి గారు బ్యాంకులో అధికారిగా పనిచేస్తున్నారు. ఇతనికి గణితశాస్త్రమంటే ఎంతో మక్కువ. పిల్లల కోసం గణితశాస్త్రం గణితకృత్యాలపై 12 పుస్తకాలను వ్రాసారు. భారత ప్రభుత్వ vigyaan prasaar డిల్లీ వారు ఇతను 10వ తరగతి విద్యార్థుల గణిత బోధనకై వ్రాసిన “origami fun and Mathematics” అనే పుస్తకాన్ని ప్రచురించారు. ఉపాధ్యాయులకోసం దాదాపు 300 వర్క్ షాప్ లను నిర్వహించారు. ఇతనికి విమానాల నమూనాలు చేయడమన్నా, గాలిపటాలను చేయడమన్నా చాలా ఆసక్తి. ఇతనిని vsssatry@gmail.com ద్వారా సంప్రదించవచ్చు. రసాయన సమీకరణాలను సమతుల్యం చెయ్యుట - చంద్రిక మురళీధర్ రసాయన సమీకరణాల సమతుల్యానికి ఇక్కడ యత్న-దోష పద్ధతిని ఎంచుకోవడం జరిగింది. ఈ పద్ధతిలో కొన్ని సంక్లిష్ట రసాయన సమీకరణాలను సమతుల్యం చెయ్యడం కష్టం. కానీ రసాయన సమీకరణాల సమతుల్యాన్ని పరిచయం చెయ్యడానికి ఈ పద్ధతి చాలా ఉత్తమమైనది. సమీకరణంలో మొదట లోహాలు, అలోహాలు ( ఆమ్లజని మరియు ఉదజని కాకుండా ) తరువాత ఆమ్లజనిని చివరిగా ఉదజనిని సమతుల్యం చెయ్యాలి. జోడింపు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి. భౌతికశాస్త్ర అభ్యాసపత్రం- కొలతలు - శైలేంద్ర గుప్త విజ్ఞానశాస్త్ర భావనలలో ఒక ముఖ్యమైన భావన కొలతలు. తెలియని పరిమాణాన్ని తెలిసిన ప్రమాణంతో పోల్చడమే కొలత. వస్తువులను వర్ణించడానికి అవసరమయ్యే భౌతికరాశుల్లో కొలతలు ముఖ్యమైనవి. ఇది దీనికి సంభంధించిన ఒక అభ్యాసపత్రం. అభ్యాసపత్రం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి. గణితంలో ప్రఙ్ఞాపాటవాలను పెంపొందించడం సాధారణంగా సంఖ్యలతో అనుబంధాన్ని మరియు అంకగణితంలోగల ప్రావీణ్యాన్ని గణిత ప్రఙ్ఞాపాటవంగా పరిగణిస్తున్నారు. కానీ గణితం ఒక భాష లాంటిది, దీని ద్వారా విజ్ఞానశాస్త్రాలను తెలియజేయవచ్చు. గణితంలో ప్రఙ్ఞా పాటవాలను పెంపొందించడం గణితంలో ప్రతిభాపాటవాలంటే ఏవి ? గణితశాస్త్రం అంటే ఒట్టి సంఖ్యలే కాదు. పరిధి చాలా ఎక్కువ. గణితమంటే వివిధ అంశాల మధ్య సంబంధాలను చూడగలగడం, తర్కము,అనుప్రయోగ సామర్థ్యము, సృజనాత్మకత, ఒక ఆత్మపరిశీలన అని ఎన్నో. గణిత ప్రతిభాపాటవాలను ఎదుర్కోవడానికి సరైన సన్నివేశాలను కల్పించి వారి నైపుణ్యాలను పెంపొదించడం ఒక్కటే సరైన మార్గము. గణిత శాస్త్ర ప్రఙ్ఞాపాటవాలను పెంపొందించడం గణితశాస్త్ర బోధన అన్నా, అభ్యసనమన్నా చాలా తరచుగా విస్త్రుతమైన చర్చే జరుగుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఏదో ఒక సందర్భంలో గణితాన్ని ఎదుర్కోవడమే కాకుండా దాని ఆధారంగా ఒక భావనను ఏర్పరచుకొని ఉంటారు. అందుకనే గణితంలో ప్రఙ్ఞాపాటవాలంటే మనకు కలిగే ఆలోచనలను, మరియు వాటిని ఎలా పెంపొందించవచ్చు అనే దానిగురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. సాధారణంగా గణితమంటేనే సంఖ్యలు మరియు అంకగణితమని అను కొంటారు. దానికనుగుణంగానే వీటిలో ప్రావీణ్యం సంపాదించడమే గణితంలో ప్రఙ్ఞాపాటవాలని అనుకొంటారు. గణితంఅంటే సంఖ్యలే కానీ ఇవి సంగీతంలోని స,రి,గ,మ ప,ద,ని,స,ల లాంటివే. గణితంశాస్త్రం విఙ్ఞానశాస్త్రాలను అంద చేసే ఒక బాష వంటిది. గణితంలో ప్రఙ్ఞాపాటవాలను ఖచ్చితంగా నిర్వచించడం చాలా కష్టం. గణితంలో ప్రఙ్ఞాపాటవాలనే లక్షణాలని తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. వాటి గురించి , సరళంగా ఉండే ఒక డెన్నిస్ వ్యంగచిత్రం బయపెడుతుంది. డెన్నిస్ స్నేహితుడైన మార్గరెట్ ఒక గుర్రపు శిల్పాన్ని చెయ్యడంలోని కష్టాన్ని వ్యక్త పరుస్తాడు, దానికి డెన్నిస్ ఆ శిల్పంలో గుర్రానికి చెందని దేదో దానిని తీసివెయ్ అని వ్యంగంగా చెపుతాడు, మనం కూడ దీనిని గణితంలో ప్రతిభాపాటవాలు కానివేవో అనే వైపునుండి చూద్దాం. చాలా మంది ఉన్నత పాఠశాల విద్యార్థులు గ్రాఫులను సరిగా అన్వయించలేరు, సంఖ్యాశాస్త్ర ప్రకల్పనలను అవగాహన చేసుకోలేరు, సన్నివేశాలను గణిత పరిభాషలో ఊహించలేరు, అంచనా వేయ్యడాన్ని మరచి పొయ్యారు, పరిమితిని పోల్చలేరు, తమ ఊహలను నిరూపించలేరు, ఇంకా కలత కలిగించేవిషయమేమిటంటే, పరిమాణాత్మమైన, గుణాత్మక దత్తాంశము పై, ముగింపుల పై ఒక తర్క సంబంధమైన అనుమానాన్ని అభివృద్ది చేసుకోలేక పోవడం. ఇవన్నీ పరిశోధనల వలన తెలిసిన విషయాలు. (బియాండ్ న్యుమరసీ, జాన్ అల్లెన్ పౌలస్) దీనిని ఆధారంగా చేసుకొని గణితంలో ప్రఙ్ఞాపాటవాలంటే ఒక డజను గణిత సమస్యలను సులువుగా పరిష్కరించడమో, సాంకేతిక పరిఙ్ఞానంలో నిపుణతనో, సూత్రాలను గుర్తుపెట్టుకోవడమో, సంఖ్యలపై పట్టు కలిగిఉండడమో, బీజగణీత ,సిధ్ధాంతాలను , ప్రతిపాద సిధ్ధాంతాలను నిరూపించడమో కానేకాదు గణితంలో ప్రతిభాపాటవాలంటే వీటన్నిటికంటే చాలా ఎక్కువ. ఏలాగంటే భాష అంటే వర్ణమాల, వ్యాకరణం, పదజాలం, మంచి దస్తూరీ మొదలైనవి మాత్రమే కాదు అంతకంటే ఎక్కువ. ఇవన్నీ సాహిత్యాన్ని అందించడానికి ఒక చట్రం వంటివాటివి. ఇలానే గణితమంటే కొన్ని అంశాలు మాత్రమే కాదు. మనిషి యొక్క అశక్తత,సంకల్పం, సౌందర్యాసక్తత ఆతను వ్యక్తం చేసే గణితాభిప్రాయాల ద్వారా తెలుస్తుంది. తర్కంతో కూడిన సహజ సామర్థ్యం, విశ్లేషణ,నిర్మాణము మరియు సాధారణీకరణ గణితంలోని మౌళిక అంశాలు. గణితంలోని వివిధ సంప్రదాయాలు వివిధ అంశాలకు ప్రాధాన్యత ఇచ్చినా వీటి మధ్య ఉన్న సంబంధాలు కలసిపోయి జీవితానికి కావలిసిన ఉపయోగాలను అందించడం వలన గణితశాస్త్రానికి చాలా ప్రాధ్యాన్యత లబించింది.(Courant and Robbins-What is mathematics ?) దీని ఆధారంగా గణిత శాస్త్రం అంటే, సహజజ్ఞానం / అంతర్ధృష్టి/లోకజ్ఞానం /తర్కం/సృజనాత్మకత /మౌలికత,నవనీత దృగ్గోచరత/ఊహాత్మకత/సాధారణీకరించే/వివిధ అంశాల మధ్య సంబంధాలను చూడగలగడం /భేదాలు/అనుప్రయోగ సామర్థ్యం/ఆలోచించడం/అంచనా వేయడం/ఉజ్జాయింపు/తప్పులను కనుగొనడానికి విశ్లేషణ/సమస్యను వివిధ దృక్కోణాలనుండి చూడడం/ విభిన్న మైన పరిష్కారాలు /నిరర్థకత/మొదలైనవణి చెప్పవచ్చు.మొదలైనవణి చెప్పవచ్చు. గణిత మేధావులలో ఒకరైన (Karl Friedrich Gauss) కార్ల్ ఫ్రెడ్రిచ్ గాస్ రెండవ తరగతి చదువుతున్నపుడు జరినట్లుగ చెప్పుతున్న ప్రచారంలో ఉన్న ఒక కథ ఈవిధంగా ఉంది. అతను రెండవ తరగతి చదువుతున్నపుడు అతని గణిత ఉపాధ్యాయుడు సందడిగా ఉన్న తరగతి గదిని నిశబ్దంగా ఉంచడానికి అందరినీ ఒకటి నుండి నూరు వరకు అన్నిసంఖ్యలను కూడమని చెప్పి తాను ఒక కునుకు తీద్దామను కొన్నాడు. కానీ కొన్ని నిమిషాలలొనే అతని నిద్రను భంగంచేస్తూ గాస్ సమాధానం 5050 అని చెప్పడు. ఈ సమాదానం ఎలా వచ్చిందన్న దానికి ఆయనకు ఈ క్రింది వివరణ లభించింది మొదట సంఖ్యలను ఈ విధంగా వ్రాసాడు. 1+2+3+…….+98+99+100=N దీని క్రిందే వీటిని వెనుక నుండిముందుకు వ్రాసాడు, 100+99+98+..........+3+2+1= N ప్రతి జత సంఖ్యల మొత్తం 101, 101+101+101+101+101+ =2N కావున 1+2+3.....+100=100 X 101/2= 5050 దీనిని సాధారణీకరించి 1+2+3+ +(N-2)+(N-l)+n (n+l) /2 దీనిని మనం చూడగనే సహజంగా అర్థమయ్యేదిదే, కానీ దృక్కోచరణ కోసం ఈ క్రింది పటము ఉపయోగపడుతుంది. రంగు వేసిన భాగము= 1+2+3+n కానీ మొత్తం చతురస్రం యొక్క వైశాల్యం =n(n+l) కావున రంగు వేసిన భాగము=n(n+1)2 ఒక వ్యక్తిలో గణితశాస్త్ర ప్రజ్ఞాపాటవాలు వికసించడానికి మరియు మన విద్యావ్యవస్థలో వీటిని పెంపొదించడానికి ఉన్న పరిధి రెండూ కూడా గణితశాస్త్రంపై మన కుండే దృక్పథమూ మరియు తరగతిగదిలో గణితాభ్యసనంపై మనకు గల అపోహల వలన ప్రభావితం అవుతున్నాయి. కావున మనము ఆ అపోహలను విమర్శనాత్మకంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. విషయంలో నా అనుభవాలను చెపుతాను దీనిపై మీరు వ్యాఖ్యానించండి. అభ్యాసం అవగాహనను కలుగచేస్తుంది. కొన్నితరాల అనుభావాలు ఇది నిజం కాదని నిరూపిస్తున్నాయి.దీనిని తప్పని చెపుతున్నాయి.సమగ్ర అవగాహన తరువాత అభ్యాసం చేస్తే వేగాన్ని ఖచ్చితత్వాన్ని పొందవచ్చు.కానీ అభ్యాసం అంటే సమగ్రఅవగాహన కానీ అవగాహనకు ప్రత్యామ్న్యాయం కానీ కాదు. అభ్యాసం(యాంత్రికంగా గణిత సమస్యలను కంఠతా పద్ధతిలో పరిష్కరించడం) అనేది అన్వేషించే మెదడుని నిస్తేజం కలిగిస్తుంది అంతేకాదు గణిత ప్రఙ్ఞాపాటవాలకు వ్యతిరేఖమైనది కూడా. అవగాహనకు ప్రాధాన్యతను ఇవ్వడంఅనేది సమయన్ని వృధా చేయడమే, ఉపాయాలు ఉపయోగపడుతాయి మరియు ఖచ్చితత్వాన్ని పెంపొదిస్తాయి. ఇవి రేపు జరుగబోయే ఒక పరీక్షకోసమో, ఒక గంటలో ఇంటిపనిని ముగించడానికో అయితే బాగానే ఉంటుంది. కానీ అభ్యసనం జీవితాంతం ఉపయోగపడాలంటే ఈ మార్గం మన లక్ష్యాన్ని దూరం చేస్తుంది. సమాధానమే అంతిమ మైనది మరియు ముఖ్యమైనది: గణితశాస్త్రవేత్త పరిభాషలో దీనిని “ సరైన సమాధానం కోసం కష్టపడటం అనవచ్చు” మన ఆలోచనను సరైన సమాధానానికే పరిమితం చేసుకొన్నట్లైతే, విద్యార్థులు ఆలోచనలోని కొన్ని ముఖ్య ప్రక్రియలను కోల్పోతారు. తప్పు సమాధానాలన్నీ సమానమైనవే: తప్పు సమాధానాలన్నింటికీ వివిధ కారణాలుంటాయి. ప్రతి తప్పు సమాధానం యొక్క పరిధి వేరు వేరుగా ఉంటుంది. తప్పు సమాధానాలని ఇచ్చిన ఆలోచనా ప్రక్రియలు కొన్ని ముఖ్యవిషయాలను సూచిస్తాయి. విద్యార్థులు గణన చేస్తే చేస్తారు, లేకపోతే లేదు: ప్రతి ఒక్కరూ భాష మాట్లడానికి ఎలా సహజ సామర్థ్యాన్ని కలిగి ఉంటారో అలాగే గణితాన్ని చేయడానికి కూడా సహజ సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. ఒక వ్యక్తి యొక్క కవిత్యంలోని లేదా సాహిత్యంలోని పాటవాలు అతని అభిరుచి మేరకే ఉంటాయి. గణిత అభ్యసనం ఒక క్రమానుగతమైనది సంఖ్యాభావనలు, అంకగణితం, బీజగణితం మరియు పరస్పర సంబంధాలను, క్రమాలను చూడడంలో విద్యార్థుల సామర్థ్యాలను దృష్ఠిలో ఉంచుకొని సాధారణంగా గణితాన్ని సంఖ్యాభావనలు, అంకగణితం, బీజగణితం, కలనగణితం అనే క్రమంలోనే బోధిస్తారు. కానీ పిల్లలలో తొలి సంవత్సరాలలోనే వారు ఊహాత్మకత దృగ్గోచరతను ఉపయోగించగలరు. గణితాభ్యసనం సమాంతరమైనది. గణితాభ్యసనానికి ప్రామాణీకరించబడినఒకే ఒక పధ్ధతి ఉంటుంది.( ఉదాహరణకు: బహుళంగా అమలులోఉన్న 2+2=4): ఖచ్చితమైనపధ్ధతులలలోని మౌళిక సిధ్ధాంతాలైన స్థిరత్వం,నిర్ణీతకాలకత, భావిసూచనం వంటి వాటిని తప్పుగా అవగాహన చేసుకోరాదు. ప్రతి వ్యక్తీ తనదైన పధ్ధతిలో తనదైన వేగంతోనే అభ్యసిస్తాడు. గణితాన్ని మరచి పోకుండా ఉండడానికి నిరంతరం అభ్యాసం చేస్తూనే ఉండాలి. సాధారణంగా గణితంలో మరిచిపోగలిగేది కొన్ని సూత్రాలు, సంకేతాలు లేదా కొంత సమాచరం మాత్రమే. కానీ ఇదేమంత పెధ్దనష్టం కాదు ఎందుకంటే ఈ సమాచారమంతా కొన్ని పుస్తకాలలో ఎప్పుడైనా లభ్యమౌతుంది. సమస్యా పరిష్కార (సామర్థ్యాన్ని) పధ్దతి ఒక సారి అభ్యసిస్తే మరచి పోయేదంటూ ఏదీ ఉండదు. ఒక సారి సైకిల్ నేర్చుకొన్నాక నీవెప్పుడైనా సైకిల్ నడపడం మరచి పోయింది ఏమైనా ఉందా? పరీక్షలలో మార్కులే గణితశాస్త్ర ప్రజ్ఞాపాటవాలకు సూచిక: పై ప్రకల్పన ఒక తర్కం ఆధారంగా ఏర్పడినది . గణితం బాగా చేస్తే ఏదైనా బాగా రాణిస్తారని అనేది ఒక అపోహ. దీనికి తోడు ఎక్కువ మంది విద్యార్థులు గణితాన్ని అభ్యసనం చేసే సందర్భంలో ఉండే మరికొన్ని సమస్యలు గణితశాస్త్ర ప్రజ్ఞాపాటవాల సమస్యను మరింత ద్విగుణీకరిస్తున్నాయి, అవి ప్రామాణీకరించబడిన నియమాలు, విద్యార్థి బృందము పై ఉండే అంచనాలు,బృందంలోని విద్యార్థులంతా ఒకే వేగంతో ఒకే పద్ధతిలో అభ్యసించగలరు అనే భావన. గణితమంటే లోకఙ్ఞానంతో సంబధం లేనిదనే భావన,పరీక్షకలను దృష్టిలోఉంచు కొని రూపొందించిన అభ్యసనా మరియు మూల్యాంకనా లక్ష్యాలు మరియు దానికణుగునంగా విద్యార్థుల ప్రదర్శనా అన్వయాలు. గణితశాస్త్ర ప్రజ్ఞాపాటవాలంటే కొంత నింద, దీని పరిధిలోనే దురభిప్రాయాలు ఇబ్బందులు ఉన్నా దీనిని దీటుగా ఎదుర్కొనేందుకు సరైన పద్ధతులను ఉదాహరణలను ఉపయోగించి విద్యార్థులలో నైపుణ్యాలను మెరుగుపరచవచ్చు. ఈ క్రిందపేర్కొన్న నైపుణ్యాలు గగణితాభ్యసనానికి కొన్ని ముఖ్యమైనవి. విన్యాస ఙ్ఞానం, మనోగణితం రేఖా చిత్రాలను, పటాలను కొలతలనూ చదవడం అంచనా వేయ్యడం ఉజ్జాయింపు, దృగ్గోచరత, వేగం సమస్యా పరిష్కారం, తప్పులను విశ్లేశించుకోవడం అన్నవి గణిత అభ్యసనానికి అందరూ గుర్తించబడిన నైపుణ్యాలు. ఇక్కడ చెప్పిన ప్రతి నైపుణ్యం గణితశాస్త్ర ప్రజ్ఞాపాటవాలలోని ఒక ముఖ్యాంశమే. సాధారణీకరణకు సమస్యను నిర్వచించడానికి, విన్యాసఙ్ఞానం ముఖ్యమైనది. దృగ్గోచరత అనే అంశం జ్యామితి, త్రికోణమితి మరియు కొలతలు వైశాల్యాలు వాటిలోని ముఖ్య అంశము. కోపర్నికస్ చెప్పిన ఈ క్రింది వాక్యాలు గణితబోధనా ప్రాముఖ్యతను తెలియచేస్తుంది. “Give a hungry man a fish and you've fed him for the day. Teach the hungry man how to fish and you've fed him for a life-time.” గణితప్రజ్ఞాపాటవమంటే “ఎలాంటి నీటిలో నైన ఎలా చేపలు పట్టాలి కానీ పద్ధతి మాత్రం ఏదైనా ఉండవచ్చు” లాంటి జ్ఞానాన్ని పొందడం. ఆంగ్లాన్ని అభ్యసించడంలో ఉండే ఆనందం - శారద రాజారామన్ రిసోర్స్ వివరాలు : ప్రాథమిక సమాచారం అత్యధికసంఖ్యలో పిల్లలు పాల్గొన్న ఒక వేసవి శిబిరంలో వారి కోసం నిర్వహించిన కొన్ని కృత్యాలను ఇక్కడ ఇస్తున్నాము. విద్యార్థులు ఈ కృత్యాధార అభ్యసనాన్ని బాగా ఆనందించడమే కాకుండా తాము ఆంగ్లంలో మాట్లాడగలిగే, వ్రాయగలిగిగే, చదువగలిగే సామార్థ్యాన్ని కలిగి ఉన్నామని తెలుసుకొని చాలా సంతోషించారు. ఈ కృత్యాలను ఉపాధ్యాయులు తమ తరగతిగదులలో కూడా ఉపయోగించవచ్చు. నిడివి : 22 గంటలు పరిచయం: Auro సొసైటీ వారు నెలరోజుల పాటు నిర్వహించే వేసవిశిబిరంలో మేము( అజీమ్ ప్రేమ్జి ఫౌండేషన్ సభ్యులు) నాలుగు రోజులపాటు పాల్గొన్నాము . మేమంతా అక్కడ సొసైటీ వారు కార్యక్రమాన్ని ఎలా నిర్వహిస్తారు, ఎంత మంది విద్యార్థులు పాల్గొంటారు, ఎలాంటి వసతి సౌకర్యాలను సమకూరుస్తారు, ఎలాంటి వనరులు అవసరమౌతాయి, మొదలైన అంశాలను తెలుసుకోవడానికి వెల్లాము. విద్యార్థుల సంఖ్యను దృష్టిలో ఉంచుకొని మేము ఒక్కొక్క బృందంలో 40 మంది ఉండేలా 4 బృందాలుగా విభజించాము.ఈ కృత్యాల ఆధారంగా ఉపాధ్యాయులు తమ విద్యార్థుల కోసం మరిన్ని కృత్యాలను తయారుచేసుకోవచ్చు. లక్ష్యం: విద్యార్థులను ఆంగ్లభాషా నైపుణ్యాన్ని అభ్యసించేందుకు విద్యార్థులందరూ పాల్గొనేలా చేయడమే ఈ కృత్యం యొక్క ప్రధానలక్ష్యం. బృందకృత్యాలు ఆటలు అన్నీ కూడా ఆంగ్లభాషను ఉపయోగించేదుకు అవసరమైన సన్నివేశాలను కల్గిస్తాయి. అలాగే ఈ కృత్యాలన్నీ విద్యార్థులకు ఆత్మవిశ్వశాన్ని పెంపొదిస్తాయి మరియు బృందపనిని ప్రోత్సహిస్తాయి. సోపానాలు: మొదటి రోజు 4 నుండి 6 తరగతుల వారికి కృత్యం : కార్యక్రమం విద్యార్థులను వృత్తాకారంలో నిలబడమని చెప్పి song “Hello everybody how are you?”అభినయగేయాన్ని ఆలపించారు మేముకూడా రెండు సార్లు ఆ గేయాన్ని ఆలపించాము. చిత్రవర్ణన అభివృద్ధి చేసే నైపుణ్యాలు: వర్ణనాత్మకపదాల ఉపయోగం, వివిధ రకాల వాక్యాలను ఉపయోగించడం, భాషలో ధారాలత, అనుక్రమణం చేయడం. పద్ధతి విద్యార్థులను ఒక్కొక్క బృందంలో 5 మంది ఉండేలా బృందాలుగా చేశారు సూచనలను ఆంగ్లం మరియు తమిళంలో ఇచ్చారు చార్టులను, కాగితాలను మరియు రంగు పెన్సిల్ ను పంపిణీ చేశారు ప్రతి బృందానికి ఒక పదాన్నిగల కార్డుని ఇచ్చారు. (పదాలను విద్యార్థుల సామర్థ్యాలు వారికి గల అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఇచ్చారు) ఉదాహరణకు సముద్రతీరం,కుటుంబం, సెలవు దినం, దీపావళి పండుగ మొదలైనవి) మరొక కాగితంలో క్రియాపదాలను, నామవాచకపదాలను ఇచ్చారు ఈ పదంకార్డుని క్రియాపదాలను, నామవాచక కార్డుని ఉపయోగించి వారికిచ్చిన చార్టులో 5 వాక్యాలు వ్రాయాలి పద్ధతి ఈ కార్యక్రమ నిర్వహణా సమయంలో విద్యార్థులకు ఎటువంటి సహాయం ఇవ్వలేదు, పదదోషాలను చూడలేదు, విద్యార్థులను వాక్యాలు వ్రాయమని అన్ని బృందాలను ప్రోత్సహిస్తూ తిరిగాము. విద్యార్థులలో విసుగుదలను పోగొట్టడానికి రెండు అభినయ గేయాలను ("An Elephant walks like this and that”, and “Finger to finger, elbow to elbow") బోధించారు. విద్యార్థులు చాలా ఉత్సాహంతో ఈ కృత్యంలో పాల్గొన్నారు. మొదట్లో ఆంగ్లంలో వ్రాయడానికి విద్యార్థులు కొంత సందేహించినప్పటికీ, కృత్యాన్ని అవగాహన చేసుకొన్నాక కృత్యంలో చురుకుగా పాల్గొన్నారు. తరువాత వారు ఆత్మవిశ్వాశంతో తమ భావాలను వ్యఖ్తీకరించగలిగారు. ఫలితాలు మేము వ్రాయమన్న వాక్యాల సంఖ్యకంటే ఎక్కువ సంఖ్యలో వాక్యాలు వ్రాయగలిగారు. కొత్త పదాలను తెలుసుకోవడమే కాక వాక్యాల నిర్మాణంకూడా చేయగలిగారు. వారికి కలిగే ఆలోచనలను ఆంగ్లంలో వ్యక్తీకరించాలనే భావనను కలిగి ఉంటారు. ఇలాంటి సమయంలో వారికి తనిన సూచనలతోనూ ప్రత్యుత్తర సూచక ప్రశ్నలతో ప్రశలతోనూ సహాయం చేస్తాం విద్యార్థులకు ఎంతో చాలెంజింగుగా అనిపిస్తుంది వారు ఆంగ్లంలో వ్రాయడానికి తగిన ఆత్మవిశ్వాశం ఏర్పడిందని చెపుతారు. రెండవ రోజు 4 నుండి 6 తరగతుల వారికి కృత్యం : విద్యార్థులు వృత్తాన్ని ఏర్పరచగానే వారికి “Tooty Tata” అబినయ గేయాన్ని చెప్పాలి. ఈ గేయం “Thumbs up, elbows back, feet apart, knees together, eyes shut, tongue out”. అని సాగుతుంది. పిల్లలు గేయాన్ని మరియు అభినయాన్ని ఎంతో ఆనందిస్తారు. చిత్రవర్ణన అభివృద్ధి చెందే నైపుణ్యాలు : వర్ణించడం, వర్ణించడానికి అవసరమయ్యే పదాల అవగాహన, కొత్తపదాలను అభ్యసించడం, అనుక్రమంలో వ్రాయడం పద్ధతి : విద్యార్థులను ఒక్కొక్క బృందంలో 5 మంది ఉండేలా బృందాలుగా చేశారు చార్టులను, కాగితాలను మరియు రంగు పెన్సిల్ ను పంపిణీ చేశారు కొన్నిపనులను వర్ణిస్తున్న చిత్రాలను పంపిణీచేశారు. ఈ వారికి సుపరిచితమైన కథలకు సంబంధించిన చిత్రాలను అందించడం ( ఉదాహరణకు, కోతీ టోపీలమ్మేవాడు, కుందేలు మరియు తాబేలు, కాకి మరియు నక్క మొదలైనవి ) ఈ చిత్రాలను ఒక క్రమంలో ఉంచి 5 లేదా ఆరు వాక్యాలు వ్రాసి దానికి పేరు పెట్టాలి ఫలితం కథా ఇతివృత్తాన్ని అవగాహన చేసుకొని ఒక ఉపశీర్షికను సూచించవచ్చు కథ అనుక్రమాన్ని ఏర్పరచి కథను వ్రాయవచ్చు. వారు కొత్తపదాలను,వాక్యాలను, అభ్యసించారు మెరుగైన చేతివ్రాతను నేర్చుకొన్నారు. వారు బృందాలలో పనిచేయగలుగుతారు, సమయపాలనను పాటిస్తారు మూడవరోజు 9 నుండి 11 తరగతుల వారికోసం కృత్యం : విద్యార్థులను వృత్తాకారంలో నిలబెడుతారు. వీరు ప్రశ్నలతో కూడిన ఒక పెట్టెను ఒకరి నుండి మరొకరికి అందించాలి, ఇలా చేస్స్తున్నప్పుడు సంగీతాన్ని వినిపించడం జరుగుతుంది. ఆ సంగీతం ఆగిపోయినప్పుడు ఎవరి దగ్గర ఆ పెట్టె ఉంటే వారు దానినుండి ఒక ప్రశ్నను ఎంచుకొని సమాధానం చెప్పాలి. ఉదాహరణకు నీ హాబీలు ఏమిటి మీ ఆమ్మకు ఎలాంటి బహుమతిని ఇస్తావు ? నీకు ఇప్పటికిప్పుడు రెక్కలు వస్తే ఏమిచేస్తావు ? మొదలైనవి. చిత్ర వర్ణన విద్యార్థులను ఒక్కొక్క బృందంలో 5 మంది ఉండేలా బృందాలుగా చేశారు. చార్టులను, కాగితాలను మరియు రంగు పెన్సిల్ ను పంపిణీ చేశారు. ప్రతి బృందానికి ఈ క్రింద ఇచ్చిన అంశాలలో ఏదో ఒకదానిని ఎన్నుకోమని చెప్పారు ( ఈ అంశాలను చిన్న కాగితాలపై వ్రాసి ఉంచి, ప్రతి బృందం నుండి ఒక విద్యార్థిని ఏదో ఒక చీటీని ఎన్నోకోమని చెప్పాలి). టీ తయారుచేసే విధానాన్ని క్రమంలో వివరించండి ఖాళీ సమయాన్ని నీవెలా గడుపుతావు? మీ స్నేహితులతో ఎలా గడుపుతావు? ప్లాస్టిక్ సంచులు ఉపయోగించకుండా నీవెలాంటి జాగ్రత్తలు తీసుకొంటావు ? అవకాశం ఇస్తే ఎలాంటి సాంఘిక సేవను చేస్తావు ? నీకు ఏ పెంపుడు జంతువులంటే ఇష్టం / ఎందుకు ? ఫలితాలు అభివ్యక్తీకరణను నేర్చుకొంటారు, ఆంగ్లంలో వారికి గల సామర్థ్యాన్ని తెలుసుకొని ఆశ్చర్యపోతారు ఈ శిబిరం సంభాషించడం మరియు వ్రాయడం నైపుణ్యాలను మెరుగుపరుచూకోనేందుకు తగిన సన్నివేశాలను కల్పిస్తుంది ఇలాంటి అభ్యాసాలు పిల్లలలో సృజనాత్మకతను పెంపోదించడానికి, ఆలోచించడానికి ఉపకరిస్తాయి. ఇతర కృత్యాలు కథల సమయం పిల్లలను వృత్తాకారంలో కూర్చోపెట్టారు. మేము వారికి ఆంగ్లంలో ఒక కథను చెప్పాము, వారిని ఆ కథను తమిళంలోకి అనువదించమని చెప్పాము. ఇదే పద్ధతిలో మేము వారికి ఒక కథను తమిళంలో చెప్పాము వారు దానిని ఆంగ్లంలోకి అనువదించాలి. మొత్తం కృత్యాన్ని పిల్లలు చాలా ఆనందించారు. ఉపాధ్యాయుని అభినయం ఆధారంగా వారు సులువుగా వాక్యాలను ఏర్పరచగలిగారు. సంభాషణలో ప్రాథమిక నైపుణ్యాలు మరియు సంబంధాలు : కుటుంబం అనే చార్టుని మేము ప్రదర్శించాము. దీనిలో ఉమ్మడికుటుంబం, చిన్నకుటుంబం, తల్లి లేదా తండ్రి ఎవరో ఒకరు మాత్రమే ఉండే కుటుంబ చిత్రాలను ప్రదర్శించాము. ఈ చిత్రాల ద్వారా వారు కుటుంబ సభ్యులమధ్య సంబంధాలను కనుక్కోగలిగారు. దీనివలన వారు స్వంతంగా వారి గురించి (వారి పేరు , వారి స్వస్థలం, తరగతి మొదలైనవి ) వారి కుటుంబం గురించి కొన్ని వాక్యాలు చెప్పగలిగారు. పొడుపుకథలు మరియు ప్రహేళికలు ఇక్కడ ఒక పొడుపుకథను ఒక ప్రహెలికను ఇచ్చాము, దీని ముఖ్య ఉధ్ధేశ్యం ఆంగ్లభాషపై ఆసక్తిని పెంచడం మరియు ఆంగ్లబాషాభ్యసనం ఆనందకరమని తెలియచేయడం.అంతేకాక ఈ పొడుపుకథలు మరియు ప్రహెలికాలు విసుగుదలను పోగొట్టి పిల్లలలో ప్రశ్నించేతత్వాన్ని ప్రోత్సహిస్తాయి. Substitute with highlighted word/s: A place where you can read books ..... begins with L His father and mother came to pick him up....begins with P Riddles about some fruits & vegetables : I am brown, I grow under the ground, I stay fresh for a long time, You love me as chips....begins with P Fill in the blanks with words that show actions: The old man walked ____________ The nurse spoke ______________ The children played __________ ఫలితం : ఈ కృత్యాన్ని పిల్లలు బాగా ఆనందించడమే కాకుండా ప్రశ్నించే నైపుణ్యాన్ని అభివృద్ధిచేసుకొంటారు. మనమొకసారి ఇలాంటి కృత్యాన్ని నిర్వహిస్తే పిల్లలంతా నిర్భయంగా మొహమాటం లేకుండా మనదగ్గరకు చేరుతారు. ఉపాధ్యాయుడు విద్యార్థి అనే భేధభావం పోయిఅందరూ ఆనందిస్తూ ఒకే దగ్గర కూర్చోన్నాము ఙ్ఞానేంద్రియాలు - శైలేంద్ర గుప్త విఙ్ఞానశాస్త్రాన్ని పిల్లలకు పరిచయం చేసినపుడు వారికి మొదట బోధించేది ఙ్ఞానేంద్రియాల గురించే. ప్రస్తుత అభ్యాసపత్రం వీటి మద్య గల సంబంధన్ని పునర్బలం చేకూర్చడానికి ఉపయోగపడుతుంది. ఙ్ఞానేంద్రియాల పాఠ్యాంశాన్ని ప్రాథమికంగా విఙ్ఞాన శాస్త్రానికి చెందినదిగా భావించినా ఈ అంశాన్ని అన్ని ఇతర విశయాలలోకూడా బోధిస్తారు. ఈ అభ్యసపత్రం లోని కృత్యాలు పిల్లల స్పర్శ, శ్రవణ మరియూ ఘ్రాణ నైపుణ్యాలను మెరుగుపరుస్తాయి. అభ్యాసపత్రం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి. ఆంగ్ల(బాషా)బోధనలో రేఖాచిత్రాల ఉపయోగం - ధన్య భాస్కరన్ రేఖాచిత్రాలను ఉపయోగిస్తూ అభ్యసనానికి అవసరమైన సన్నివేశాన్ని కల్పించేవిధానాలను రచయిత వివరిస్తున్నారు. “గుణాత్మక అభ్యసనం కోసం బహుళేంద్రియ పధ్ధతి” “విద్యార్థులను సృజనాత్మకంగా తయారుచేయడానికి “ ఉపాధ్యాయుడు సృజనాత్మకంగా ఉండాలి” “అనువైన నేపాధ్యాన్ని జోడించడం ద్వారా అభ్యసనం” మొదలైన నినాదాలు మన విద్యావ్యవస్థలో ప్రతిధ్వనిస్తుంటాయి. వీటన్నిటి లక్ష్యం ఏమిటి ? మన తరగతిగది అభ్యసనా ప్రక్రియలను ఫలవంతం చేయడానికే అయితే,వీటి లక్ష్యం నెరవేరినట్లే?. స్నేహపూరిత వాతావరణంలో, ప్రతి విద్యార్థి అవసరాలను దృష్టిలో ఉంచుకొని, అర్థవంతమైన నేపధ్యంలో బహుళేంద్రియ పధ్డతిలో అభ్యసనం జరగాలి. ఈ సందర్భంలో రేఖాచిత్రాలను ఉపయోగించి ప్రాథమికస్థాయిలో ఆంగ్లబాషాబోధన లేదా బాషాబోధన జరిపే విధానాన్ని చర్చించడం సముచితమైనది. వేటిని రేఖాచిత్రాలంటారు ? ఈ క్రింది వాటిని రేఖాచిత్రాలంటారు. మానమందరం వీటిని ఎప్పుడోఒకప్పుడు వీటిని ఉపయోగించి ఉంటాము. రేఖాచిత్రాలను ఆంగ్ల(భాషా)బోధనలో మనం ఎలా ఉపయోగించుకోవచ్చు ? మనం భావనల గురించి విద్యార్థులతో మాట్లాడుతూ వాటికి తగిన రేఖాచిత్రాలను జోడించగలిగితే అది అధ్భుతాలను సృష్టిస్తుంది. ఉదాహరణకు కుటుంబ భావనను బోధించినపుడు పై రేఖాచిత్రాలను అమోఘంగా ఉపయోగించుకోవచ్చు. ఈ రేఖాచిత్రాలను పిల్లలు సులభంగా గీయగలరు. ఈ రేఖాచిత్రాలు పిల్లలకు ప్రత్యాక్షానుభవాలను కలిగిస్తాయి. ఈ చిత్రాలను సృజనాత్మకత కలిగిన ఉపాధ్యాయుడు పిల్లలలో పదజాలాభివృధ్ధికే కాక వ్యాకరణానికి సంబంధించిన నామవాచకం, విశేషణం, క్రియలు మొదలైన బాషావిభాగాలుగా విభజించడానికి కూడా వీటిని ఉపయోగించు కోవచ్చు. ఈ రేఖాచిత్రాలు మనుష్యులకు సంబంధించినవే కాకుండా పరిసరాలకు సంబంధించి కూడా ఉండవచ్చు. విద్యార్థులకు కథలను చెపుతూ ఇతివృత్తాన్ని కలపడానికి ఈచిత్రాలను ఉపయోగించవచ్చు. రేఖాచిత్రాలు కథాశ్రవణానికి దృశ్యమాధ్యమాన్ని కల్పిస్తాయి. ఈ చిత్రాలనే ఉపయోగించుకొని కొన్ని ప్రశ్నలను రూపొందించి వారి కథావగాహనను తెలుసుకోవచ్చు. శ్రవణం మరియు విషయఅవగాహన మరింత అర్థవంతంగా ఉండడానికి రేఖాచిత్రాలు ఉపయోగపడుతాయి. రెండవ భాషగా ఆంగ్లాన్ని బోధించే సమయంలో లేదా బాషాబోధనలో భాషణానైపుణ్యాలను పెంపోదించేందులకు వీటిని ఉపయోగించవచ్చు. ఉపాధ్యాయుడు ఒకే రేఖాచిత్రాన్ని లేదా వరుసరేఖాచిత్రాలను ఉపయోగించి కొన్ని ప్రశ్నలను రూపొందించుకోవచ్చు లేదా ఒక కథను అల్లవచ్చు. ఈ రేఖాచిత్రాలు విద్యార్థులకు దృశ్యమాధ్యమంగా సహాయపడుతాయి. రేఖాచిత్రాలే ఎందుకు ? రేఖాచిత్రాలను వెంటనే మరియు సులువుగా గీయవచ్చు రేఖాచిత్రాలు అభ్యాసకులలో ఆసక్తిని రేకెత్తిస్తాయి, వారి ఊహాశక్తిని ఉత్తేజపరుస్తాయి ఆభ్యాసనాప్రక్రియలో చురుకుగా పాల్గొనేలా చేస్తాయి. రేఖాచిత్రాలు విద్యార్థులకు బహుళైంద్రియ అనుభవాన్ని అందిస్తాయి. కష్టమైనభావనలుకు ఒక ఆకారాన్ని ఇచ్చి ఆ సందర్భాన్ని ఆసక్తికరం చేస్తాయి అభ్యసించిన కొత్తపదాలకు ఒక మూర్తభావనను అందించి భావనను మరింతగా అవగాహనచేసుకొనేందుకు దోహదపడతాయి. రేఖాచిత్రాలను తరగతిగదిలో ఉపయోగించడానికి పాటించాల్సిన నియమాలు ఖచ్చితత్వాన్ని ఆచరించడం : ఒక వస్తువు గురించి వివిధ సందర్భాలలో మాట్లాడినపుడు ఒకే రకమైన రీఖాచిత్రాన్ని గీయండి. అలాకాక ఒకే వస్తువుని వివరించడానికి వేరు వేరు రకాలైన రేఖాచిత్రాలను ఉపయోగించడం వలన విద్యార్థులు గందరగోళానికి గురౌతారు. రేఖాచిత్రాల నేపాధ్యాన్ని స్పష్టంగా ఉంచాలి : రేఖాచిత్రాలను వీలైనంత సరళంగా ఉంచండి. అనవసర విషయాలను రేఖాచిత్రాల నేపధ్యంగా గీయరాదు. రేఖాచిత్రాల మధ్య సంధాయకత: వరుస రేఖాచిత్రాల మధ్య సంధాయకతను పాటించండి. మనం పై నుండి క్రిందికి, ఎడమ నుండి కుడికి చదువుతాము కావున రేఖాచిత్రాలలో కూడా ఇలాంటి పధ్ధతినే పాటించి పిల్లలు గందరగోల పదకుండా చూద్దాం. రేఖాచిత్రాలను ఎవరు ఉపయోగించవచ్చు ? ఏ తరగతులకు బోధించే ఉపాధ్యాయుడైనా రేఖాచిత్రాలను ఉపయోగించవచ్చు. విద్యార్థులు ఒక కథను అవగాహన చేసుకోవడానికి అనువుగా ఉపాధ్యాయుడు వీటిని ఉపయోగించవచ్చు, లేదా రేఖాచిత్రాల ఆధారంగా విద్యార్థులు ఒక కథను వ్రాయాలి లేదా చెప్పాలి. కావున రేఖాచిత్రాలను విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు తరగతిగది కార్యక్రమాలకు పలువిధాలుగా ఉపయోగించుకోవచ్చు. తరగతిగదిలో ఆడదగిన ఆటలు - శ్రిపర్ణ తమ్హానే రిసోర్స్ వివరాలు : ప్రాథమిక సమాచారం విద్యార్థులకు భాషను, అక్షరజ్ఞానాన్ని, సంఖ్యాజ్ఞానాన్ని సులువుగా నేర్పడానికి ఆటలు చాలా ముఖ్యమైనవి. ఆటలు పిల్లలలోఅనుసంధాననైపుణ్యాలను, విమర్శనాత్మక ఆలోచనను, సమస్యపరిష్కార పధ్ధతిని పెంపొదిస్తాయి. పిల్లలకు గెలుపు, ఓటములు, తమ వంతు వరకు వేచిచూడడం, వరుసలో నిలబడడం, బృందపని భావన మొదలైనవాటిని ఆటలు పరిచయం చేస్తాయి. ఇక్కడ అలాంటి కొన్ని ఆటలను పరిచయం చేస్తున్నాం సమయం : (పూర్తి రోజు) పరిచయం: విద్యార్థులకు భాషను, అక్షరజ్ఞానాన్ని, సంఖ్యాజ్ఞానాన్ని సులువుగా నేర్పడానికి ఆటలు చాలా ముఖ్యమైనవి. ఆటలు పిల్లలలోఅనుసంధాననైపుణ్యాలను, విమర్శనాత్మక ఆలోచనను, సమస్యపరిష్కార పధ్ధతిని పెంపొదిస్తాయి. పిల్లలకు గెలుపు, ఓటములు, తమ వంతు వరకు వేచిచూడడం, వరుసలో నిలబడడం, బృందపని భావన మొదలైనవాటిని ఆటలు పరిచయం చేస్తాయి. ఇక్కడ అలాంటి కొన్ని ఆటలను పరిచయం చేస్తున్నాం సోపానాలు: సంజ్ఞల ద్వారా ప్రశ్నించడం తరగతిని రెండుగా విభజించండి. ఒక బృందం ఒక పుస్తకాన్ని గుర్తిస్తుంది, రెండవ బృందం మొదటి బృందం ఎన్నుకొన్న పుస్తకాన్ని ఊహించాలి తరువాత రెండవ బృందం ఒక పుస్తకాన్ని గుర్తిస్తుంది, మొదటి బృందం వారు ఈ పుస్తకాన్ని గుర్తించాలి. ఈ ఆటను విద్యార్థులు పుస్తకాల పేర్లను పరిచయం చేసేందుకు, గుర్తుంచుకొనేందులకు కూడా నిర్వహించవచ్చు. ఇది పిల్లలలో పఠనాసక్తిని పెంచుతుంది. లడ్డూల ఆట విద్యార్థులను వృత్తాకారంలో నిలబడిమని చెప్పండి. ఒక అంకెను ఎంచుకోండి ఉదాహరణకు “5” అనుకొండి ప్రతి విద్యార్థి అంకెలను వరుసగా చెపుతాడు. ఐదవ 5 అంకె చెప్పాల్సిన విద్యార్థి, అంకెను చెప్పకుండా “లడ్డు” అని చెపుతాడు. లడ్డు అనేపదాన్ని 5 గుణిజాలకు కూడా చెప్పాలి. ఎవరైతే ఇలా చెప్పకుండా 5 ను గానీ 5 యొక్క గునిజాన్ని కానీ చెపుతారో వారు ఆట నుండి నిష్క్రమించాలి. వివిధ సంఖ్యలతో ఈఆటను ఆడవచ్చు ఈ కృత్యం విద్యార్థులకు గునిజాలను పరిచయం చెయ్యడమే కాక వారి జాగురూతతను పరీక్షిస్తుంది. సైమన్ చెప్పాడు సైమన్ గా ఒక విద్యార్థిని ఎన్నుకోవాలి. అతనికి ఎదురుగా మిగిలిన అందరు విద్యార్థులు నిలబడాలి సైమన్ చెప్పినట్లుగా అందరూ చేయాలి ఉదాహరణకు సైమన్ చెపుతున్నాడు అందరూ చప్పట్లుకొట్టండి లేదా సైమన్ చెపుతున్నాడు అందరూ కాళ్ళను నేలకు కొట్టమన్నాడు అందరూ ఈ సూచనలను పాటించాలి ఇప్పుడు “సైమన్ చెపుతున్నాడు” అనే పదాన్ని ఉపయోగించకుండా సూచనలను ఇస్తే ఎవరూ పాటించాల్సిన అవసరంలేదు. ఈ కృత్యం అవధానాన్ని పరీక్షిస్తుంది. ఈ ఆటను చాలా వేగంగావిద్యార్థులు “సైమన్ చెపుతున్నాడు” గమనించకుండా సూచనలు పాటించేలా ఆడాలి. దీనిని మీ అవసరాలకు అనుగుణంగా పేరుని మార్చుకోవచ్చు. ఉదాహరణకు రాజు చెపుతున్నాడు బింగో తొమ్మిదిగడుల చదరాన్ని గీసి వాటిని అక్షారాలతో లేదా సంఖ్యాల్తో నింపమని చెప్పండి. కొన్ని సంఖ్యలను లేదా అక్షరాలను మీరు బయటకు చెప్పండి. మీరు బయటకు చెప్పిన సంఖ్యలు లేదా అక్షరాలు ఉంటే వాటిని సున్నాతో గుర్తించమని చెప్పండి. ఆన్ని గడులను సున్నాతో చుట్టిన విద్యార్థి “బింగో” అని గట్టిగా అరుస్తాడు. పదాలతో బింగో : ఏ సబ్జెక్ట్ పదాలతోనైనా ఈఆట ఆడవచ్చు. ఉదాహరణకు దేశాల పేర్లను, రంగులను, లేదా వివిధఆకారాలను ఉపయోగించవచ్చు. ఈ ఆటకోసం నిర్ధిస్తమైన నియమాలు అవసరం. సంఖ్యాలతో బింగో : ఈ ఆటను గణితంకోసం ఆడవచ్చు. ఈ ఆటకోసం 1 నుండి 20 మధ్యలోని 9 సంఖ్యలను ఎన్నుకోండి. దీన్ని గణితంలోని చతుర్విదప్రక్రియలకోసం ఉపయోగించవచ్చు. గణితనైపుణ్యాలను పెంపొదిస్తుంది కొత్త సంఖ్యలను పదాలను విద్యార్థులకు పరిచయం చేస్తుంది. హంగ్మన్ - HANGMAN ఒక విద్యార్థి ఒక పుస్తకాన్ని ఎన్నుకోవాలి ఈ పుస్తకం పేరుని నల్లబల్లపై ఎన్ని అక్షరాలు ఉంటే అన్ని ఖాళీలతో సూచించాలి మిగిలిన విద్యార్థులు ఆ పుస్తకం పేరుని ఒక్కొక్క అక్షరప్రకారం గుర్తించడానికి ప్రయత్నిస్తారు. సరైన అక్షరాన్ని గుర్తించిన ప్రతిసారి దానిని నల్లబల్లపై వ్రాయాలి ఈ ఆట విద్యార్థులకు పుస్తకాలను పరిచయం చేస్తుంది, చదివే అభిరుచిని, ఊహాశక్తిని ప్రోత్సహిస్తుంది. ఇది విద్యార్థులలో spelling సామర్థ్యాన్ని పరీక్షిస్తుంది. Word Worms కొన్ని పదాల జాబితాను వాటి మధ్య ఖాళీ లేకుండా ఒక పురుగు ఆకారంలో వ్రాయండి అది ఈవిధంగా ఉండవచ్చు ఉదాహరణకు కళ్ళుముక్కునోరునాలుకచెవులు విద్యార్థులకు కొంత సమయాన్ని కేటాయించి అంతలోపే ఆ పదాలను కనుక్కోమని చెప్పండి. ఈ కృత్యాన్ని వ్యక్తిగంతంగా కానీ లేదా జతలులో కానీ చేయవచ్చు. విద్యార్తులందరూ దీనిని కనుకొన్నాక ఈ పదాలను వారితో పలికించి ఉచ్చారణా దోషాలు ఉంటే సరిచేయవచ్చు. పదజాల పునర్విమర్శకు ఇదో ఉత్తమ మార్గం దోషాన్ని కనుక్కోవడం విద్యార్థులకు ఒక కథను చెప్పండి లేదా ఒక వ్యాసాన్ని చదివి వినిపించండి లేదా ఒక విషయాన్ని చర్చించండి. ముందే విద్యార్థులకు ఈ కృత్యంలో తాను చేసే తప్పుని కనుక్కోమని చెప్పండి. ఈ తప్పులు వ్యాకరణానికి లేదా చరిత్రకు లేదా భౌగోళికమైన దోషాలు ఉండవచ్చని విద్యార్థులకు చెప్పండి. ఈ కృత్యం విద్యార్థులలో అవధానాన్ని పెంచుతుంది. ఈ కృత్యం విద్యార్థులలో జారుగురుతను వివిధభావనలను పరీక్షిస్తుంది. నేనెవరిని ? ఒక విద్యార్థి ఒక ప్రముఖ వ్యక్తిగా ప్రాతినిధ్యం వహించాలి (ఉదాహరణకు ఒక శాస్రవేత్తలాగా ,లేదా చరిత్రలో ప్రముఖవ్యక్తిగా లేదా ఒకరచయితగా ఒక ఒక పుస్తకంలోని పాత్రగా మొదలైవి ) ఈ విద్యార్థి తాను ప్రాతినిధ్యం వహించే వ్యక్తిగురించి మూడు ఆధారాలను ఇస్తాడు. దీని ఆధారంగా మిగిలిన విద్యార్థులు ఆ పాత్రనుగుర్తించాలి. ఈ కృత్యం విద్యార్థులకు వివిధకాలలోని ప్రముఖవ్యక్తులను వారి తోడ్పాటుని తెలియచేస్తుంది. బొమ్మలను చిత్రించడం విద్యార్థులను జతలు జతలుగా ఉండి వీపులు కలిసేలా కూర్చోమనండి. ఒకరికి ఒక చిత్రాన్ని ఇవ్వాలి. ఇంకొక విద్యార్థికి ఒక కాగితాన్ని పెన్సిల్ ని ఇవ్వాలి. చిత్రాన్ని కలిగిన విద్యార్థి ఆ చిత్రాన్ని వర్ణిస్తాడు. మరొక విద్యార్థి ఆ వర్ణన ఆధారంగా చిత్రాన్ని గీస్తారు. దీనిని విద్యార్థులు వారి పాత్రను మార్చుకొని మరొకసారి నిర్ణఇస్తారు. ఈ కృత్యం విద్యార్థులు ఎంత స్పష్టంగా సూచనలను చేయగలరు, ఎంత స్పష్టంగా అవగానచేసుకోగలరని పరీక్షిస్తారు. నాయకుడెవరు? తరగతిలో విద్యార్థులందరూ వృత్తాకారంలో కూర్చోంటారు ఒక విద్యార్థి స్వచ్ఛంధంగా తరగతి బయటకు వెళతాడు. మిగిలిన విద్యార్థులు తమలో ఒకరిని నాయకునిగా ఎన్నుకొంటారు. వివిధ కృత్యాలను చప్పట్లుకొట్టడం, కాళ్ళను నేలకు కొట్టడం మొదలైనవాటిని నాయకుడు వరుసగా చేస్తాడు. మిగిలిన విద్యార్థులదరూ నాయకునిని అనుసరిస్తారు. స్వచ్చంధంగా బయటకు వెళ్ళిన విద్యార్థి వృత్తంమధ్యలో నిలుచుకొని నాయకున్ని గుర్తించడానికి ప్రయత్నిస్తారు. బృందం అంతా నాయకుని వైపు చూడకుండా అతనిని అనుసరించి కృత్యాలను నిర్వహిస్తారు. బృందనాయకుడు స్వచ్ఛంధవిద్యార్థికి దొరకాకుండా కృత్యాలను మారుస్తూ ఉంటాడు. స్వచ్ఛంధంగా వృత్తం మధ్యలో నిలబడిన విద్యార్థి బృందనాయకునిన్ని గుర్తించి తాను వృత్తంలో కూర్చోంటాడు. అపటివరకు ఉన్న నాయకుడు గదిబయటకు వెళ్ళగానే, బృందం మరో నాయకున్ని ఎంచుకొంటుంది. ఈ ఆట విద్యార్థులలో పరిశీలనను, అప్రమత్తతను పరీక్షిస్తుంది. 20 ప్రశ్నలు ? ఒకవిద్యార్థిని ఒక వస్తువుని గురించి ఆలోచించమని చెప్పండి ఇతర విద్యార్థులు ఇతనిని 20 వరకు ప్రశ్నలను అడిగి ఆ ఆలోచనను గుర్తించాలి. “అవును” లేదా “కాదా” సమాధానాన్ని మాత్రమే వచ్చేలా ప్రశ్నించాలి. ఈ కృత్యం వలన పిల్లలు తక్కువ ప్రశ్నలతో కావలసిన సమాధానాన్ని తెలుసుకొనేందుకు ప్రశ్నించేపధ్ధతిని తెలుసుకొంటారు. ఉదాహరణకు పై సన్నివేశంలో ఆ వస్తువు సజీవియా లేక నిర్జీవా ? లేదా ఆ వస్తువు చెక్కతో చేశారా ? మొదలైనవి. సమాచార మరియు సాంకేతిక పరిజ్ఞానాన్ని,(ICT) బోధనకోసం ఉపాయోగించడం - అన్నా నీనా జార్జ్ సమాచార మరియు సాంకేతిక పరిజ్ఞానాన్ని బోధనకోసం ఉపాయోగించడం సాంకేతిక పరిజ్ఞానం (IT) చాలా వేగంగా అభివృధ్ది చెందుతోంది, ఇంత అభివృధ్ధి జరుగుతుందని 10 సంవత్సరాల క్రితం ఎవరూ ఊహించి కూడా ఉండరు. ఇప్పుడు ఇది అన్ని రంగాలకులకు బ్యాంకింగ్, సమాచార వినిమయానికి, ప్రయాణాన రంగానికి అంతటా విస్తరించినది. ఈ వ్యాసం యొక్క ఉద్దేశ్యం మరియు ఆసక్తి దీని గురించి కాదు, ఇది సమాచార సాంకేతిక పరిజ్ఞానం (I.C.T) గురించి. అయితే ఈ రెండింటికి తేడా ఏమిటి? సమాచారాన్ని అందించడానికి, సృష్ఠించడానికి, ఇతరులతో పంచుకోవడానికి, నిలువచేయడానికి, నిర్వహించడానికి ఉపయోగపడే సాంకేతిక పరికరాలు మరియు వనరులే సమాచార సాంకేతిక పరిజ్ఞానం (ఐ సి టి). ఇది కంప్యూటర్ తోనూ అంతర్జాలంతోనూ ఎక్కువగా ముడిపడిఉంది. టి. వి, రేడియో, యెల్.సి.డి, దృశ్యస్రవణ పరికరాలు అన్నీ కూడా సమాచార సాంకేతిక పరిజ్ఞానమే (ఐ.సి.టి.) నే. ఐ.సి.టి సమచారంతో భావప్రసరనకు సంబంధించినది. ఐ. సి . టి అంటే సమాచారాని సృష్టించడం మరియు పంచుకోవడం. కంప్యూటర్లు, ఫోనులు అంతర్జాలం, టి.వి ఇవన్నీ దీనికి దోహదపడుతాయి. సమాచారం మరియు సాంకేతిక పరిజ్ఞానానికి, బోధనకు సంబంధం ఏమిటి ? రూపావళిలో మార్పు : ప్రస్తుత తరానికి ఎలాంటి సమాచారం వారికి అవసరమనుకొంటే అలాంటిది వారికి సులభంగా అందుబాటులో ఉంది. ప్రస్తుతం సమాచార సేకరణ మరియు పంచుకోవడం కన్నావ్యాప్తి చెయ్యడం ముఖ్యం. కానీ తరగతి గదిని పరిశీలించినప్పుడు ఇప్పటికీ ఉపాధ్యాయుడు బోధిస్తూనే ఉన్నాడు విద్యార్ఠి వింటూనే ఉన్నాడు. ఈ సమాచార సాంకేతిక యుగానికి ఇలాంటి బోదనాభ్యసన ప్రక్రియ సరిపోదు. మనం సమాచారాన్ని విద్యార్ఠులకు అందజేయడం కాకుండా వారే నిర్మించుకొనేలా చేయ్యాలి . ఇలాంటి పధ్ధతిలో మాత్రమే అభ్యాసకుడు చురుకుగా ఉంటాడు, ఉపాధ్యాయుడు వారికి సదుపాయ సంధాత అవుతారు. రూపావళిలో ఇలాంటి మార్పు జరగాలి. ఈ క్రొత్త బోధనా ప్రక్రయలో సమాచారాన్ని అభ్యాసకుల నుండి తీసుకొని రావాలి, వారికి అందివ్వకూడదు. ఇప్పటి తరానికి చాలా కొన్ని విషయాలు మాత్రమే కొత్తవిగా అనిపిస్తాయి. చాలా వాటి గురించి వారికి తెలుసు. వారు చాలా విషయాలను టి.వి మరియు అంతర్జాలంలో చూడడం ద్వారా, వార్తాపత్రికలను చదవడం ద్వారా తెలుసుకో గలుగుతున్నారు. కావున విద్యార్థులు వారు సేకరించే సమాచారాన్ని సమీకృతం చెయ్యడానికి, వ్యవస్ఠీకృతం చేయాడానికి, పంచుకోవడానికి తగిన మార్గాలను ఉపాధ్యాయుడు చూపాలి. భోధనలో సమాచార సాంకేతిక పరిఙ్ఞానం: సమాచార సాంకేతిక పరిఙ్ఞానం బోధించడానికి ఎలా ఉపయోగించవచ్చో తెలుసుకొనేముందు మన తరగతి గదుల్లోని సామాన్య సమస్యలగురించి తెలుసుకొందాము, అధికసంఖ్యలో గల విద్యార్థులు, వివిధ వ్యక్తిగత సామర్థ్యాలు గల విద్యార్థులు, సరిపడినంత స్థలము లేకపోవడం, సరైన ధారణ కొరవడడం,ప్రదర్శనలకు అనువైన ప్రదేశాలు లేకపోవడం, మరియు విస్త్రుతమైన పాఠ్యాంశాలు. ఇక్కడ మనకు సమాచార సాంకేతిక పరిఙ్ఞానం సహాయపడుతుందా? మనము బోధనలో ఐ.సి.టి. నిసమీకృతం చేసినప్పుడు విద్యార్థుల అవధానంలోనూ, అభ్యసనా ప్రక్రియలో పాల్గొనటంలోనూ చాలా భేధాలను చూడవచ్చు. దీనికోసం మొదట మనము మన బోధనా పధ్ధతిని మార్చుకోవాలి. బోధనాభ్యసన ప్రక్రియలో విద్యార్థులను సమీకృతం చేసుకోవాలి. ఐ.సి.టి. వలన సమాచార సేకరణ సులభమౌతుంది ఇందుకు ఉపాధ్యాయుడు సౌలభ్యాన్ని కలిగించాలి. ఐ.సి.టి.ని బోధనలో ఉపయోగించుకోవడానికి వివిధ మార్గాలున్నాయి. తరగతి గదిలో బహుళమాధ్యమాలను ( కంప్యూటర్, యెల్.సి.డి, స్పీకర్స్ మొదలైనవి) ఉపయోగించడం: బోధనాపధ్ధతి బోధించవలసిన అంశం ఆధారంగా ఉంటుంది. కొన్ని వివరించడానికి అనువుగా ఉంటాయి కొన్ని చర్చించడానికి అనువుగా ఉంటాయి, కొన్ని వాదించడానికి అనువుగా ఉంటాయి, మరికొన్నిప్రయోగశాలలో ప్రదర్శించడానికి అనువుగా ఉంటాయి. ఎక్కువ సంఖ్యలో చిత్రాలు లేదా వీడియోలు లేదా చైతన్యవంతమైన చిత్రాలు (animation) అవసరమైన అంశాన్ని తరగతి గదిలో బోధించడానికి బహుళమాధ్యమాలను ఉపయోగించవచ్చు. ఏవైనా అధ్యయనానికి సంబంధించిన అంశాలను బోధించడానికి పి.పి.టి. లు అవసరమౌతయి. చాలా అంశాలకు చెందిన చిత్రాలు మరియు సమాచారం అంతర్జాలంలో లభిస్తుంది కానీ మనము ఉపయోగించాలనుకొన్న చిత్రాలను, వీడియోలు పి.పి.టి. లలో ఉపయోగించవచ్చు. పాఠ్యపుస్తకంలోని సమాచారం అంతా పి.పి.టి లొ ఉంచాల్సిన అవసరం లేదు. పి.పి.టి లో పాఠ్యాంశాన్ని బోధిస్తూనే విద్యార్థులకు అభ్యాసపత్రాలను ఇవ్వవచ్చు, ఇది విద్యార్థులు అంశాన్ని బాగా అవగాహన చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. మీ బోధన మూడు భాగాలుగా కొనసాగాలి మొదటిది, సుహృద్భావ వాతావరణం ఏర్పడడానికి రెండవది, బోధించాల్సిన అంశాన్ని వివరించడం మూడవది, చర్చ లేదా మూల్యాంకనానికి చెందినది : చర్చించడం, పునరాలోచన, పునరావలోకనం మరియు మూల్యాంకనం ఈ మూడుదశలలోనూ బహుళమాధ్యమాలను ఉపయోగించవచ్చు. కానీ తొలిదశలో ఉపయోగించడం బాగుంటుంది. ఉదాహరణకు మీరు రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన ఒక పద్యాన్ని బోధిస్తున్నట్లైతే ఆయన చిత్రాన్ని, ఆ సమయంలోని సన్నివేశాన్ని ప్రతిబించించే చిత్రాలను, స్థలాలను ఆ సమయంలోని బెంగాల్ ప్రజల జీవనవిధానాన్ని మోదలైనవన్నీ బోధనను మరింత ప్రభావవంతం చేస్తాయి. ఠాగూర్ కాబూళీవాలా సన్నివేసాన్ని స్థలాలను కంప్యూటర్ ద్వారా ఇప్పటి తరానికి చూపించినట్లైతే వారు మరింతగా అవగాహన చేసుకొంటారు. పాఠ్యాంశం ఈస్ట్ ఇండియా కంపేనీ గురించి అయితే, భారతదేశం పై ఒక లఘుచిత్రం, ఆ కాలంలోని ప్రజలజీవన విధానం, ఈస్ట్ ఇండియా కంపేనీ స్థాపించడానికి దారి తీసిన అప్పటి రాజకీయ పరిస్థితులను చూపించవచ్చు. బ్రిటీష్ వారు భారతదేశ పాలకులతోతోనూ మరియు వాణిజ్యదారులతోనూ ఎలా సంభాషించగలిగారో ? తెలుస్తుంది ? పాఠ్యాంశం జంతు ప్రపంచానిధైతే వివిధ జంతువుల చిత్రాలను, వీడియోలను అవి ఎలాంటి వాతావరణంలో జీవిస్తాయో వీటన్నంటినీ శక్తివంతంగా ఒక పి.పి.టి.లలో చూపవచ్చు. అలా కాక, పాఠ్యాంశం జీర్ణ లేదా శ్వాశకోశ వ్యవస్థ పై అయితే దీనికి కూడా కంప్యూటర్ బాగా సహాయపడుతుంది. మనము ఆహారం తీసుకొన్నాక అలాగే శ్వాశిస్తున్నప్పుడు మన శరీరంలో ఏమి జరుగుతుందో ఒక చైతన్యవంతమైన చిత్రంలో(animation) చూపిస్తే ఇది పిల్లలకు ఆసక్తిని ఇస్తుంది. అంతర్జాలానికి కలపని కంప్యూటర్ ని బోధన కోసం ఉపయోగించడం : కంప్యూటర్ ప్రయోగశాలలో బోధన కోసం కంప్యూటర్ ని ఉపయోగించడం, తరగది గదిలో బహుళమాధ్యమాలను ఉపయోగించి బోధించడానికి భిన్నమైనది. ఈ పధ్దతిలో 4 లేదా 5 గురు విద్యార్థులకు ఒక కంప్యూటర్ కేటయించాలి. ఉపాధ్యాయుడు బోధించాల్సిన అంశానికి సంబంధించి ఒక పి.పి.టి ని తయారు చేసి అన్ని కంప్యూటర్లలో ప్రవేశపెట్టాలి. ఈ పి.పి.టిలో సూచనలు, కృత్యాలు మరియు ప్రశ్నలు కూడా ఉండాలి. ఇక్కడ బృంద చర్చలను, వారి ఆలోచనలను పంచుకోవడాన్ని, సమీకృతం చేయడాన్ని ప్రోత్సహించాలి. ఈ అంశాన్ని సరైన సన్నివేశంలో ప్రదర్శించాలి. దీనిని విద్యార్థుల వివిధ సామర్థ్యాలకు అనుగుణంగా తయారు చేయ్యాలి. విద్యార్థులు వారు చేసిన పనిని ఒక వర్డ్ డాక్యుమెంట్ లో భద్రపరచి తరువాత దశలలో ఉపాధ్యాయుని సలహాలను సూచనలను పొందవచ్చు. ఈ పి.పి.టి. ప్రదర్శనను ఒక చర్చతో ముగించవచ్చు. విద్యార్థులకు కంప్యూటర్ యొక్క వివిధ అనుప్రయోగాల గురించి వివరించినట్లైతే వారు వారి సమాధానాలను మరింత ఆసక్తికరంగా ఇవ్వగలరు. ఒక వేల మీరు ట్రెపీజియం గురించి బోధిస్తున్నట్లైతే మీరు విద్యార్థులను కంప్యూటర్ ను ఉపయోగించి ట్రెపీజియాన్ని చిత్రించి దానిని రంగుతో నింపమనవచ్చు. ఒక వేల మీరు "నేల/భూమి" గురించి బోధిస్తున్నట్లైతే మీరు విద్యార్థులను కంప్యూటర్ను ఉపయోగించి "నేల/భూమి" లోని వివిధ పొరలను చిత్రించి దానిని రంగుతో నింపమనవచ్చు. తరగతి గదిలో అంతర్జాలాన్ని ఉపయోగించడం తరగతి గదిలో అంతర్జాలాన్ని ఉపయోగించడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఉపాధ్యాయులు ఒక బ్లాగుని ఏర్పరచి ఒక అంశానికి సంబధించిన చిత్రాలను, వీడియోలను అభ్యాస పత్రాలను, సమాచారాన్ని ఆ బ్లాగులో నిల్వ ఉంచవచ్చు. ఈ విధంగా ఉపాధ్యాయుడు ఆ అంశాన్ని ఎక్కువ మంది విద్యార్థులతో, తరగతి గది వెలుపల అయినా చర్చించవచ్చు. విద్యార్థులు కూడా తాము చేసిన పనిని ఈ బ్లాగులో ఉంచవచ్చు. మీరు గూగుల్ లో “టీచర్ బ్లాగ్” అని శోధిస్తే మీకు ఈ బ్లాగుని ఎలా ఏర్పరచాలో తెలుస్తుంది. మీ బ్లాగులో మీ విద్యార్థులు వారి స్వంత బ్లాగులను ఏర్పరుచుకోవచ్చు, ఇది మరింత అధిక సమాచారాన్ని విద్యార్థులకు ఇవ్వడానికి మాత్రమే కాక, తరగతి గదిలో వారి ఆలోచనలను పంచుకోవడానికి సాధ్యంకానటువంటి అంటే ఎక్కువ సంఖ్యలో విద్యార్థులుగల తరగతిగదికి కూడా ఉపయోగపడుతుంది. తరగతి గదిలో వెనుకబడిన విద్యార్థులు, అంతర్ముఖులు, బిడియం కలిగిన వారు కూడా పాల్గొనడానికి అవకాశాన్ని కల్పిస్తుంది. మీరు విద్యార్థుల సామర్థ్యం ఆధారంగా వారికి విభిన్న కృత్యాలు ఇవ్వడానికి అవకాశాన్ని కల్పిస్తుంది. విద్యార్థులకు పరీక్షలను నిర్వహించి వారి సామర్థ్యాన్ని కూడా పరీక్షించవచ్చు. విద్యార్థులు అవహేళనకు గురికాకుండా ఒక అంశాన్ని అభ్యసించడానికి పునరభ్యసించడానికి అలాగే ఒక అంశాన్ని పలు మార్లు అభ్యసించడానికి ప్రశ్నలను అడగడానికి అవకాశం ఇస్తుంది. అలాగే విద్యార్థులను ఆ అంశానికి చెందిన మరింత సమాచారాన్ని సేకరించమని చెప్పవచ్చు. బోధనలో టి.వి మరియు రేడియోల ఉపయోగం: టి.వి మరియు రేడియోలో చరిత్ర, భూగోళశాస్త్రం విఙ్ఞానశాస్త్రం, మరియు పర్యావరణశాస్త్రం పై వచ్చే కార్యక్రమాల అధారంగా విద్యార్థులకు కొంత ఇంటిపని ఇవ్వాలి. ఇది విద్యార్థులలో ఆసక్తిని రేకెత్తించడమే కాకుండా మరింత సమాచారాన్ని కూడా ఇస్తుంది. దీనిని తరగతి గదిలో పంచుకోవచ్చు. వీలైనన్ని పాఠ్యాంశాలకు ఇలాంటి కృత్యాలను ఇవ్వవచ్చు. అన్ని అంశాలను ఉపాధ్యాయుడే బోధించే అవసరం లేదు. కొన్నింటిని విద్యార్ధులు తరగతి గదిలో ప్రదర్శిస్తే వాటిపై ఉపాధ్యాయుడు తగిన సలహాలు సూచనలు ఇవ్వవచ్చు. ముగింపు: ఇక్కడ ఈ ఆలోచన బోధనకు పెద్ద పెద్ద పరికరాలను ఉపయోగించి సాంకేతికతను సంతరింపచెయ్యటం కాదు, అంతకంటే ఇంకా ఎక్కువ. పైన పేర్కొన్న అన్నింటిని నేను కొన్ని సంవత్సరాలుగా మా చాత్రోపాధ్యాయులకి కోసం ఉపయోయాగించాను. దాని ద్వారా వస్తున్న ఫలితాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. నాకు కూడా మొదట్లో కంప్యూటర ని అంతర్జాలాన్ని ఉపయోగించడంలో గల సాధకబాధకాల గురించి తెలియదు కానీ నిరంతరంగా ఉపయోయాగించడం వలన నేనిప్పుడు ఐ.సి.టి.ని ప్రభావవంతంగా ఉపయోగించగలుగుతున్నాను. ఆధారము: టీచర్స్ అఫ్ ఇండియా