కౌన్ బనేగా కరోడ్‌పతి, ఎయిర్టెల్ లాటరీ, టాటా డొకోమో లాటరీ, స్టార్ స్పోర్ట్స్ లాటరీ, ఎయిర్టెల్/ఐసీసీ కప్ లాటరీ, బీబీసీ/హీరోహోండా/స్టార్ లాటరీ/స్టార్ క్రికెట్ లాటరీ/స్పోర్ట్స్/షెవర్లె మోటార్స్ మొదలైనవి వంటి లాటరీ ఈ-మెయిల్స్/ఎస్ఎమ్ఎస్లు వస్తున్నాయా? లాటరీ ఈ-మెయిల్స్/ఎస్ఎమ్ఎస్‌లలో మోసగాళ్ళు ప్రజలను - మీ సెల్ నంబర్‌కు లక్షలలో లాటరీ తగిలిందని, ఫలానా ఈమెయిల్ ఐడీకి మీ సమాచారాన్ని ఇవ్వాలని కోరుతూ ఈమెయిల్, ఎస్ఎమ్ఎస్, లేదా ఫోన్ కాల్ ద్వారా సంప్రదిస్తారు. బాధితుడు అది నిజమేనని నమ్మి ఈమెయిల్ ద్వారా తన పూర్తి వివరాలను ఈ మెయిల్ ద్వారా తెలియజేస్తాడు. మోసగాళ్ళు బాధితుడిపేరుమీద రూపొందించిన నకిలీ చెక్/సర్టిఫికెట్ యొక్క స్కాన్ చేయబడిన కాపీని మెయిల్ చేస్తారు. రిజిస్ట్రేషన్ రుసుము కింద నిర్దిష్టమొత్తాన్ని జమచేయమంటూ బాధితుడికి ఒక బూటకపు ఖాతా నంబర్ ఇస్తారు. బాధితుడు అదికూడా నమ్మి మోసగాళ్ళు చెప్పిన ఖాతాలలో డబ్బును డిపాజిట్ చేస్తాడు...కొన్నిసార్లు ఇది లక్షలలో ఉంటుంది. అయితే బహుమతి మొత్తం ఎంతకూ రాకపోవటంతో తాను లాటరీల పేరుతో మోసపోయినట్లు బాధితుడు కొంతకాలానికి తెలుసుకుంటాడు. లాటరీ కుంభకోణం కొన్నిసార్లు, “మీరు మిలియన్ డాలర్లు లాటరీలో గెలుచుకున్నారు" అంటూ మీకు ఒక ఈమెయిల్ అందుతుంది. ఇలాంటి మెయిల్స్ అందుకోవటం బాగానే ఉంటుంది. అయితే, అది నిజమైతేనే బాగుంటుంది. ఇలాంటి మెయిల్స్‌కు స్పందించటంవలన పెద్దమొత్తంలో డబ్బు పోతుంది. మోసగాళ్ళు ఆ డబ్బు ఆశ చూపించి మిమ్ములను బుట్టలోవేసి వంచిస్తారు. 'మీరు వెబ్‌క్యామ్, డిజిటల్ కెమేరా గెలుచుకున్నారు, అభినందనలు' వంటి ఈ-మెయిల్ కుంభకోణం కొన్నిసార్లు మీరు డిజిటల్ కెమేరా లేదా వెబ్ క్యామ్ గెలుచుకున్నారంటూ మీకు ఒక ఈ మెయిల్ వస్తుంది. దానిని పంపటానికయ్యే ఖర్చులకోసం ఈ క్రింద ఇచ్చిన లింక్‌ను నొక్కి మా వెబ్సైట్లో మీ క్రెడిట్/డెబిట్ కార్డ్ వివరాలు ఇస్తే సరిపోతుందని చెబుతారు. ఆ డబ్బులు మీ ఖాతాలోనుంచి తీసుకోబడతాయిగానీ, మీకు ఆ బహుమతి ఎప్పటికీ అందదు. ముందుజాగ్రత్త చర్యలు ఆన్లైన్ లాటరీ లేదా బంపర్ పండగ బహుమతి అంటూ కొత్తవారినుంచి ఈమెయిల్గానీ, ఫోన్‌కు ఎస్ఎమ్ఎస్ వస్తే స్పందించకండి. సరిగ్గా నిర్ధారించుకోకుండా కొత్తవారి ఖాతాలలో డబ్బులు డిపాజిట్ చేయకండి. తమకు సంబంధంలేని ఒక బ్యాంక్ ఖాతాదారుడికి కమిషన్ ఇచ్చి ఆ ఖాతా నంబర్‌ను వాడుకోవటంద్వారా మోసగాళ్ళు లాటరీ మోసాలను చేస్తారు. మోసగాళ్ళు, సబ్జెక్ట్లైన్లో 10,000డాలర్లు గెలుచుకున్నట్లు ఉండే ఈమెయిల్స్ వలలో పడొద్దు. మీ ప్రమేయం లేకుండానే మీకు ఆ మెయిల్ ఎలా వచ్చిందని ఆలోచించండి. తక్కువధరకు వస్తువులు ఇస్తామన్న ప్రకటనలతో అప్రమత్తంగా ఉండండి. మీరు ఆన్లైన్ షాపింగ్లోగానీ, పోటీలోగానీ పాల్గొనకుండానే మీకు ఆ మెయిల్ ఎందుకు వచ్చిందో ఆలోచించండి ఆధారము: http://www.infosecawareness.in/