చాలామంది విద్యార్ధులు ఆన్లైన్లో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుంటారు. వెబ్సైట్లలో నమోదైన వీరి వివరాలను మోసగాళ్ళు సేకరించి బూటకపు ఈ-మెయిల్స్ పంపుతుంటారు.

ఈ ఈ-మెయిల్కూడా నిజమైన కంపెనీలు పంపే మెయిల్లాగానే కనిపిస్తుంది. మోసగాళ్ళు బూటకపు మెయిలర్ సైట్లద్వారా ఈ మెయల్స్ను పంపి ఇంటర్వ్యూలుకూడా నిర్వహిస్తారు.

బాధితుడికి ఉద్యోగంలో చేరమంటూ ఒక మోసపు నియామకపత్రం అందుతుంది. ఈ లేఖ అందుకున్నవారు ఒక పెద్దమొత్తం చెల్లించాలనికూడా మోసగాళ్ళు ఆ లేఖలో సూచిస్తారు.

మోసగాళ్ళు బూటకపు మెయిలర్ సర్వీస్ ద్వారా ఉద్యోగనియామక పత్రాన్ని పంపుతారు. బహుళజాతిసంస్థ పేరుతో ఫోన్ చేయటం, ఉద్యోగ నియామకపత్రాన్ని పంపటం చేస్తుంటారు. వారి మాటలు నమ్మి ఉద్యోగార్థులు వారి ఖాతాలలో డబ్బును జమచేస్తారు. మోసగాళ్ళు వెంటనే ఆ డబ్బును విత్డ్రా చేసుకుంటారు.

ముందుజాగ్రత్తలు

స్పామ్ మేయిల్స్ ఎక్కడి నుండి వచ్చాయో సరిచూసుకోకుండా జవాబు ఇవ్వరాదు.

అభ్యర్దులు సంస్థలతో స్వయముగా మాట్లాడనంత వరకు డబ్బులు ఖాతాలలో జమ చేయకూడదు.

డబ్బులు చెల్లించి ఉద్యోగాలను పొందునటువంటి ప్రక్క దారులను ప్రయత్నించకండి, అవి మోసపూరితమైనవి.

ఉద్యోగ అవకాశాలకై సంస్థలయోక్క వెబ్ సైట్లలో సరిచూసుకోండి.

సంస్థల నకిలీ ఈ-మెయిల్ ఐడి లతో జాగ్రత్తగా ఉండండి.

ఈ-మెయిల్స్ ద్వారా చేయు వ్యాపార లావాదేవీలకు ముందు ఈ-మెయిల్ ఐడి లోని ప్రతి అక్షరమును సరిచూసుకోండి.

నగదును సంస్థల ఖాతలలో జమచేయు ముందు వారి ఖాతా మరియు సంస్థ పేరుల వివరముల ఏమైన మార్పులు ఉన్నాయేమొ ఫోనులో అడిగి తేలుసుకోండి.

మీ ఎకౌంటును తెరుచుటకు సెకెండ్ స్టెప్ వెరిఫికేషన్ కోడ్ (మొబైల్ ఎలర్ట్) ను నిర్వహించండి .

ఏదైన మోసపూరితమైనవి గమనించి నపుడు సంస్థలకు వెంటన తెలియపరచండి.

స్పామ్ ఈ-మెయిల్స్ ఎక్కడనుండి వచ్చాయే సరి చూసు కోకుండా ప్రత్యుత్తరము ఎవ్వకూడదు.

ఆధారము: http://www.infosecawareness.in/