సాధారణంగా తల్లిదండ్రులు వారి పిల్లలను ఎలా పెంచాలో అని తికమక పడుతుంటారు. పిల్లలు ఒక పెద్ద బాధ్యత. దానిని సరిగా నిర్వహించాలనుకున్నవారికి సందేహాలు మరియు ప్రశ్నలు ఉండటం సహజం. వినికిడి లోపాలు ఉన్న పిల్లల తల్లిదండ్రులకు కూడా దీనిలో మినహాయింపు లేదు. నిజానికి, వారికి మరిన్ని సందేహాలు మరియు చింత ఉంటాయి. కాని వారికి మరిన్ని సవాళ్లు మరియు సంతోషం క్షణాలు కూడా ఉంటాయి. తల్లిదండ్రులు హఠాత్తుగా ఎదర్కొన్న కొన్ని సంఘటనలకు సంబంధించిన సందేహాలను ఇక్కడ చర్చిద్దాం. మేము మీ అన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని మరియు మీ సందేహాలను దూరం చేయాలనేది మా ఉద్దేశం. కానీ చాలా సార్లు జీవితం చాలా సంక్లిష్టమైనది. అనేక ప్రశ్నలకు సూటి లేదా సాధారణ సమాధానాలు ఉండవు. మేము అనేక సార్లు సులువు సమాధానాలను గుర్తించడంలో విఫల మయ్యాము. కొన్ని సాధారణ సందేహాలు మరియు స్పందనలు క్రింద ఇవ్వబడ్డాయి. నేను నా పిల్లల విద్య గురించి ఆలోచిస్తున్నాను. నేను వారిని విద్యాపరంగా విజయవంతం చేయాలి అని అనుకుంటున్నాను. నేను ఎక్కడ నుంచి ప్రారంభం చెయ్యాలి? క్రింది వాస్తవాలను అంగీకరించండి మరియు గుర్తించండి. పదం 'విజయం' యొక్క అర్థం, వివిధ వ్యక్తులకు భిన్నంగా ఉంటుంది. అది వేరే వేరే సందర్భంలో భిన్నంగా ఉంటుంది. మీరు మీ పిల్లల బలాలు మరియు బలహీనతల చట్రంలో మీ పిల్లల 'విజయం' నిర్వచించాలి. లభించని గోల్స్ ఏవీలేవు, కానీ మరింత ముఖ్యంగా మీరు పిల్లలను తక్కువగా అంచనా వేయవద్దు. విజయం అనేక కారణాలపై ఆధారపడి ఉంటుంది. తల్లిదండ్రులు ప్రమేయం ముఖ్యమైన కారణాలలో ఒకటి. ప్రారంభ చిట్కాలు: (ఇటీవలే బిడ్డ బలహీనత గురించి తెలిసిన తల్లిదండ్రులు కోసం) ప్రతికూల భావావేశాలను నియంత్రించుకొండి (ఎందుకు నాకు? ఎందుకు నా పిల్లలకు?) నిస్సహాయత ('ఈ ఆనందం ముగింపు! ఏమీ సరిగా వెళ్ళటం లేదు!') లేదా భయం (నేను ఇప్పుడు ఏమి చెయ్యాలి? నా బిడ్డకు ఏమౌతుంది?) . నువ్వు చేయగలవు. ఇతర తల్లిదండ్రులు దానిని చేసారు. దెనికోసమైనా ఇతరులను నిందించి సమయం వృధా చేసుకోకండి. మీరు త్వరగా ప్రతికూల భావాల దశనుంచి అనుకూల దశలోకి రావటానికి ప్రయత్నించండి. మీరు అపరాధులుగా అనుకోకండి లేదా నిరాశను పెరగనీయకండి. మీకు మీరే బయట పడండి. బహుశా మీ జీవితం మరింత సవాలుగా మరియు మరింత అర్ధవంతమైనదిగా మారచ్చు. మీ పిల్లలు ఎలా ఉంటే అలా అంగీకరించండి. ఇది చాలా ముఖ్యమైనది, అప్పుడు మాత్రమే మీ పిల్లల అర్ధవంతమైన విద్యను మొదలు పెట్టగలరు. అన్ని సంబంధిత పరీక్షలను చేయించండి. వినికిడి నష్టం యొక్క స్వభావం, తీవ్రత మరియు రకం గురించి ముఖ్యమైన వైద్య వివరాలు తెలుసు కోవడానికి ప్రయత్నించండి. పిల్లల అభివృద్ధిపై ఉండే ప్రతికూల ప్రభావాల గురించి చర్చించండి మరియు మీరు వాటిని నిరోధించడానికి ఎమిచేయాలో తెలుసుకొండి. పరిచయం ఉన్న నిపుణులతో మీరు మాట్లాడి మీ సందేహాలు నివృత్తి చేసుకొండి. అతను/ఆమె ప్రత్యేక అడియలాజిస్టు లేదా ఒక భాష చికిత్సకులు కావచ్చు. నిరంతరం మీ పిల్లలతో మాట్లాడండి. ఇది ఆమె/అతని భాషా నైపుణ్యాలను అభివృద్ధి చేయటానికి సహాయం చేస్తుంది. ఇది మానసికంగా అతన్ని/ఆమెను చుట్టూ ఉన్న ప్రపంచంతో కలిపి ఉంచుతుంది. కమ్యూనికేషన్ భద్రతకు సంబంధించి కూడా ముఖ్యమైనది మరియు సంబంధాలు కుటుంబం యొక్క ప్రాధమిక అవసరం. ఇంట్లో పని ఉపాధ్యాయులు లేదా పాఠశాలలపై విద్యను వదిలివేయ వద్దు. మీరు మీ పిల్లల విద్యాభ్యాసంలో ప్రధాన పాత్ర పోషించాలి. అర్థంచేసుకొండి మరియు గుర్తించండి. వివిధ కార్యకలాపాలు మీ పిల్లల వివిధ రకాల అభివద్ధికి సహాయపడతాయి: రోజువారీ గృహ కార్యకలాపాలలో మీ పిల్లలను పాల్గొన నివ్వండి. బిడ్డకు కథల పుస్తకాలు చదవండి స్వతంత్రంగా చదివే/వ్రాసే చర్యలు చేపట్టండి. ముఖ్యంగా పేక, లూడో, పట్టుకొనుట, పాములు మరియు నిచ్చెన మొదలైన ఆటలు పిల్లలతో ఆడండి. దానివలన పిల్లలు ఆలోచించటం మరియు కమ్యునికేటు అవటం చేస్తారు. అధ్యయనాలు క్రమం తప్పకుండా చేయండి స్నేహితులను చేసుకోవడానికి మీ పిల్లలకు సహాయం చేయండి. మీ బిడ్డ యొక్క పురోగతిని గమనించండి. మీరు సంతృప్తికరంగా లేకపోతే, ఇతర ఎంపికలను ప్రయత్నించండి. నిపుణులతో చర్చించండి మరియు మీ గుణాత్మక మరియు పరిమాణాత్మక ప్రమేయాన్ని పెంచండి. వాస్తవిక విద్యా ప్రణాళిక వ్యక్తి వ్యక్తికి మారవచ్చు. మేము ఎదైనా సూచించాలనుకుంటే ముందుగా మీ పిల్లల ప్రస్తుత వయస్సు, స్వభావం/వినికిడి శక్తి, అతని/ఆమె గత విద్యా అనుభవం మొదలైనవి వివరాలు కావాలి. దీనీతో పాటుగా మీరు తెలుసుకోవలసిన విషయాలు కింద ఉన్నాయి: ప్రతి వారికి విద్య ముఖ్యం. వినికిడి లోపం కల పిల్లలకు ఇది మినహాయింపు కాదు. నిజానికి, వారికి విద్య ముఖ్యం మాత్రమే కాకుండా అవసరం కూడా. మీ వినికిడి లోపం ఉన్న పిల్లలకు చదువును దూరం పెట్టకండి. అతను/ఆమె పాఠశాలకు తప్పకుండా వెళ్లాలి. వినికిడి లోపం ఉన్న పిల్లలకు వివిధ రకాల విద్యా కార్యక్రమాలు అందుబాటులో ఉన్నాయి. మరిన్ని వివరాలకు విద్యా కార్యక్రమాలును క్లిక్కు చేయండి. ముందు మంచిది: లోపాలు లేని పిల్లల చదువు మూడవ పుట్టిన రోజు తరువాత ప్రారంభిస్తారు కానీ వినికిడి లోపాల పిల్లలు మరియు వారి తల్లిదండ్రులు చదునును నెలల ముందుగానే ప్రారంభిస్తారు. ఇక్కడ, విద్య లక్ష్యం మాత్రమే కాకుండా సంపూర్ణ అభివృద్ధి, ప్రత్యేకించి మానసిక మరియు కమ్యూనికేషన్ అభివృద్ధి వంటివి వినికిడి లోపం వలన కలిగే ప్రతికూల ప్రభావాల నుండి పిల్లల రక్షణ కూడా కలిగిస్తాయి. అక్షరాస్యత నియత విద్యకు వెన్నుముక లాగా పని చేస్తుంది. మీ పిల్లల యొక్క విద్యా విజయాలు చాలావరకు అతని/ఆమె చదవటం/వ్రాసే నైపుణ్యాలపై ఆధారపడి ఉంటుంది. చదవటం/వ్రాసే నైపుణ్యాలను అభివృద్ధి చేయడానికి ప్రత్యేక ప్రయత్నాలు చేయాలి. దీనికి పాఠ్యపుస్తకాలు బాగా ప్రయోజనాన్ని కలిగిస్తాయి. కానీ ఇవి మాములు పిల్లల విద్యా అవసరాలకోసం చేయబడ్డాయి. ఇవి పిల్లలకు భాషా జ్ఞానం ఉన్నట్టుగా ఊహించి రాయబడ్డాయి. వినికిడి లోపాలుకల పల్లలకోసం ఒక్క జ్ఞానం కోసమే కాకుండా భాష కోసం కూడా పని చేయాలి. అందువలన పాఠ్యపుస్తకాలు కాకుండా చదివే వస్తువులను పుష్కలంగా ఉపయోగించండి. ఇవి వార్తా పత్రికలు, పత్రికలు, కథల పుస్తకాలు, మెను కార్డులు, విసిటింగు కార్డులు, బొమ్మలు/గేమ్స్/గృహోపకరణాల మాన్యువల్లు, రోడ్లపై పంపిణీ చేసిన కరపత్రాలు మొదలైనవి. మీరు ఏవైనా చేయవచ్చు. ఒకసారి మీరు మొదలు పెట్టిన తర్వాత ఎన్నో విషయాలను చేర్చవచ్చు. మీకు ఇప్పటికీ 'ఎక్కడ ప్రారంభించాలి? అనే ప్రశ్న ఉందా దానికి మేము మీకు చాలా ఎంపికలను ఇచ్చాము. 'ఎప్పుడు ప్రారంభించాలి?' అనే దానికి సమాధానం మాత్రం- ఇప్పుడే! నా పిల్లలు అధ్యయనం చేయగలరా? తప్పకుండా అతను/ఆమె చెయగలరు! మీ పిల్లలు అదనపు బలహీనతలు కలిగి ఉంటే అనేక ఇతర పరీక్షలు చేయించుకోవలసిన అవసరం ఉంటుంది. మీరు భిన్నంగా మీ లక్ష్యాలను ఎంచుకోవలసి ఉంటుంది. లేకపోతే మీ ప్రశ్నకు మా ప్రతిస్పందన 'ఎందుకు అతను/ఆమె చదవలేరు?'అవవచ్చు. వినికిడి లోపం వలన అనేక రకాలు చెడు ప్రభావాలు ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా సంభాషణ మరియు భాష అభివృద్ధిపై ప్రభావాలు ఉంటాయి. దీనివలన మాట్లాడే పిల్లలు చేయగలిగే ఎన్నోపనులను వీరు చేయలేరని ముద్రిపడుతుంది, నిజానికి వీరు చేయగలరు. విద్యనభ్యసించటం ఇందులో ఒకటి. వినికిడి లోపాల పిల్లల అందుబాటులో వివిధ విద్యా కార్యక్రమాలు ఉన్నాయి. (మరిన్ని వివరాలకు 'విద్యా కార్యక్రమాలు' పై క్లిక్కు చెయ్యండి). సరైన ఎంపికను తల్లిదండ్రులు మరియు నిపుణులు ఎంపిక చేయాలి. ఈ ప్రశ్నకు వివిధ ఛాయలు ఉన్నాయి: నా బిడ్డ పాఠశాల వెళ్ళవచ్చా? నా బిడ్డ ఇతర మామూలు పిల్లలతో పాటు ఏ పాఠశాలకైనా వెళ్ళవచ్చా? నా బిడ్డ ఎస్ఎస్సి/HSC బోర్డ్ పరీక్షలు రాయవచ్చా? నా బిడ్డ ఉన్నత విద్య కోసం వెళ్ళవచ్చా? నా బిడ్డ వృత్తిపరమైన/వృత్తి విద్య కోసం వెళ్ళవచ్చా? నా బిడ్డ సాధారణ పాఠశాల/కళాశాల పాఠ్యాంశాలు తట్టుకోగలదా? నా బిడ్డ సాధారణ పాఠశాల/కళాశాల వాతావరణాన్ని తట్టుకోగలదా? అదృష్టవశాత్తూ ఈ ప్రశ్నలకు సమాధానం 'అవును' అయితే ఒక పేరెంట్ గా మీరు, చాలా సానుకూల పాత్రను పోషించాలి. నా పిల్లలు మాట్లాడతారా? నిపుణులకు చాలా సాధారణంగా వినబడే ప్రశ్న ఇది. తల్లిదండ్రులు తమ పిల్లల సామర్థ్యాన్నిగురించి ఆందోళన చెందటం చాలా సహజ. సాధారణంగా, మాటలే ఇతర జంతువుల నుండి మానవులను వేరుచేస్తాయి. మాటలు మన ఆలోచనలను తెలియజేయడానికి సహాయపడటమే కాకుండా అది సమాజంతో కూడా జత చేస్తాయి. స్పష్టంగా మాట్లాడకపోవటం ఇతర పిల్లలు గేలీ చేయడానికి దారితీయవచ్చు. తల్లిదండ్రులు దీని గురించి ఆందోళన చెందుతారు అందుకే 'నా బిడ్డ మాట్లాడతారా?' అనే ప్రశ్న. అవును మీ పిల్లల ఖచ్చితంగా మాట్లాడగలరు కాని కొన్ని కానీలు మరియు అయతేలు ఉన్నాయి. సాధారణంగా వినికిడి లోపాల పిల్లల విజయం అనేక కారణాల (మాట్లాడే సామర్థ్యం) పై ఆధారపడి ఉంటుంది. ఈ కారణాలు ఉన్నఅప్పుడు మాత్రమే అధిక విజయాలను ఆశించవచ్చు. ముందు గుర్తించటం మరియు జోక్యం ప్రారంభం నుంచి తగిన సంవర్ధకం (వినికిడి యంత్రం) తగినంత శిక్షణతో ఉపయోగించటం ఇతర అదనపు వికలాంగులు లేకపోవడం ప్రారంభంలోనే ప్రొఫెషనల్ సహాయం తగినంత కుటుంబం సామాజిక ఆర్థిక స్థితి బాగా సమాచారం తెలిసిన మరియు ప్రేరణ కలిగి శిక్షణ కోసం తగినంత సమయం మరియు శక్తి గల తల్లిదండ్రులు ఇంట్లో మరియు పాఠశాలలో పుష్కల సంభాషణ మరియు భాష స్పందన. చెవిటివారు మూగవారు కాదు! వినికిడి లోపాల వ్యక్తి సంభాషణ అవయవాలలో (నాలుక పళ్ళు మొదలైనవి) లోపం ఉండదు. అయితే అతడు/ఆమె ఇతరులు ఏమి మాట్లాడుతున్నారో వినలేరు కాబట్టి, పిల్లలకు మాట్లాడటం కుదరదు. వినికిడి మరియు చాలా వినికిడి సమస్యలు గల పిల్లలు శిక్షణతో మాట్లాడగలరు. ఎంత వేగంగా మరియు ఎంత త్వరగా మాట్లాడతారు అనేది పైన తెలిపిన వివిధ అంశాలపై ఆధారపడి ఉంటుంది. కానీ, చాలా ముఖ్యంగా, అది మీ పైన ఆధారపడి ఉంటుంది. తల్లిదండ్రులుగా మీరు మీ పిల్లలతో అద్భుతాలు చేయవచ్చు. అనేక తల్లిదండ్రులు ఇది చేసారు. మేము రెండు విషయాలు చెప్పాము, మాట్లాడటం మానవులకు ముఖ్యం మరియు వినికిడి సమస్యలు గల పిల్లలు దానిని సాధించవచ్చు. కానీ మాట్లాడే నైపుణ్యాలు కేవలం కొన్ని పరిస్థితులలో మాత్రమే సాధ్యమని మేము తెలిపాము. కొన్ని కారణాల వలన మీ పిల్లల దానిని సాధించడంలో విఫలమైతే ఏమిటి? దాని వలన ప్రపంచం అంతం కాదు. తెలివిగా పూర్తిగా ఫంక్షనల్ వ్యక్తిగత మరియు సామాజిక జీవితాన్ని గడుపుతున్న చాలామంది బధిరులను మీరు చూసి ఉంటారు. మీరు మాటల గురించి ఆందోళన చెందుతున్నారు అది మంచిదే కాని భాషను కూటా పెంపొందించటానికి ప్రయత్నించండి. మీ పిల్లల చదవడం మరియు వ్రాయడం నైపుణ్యాల గురించి కూడా పని చేయండి. విద్య ఏ విధంగా నా పిల్లలకు భవిష్యత్తులో సహాయపడుతుంది? ఆధునిక ప్రపంచంలో నియత విద్య పాత్ర దేనికీ తక్కువ కాదు. విద్య ఒక వ్యక్తి అభివృద్ధికి సహాయపడుతుంది- మానవ జీవితం మరియు సామాజిక కోణాలకు సంబంధించిన అభివృద్ధి. దీనిని అందరూ అంగీకరిస్తారు కాబట్టి మరింత వివరణ అవసరం లేదు. తల్లిదండ్రులు సాధారణంగా వారి పిల్లలకు వృత్తిని అందించే సాధనంగా విద్య ఉపయోగ పడుతుంది అని అనుకుంటారు. మీరు చదును పాత్ర వృత్తిని అందించడం వరకే పరిమితం అనుకుంటున్నారా? చదువు విశ్వాసం, మానసిక బలం మరియు శాస్త్రీయ స్వభావాన్ని ఇస్తుంది. వినికిడి లోపం ఉన్న వ్యక్తికి దీని మినహాయింపు లేదు. అతను కూడా విద్యావంతుడు కావలి. కానీ చదువు ఏ ఇతర పిల్లల కంటె వినికిడి లోపాల పిల్లలకు చాలా అందిస్తుంది. కాని సమస్యలు లేని పిల్లలలో ప్రారంభ అభివృద్ధి - వ్యక్తిగత, సామాజిక, మేధో మరియు భాష - చాలా సహజంగా మరియు యాదృచ్ఛికంగా జరుగుతాయి. వినికిడి సమస్యలు గల పిల్లలు విషయంలో భాష లేమి వివిధ అభివృద్ధి అంశాలపై ప్రతికూల ప్రభావాలను చూపుతుంది. విద్య ఈ ప్రతికూల ప్రభావాలను నివారించే దిశగా పని చేస్తుంది లేదా కనీసం వాటి ప్రభావాన్ని తగ్గించటానికి సహాయపడుతుంది. వినికిడి లోపం ఉన్నవారికి చదువు జ్ఞానం అలాగే భాషలలో ఉపయోగపడుతుంది. ఇది పిల్లల అన్ని రకాల అభివృద్ధి కోసం అవసరం. అంతేకాక, తల్లిదండ్రులు కూడా ప్రత్యేక అధ్యాపకుల నుండి మార్గదర్శకత్వం పొందటానికి అవకాశాలు ఉన్నాయి. ఇటువంటి మార్గదర్శకత్వం సహాయంతో, ఇంటివద్ద పొందే శిక్షణ మంచి ఫలితాలను ఇస్తాయి. ముగింపులో, విద్య మీ పిల్లల భవిష్యత్ రక్షణకు ఉపయోగపడటమే కాక ఒక పేరెంట్ గా మీకు శక్తిని కలిగిస్తుంది. ఈ పిల్లలకు ప్రత్యేక పాఠ్యపుస్తకాలు, బోధనా ప్రణాళిక లేదా పరీక్ష బోర్డులు ఉన్నాయా? లేవు, అస్సలు లేవు. వినికిడి లోపాల విద్యార్థులు వెరే పాఠ్యపుస్తకాలు ఉపయోగిస్తారని ప్రజలు సాధారణంగా అనుకుంటారు. వీరికి కూడా అదే చరిత్ర, జాగ్రఫీ, సైన్స్ లేదా గణితం చదవవలసి ఉంటుంది. అందుకే వేరే పాఠ్యపుస్తకాల అవసరం లేదు. అయితే, వినికిడి లోపం ఉన్నవారి ప్రత్యేక పాఠశాల విద్య అనేక కోణాల్లో భిన్నంగా ఉంటుంది: భోదన విధానము బోధన సహాయకాలు కమ్యూనికేషన్ విధానం జ్ఞానం మరియు భాషల మధ్య సంతులనం కూర్చొనే అమరిక తరగతిలో నిర్మాణం సహా గురువు విద్యార్థి నిష్పత్తి మొదలైనవి విలికిడి లోపం కల పిల్లల తలిదండ్రులుగా చదువులో మా పాత్ర ఏమిటి? చదువుకున్న తల్లిదండ్రులకు తమ పిల్లలను పెంచటంలో తమ పాత్ర ప్రాముఖ్యత గురించి చెప్పవలసిన అవసరం లేదు. మనందరికీ తెలుసు మరియు పూర్తిగా దీన్ని అంగీకరిస్తాం. కానీ లోపాలు ఉన్న పిల్లల విషయంతో ఇది వేరేగా ఉంటుందా. విలికిడి లోపం ఉన్న పిల్లల తలిదండ్రుల పాత్ర మరింత కీలకం అని మేము నమ్ముతాము. మరిన్ని వివరాలకు 'విలికిడి లోపం ఉన్న పిల్లల విద్యలో తల్లిదండ్రుల పాత్ర' పై క్లిక్కు చేయండి. ఒక వినికిడి లోపాలు ఉన్న పిల్లలకు తల్లిదండ్రులు, నిపుణులు మరియు కమ్యూనిటీ సకారాత్మక మరియు యింటరాక్టివుగా ఉంటే ఎక్కువ విజయాలను సాధించింనట్టు కింది రేఖాచిత్రం మీకు పరిచయం చేస్తుంది. తలిదండ్రులుగా, మీరు ఒక చేతితో సమాజాన్ని ఇంకో చేతితో ఇతర నిపుణుల సహకారం తీసుకోవలసి ఉంటుంది. నా బిడ్డ చదువు విజయవంతంగా కోనసాగడానికి నేను ఏమి చెయ్యాలి? తల్లిదండ్రులు సానుకూలంగా వారి పాత్ర పోషించాలనటం తేలిక కాని ఖచ్చితంగా దాని అర్థం ఏమిటి? తల్లిదండ్రులు ఇంట్లో శిక్షణ నాణ్యతను మెరుగుపర్చడానికి నిర్దిష్ట చిట్కాలు కింది ఇవ్వబడ్డాయి: క్రమానుగతంగా ఇచ్చిన అభ్యాసాలు పూర్తి అయ్యేల చూడండి. వీటిలో వినికిడి అభ్యాసాలు కూడా ఉండవచ్చు. వినికిడి యత్రం అభ్యాసాలు మానసికపరమైన అభ్యాసాలు మాటల అభివృద్ధి అభ్యాసాలు భాష అభివృద్ధి అభ్యాసాలు విద్యా విజయాలు మొ. అభ్యాసాలు పూర్తిగా బాగా అభ్యాసాల ఫలితాలను తెలుసుకొండి. తలిదండ్రులు వాటిని అర్ధవంతంగా ఉపయోగించు కొనే వరకు అభ్యాసాల నివేదికలు కేవలం కాగితాలు మాత్రమే. ప్రారంభంలో తల్లిదండ్రులకు సాంకేతిక నివేదికలు చదవడానికి సంకోచం కలిగవచ్చు, కానీ అది మీ పిల్లలకు సంబంధించింది కావున మీకు అర్థం కానిది ఏదీ లేదు. నిపుణులతో మాట్లాడి వివరణను అభ్యర్థించవచ్చు - నిజనికి దానికోసం డిమాండు చేయండి. మీరు దానిని తెలుసుకుంటేనే ఇంటి వద్ద శిక్షణ మంచి ఫలితాలను ఇస్తుంది. మీకు వీలయినంత సమాచారాన్ని సేకరించడానికి ప్రయత్నించండి. సరైన విద్యా ప్లేస్మెంట్ పూర్తి చేయండి. మరిన్ని వివరాలకు 'అందుబాటులో విద్యా కార్యక్రమాలు' పై క్లిక్కు చేయండి. ఏఇంటికి శిక్షణ, ఏట్యూషన్ , ఏచికిత్స పాఠశాల ప్లేస్మొంటును భర్తీచేయలేవు అని గుర్తుంచుకో. సమర్థవంతమైన ఇంటి శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించండి. ఇంటి శిక్షణా కార్యక్రమం రెండు రకాలుగా ఉంటుంది. గృహ వాతావరణాన్ని ఉపయోగకరంగా మలచటం. దీని కోసం మీరు నిర్దిష్ట సమయం కేటాయించవలసిన అవసరం లేదు. కానీ మీ రోజువారీ కార్యకలాపాలు మీ పిల్లల అవసరాలకు తగ్గట్టుగా శ్రద్ధ వహించి మార్చుకోవలసి ఉంటుంది. ఉదాహరణకు, ఒక వినికిడి లోపాలు పిల్లలు ఇతర పిల్లల కంటే పది రెట్లు ఎక్కువగా మాట్లాడవలసి ఉంటుంది. మీరు మరియు మీ భర్త /భార్య వారికి ఈ ఎక్కువ సమయం ఇవ్వగలరా? మీరు మీ దినచర్య నుండి మాట్లాడటానికి వేరుగా సమయం కేటాయించాలంటే, ఇది సాధ్యం కాదు. కానీ మీరు ఇంట్లో మీ దైనందిన విధులప్పుడు మీ పిల్లలను కలుపుకొండి. అతనికి/ఆమెను చూడనివ్వండి, ముట్టుకోనివ్వండి, అనుభూతి పొందనీయండి, వాసన తెలుసుకో నివ్వండి. అతనికి/ఆమెను మీ దిన చర్యలలో భాగంకానివ్వండి. ఈసమయంలో వారితో మాట్లాడండి. పిల్లలతో మాట్లాడటం కోసం ఉపయోగించ గలిగే తగిన ఇంటి పనులు ఏమిటి? వంట పనులు అసలు వంట డైనింగు టేబులు భోజనం సర్దటం మరియు దానిని శుభ్రపరచటం బట్టలు మడత పెట్టడం, బెడ్ షీట్లు మార్చటం పాత వార్తా పత్రికలను మరియు పత్రికలు దూరంగా ఉంచడం అలమారాలు సర్దటం సామానులు తుడవటం మొక్కలు నీరు పెట్టడం రోజువారీ ఆరాధన మార్కెటు జాబితాను తయారు చేయటం చిన్న కొనుగోళ్లు, మొదలైనవి ఈ జాబితా ఎప్పుడూ ముగిసిపోదు. బిడ్డ మాట్లాడటానికి ఉపయోగపడేదానిని ఏదైనా మీరు జాబితాలో చేర్చవచ్చు. ఇంటివద్ద శిక్షణకు కేటాయించిన నిర్దిష్ట సమయం. సాధారణ చర్యల ద్వారా మీ పిల్లలతో మాట్లాడటం ముఖ్యమైనవే కానీ అవి సరిపోవు. మీరు మీ పిల్లలతో గడపటానికి రోజు కొంత సమయం కేటాయించాలి. ఈ సమయంలో మీరు మీ పిల్లలకు వ్యక్తిగత శ్రద్ధ చూపించాలి. ఈ సమయాన్ని కిందివాటిని ఉపయోగించండి. చదివే కార్యకలాపాలు వినికిడి శిక్షణ అధ్యయనాలు భాషకు సంబంధిచిన ఆటలు స్క్రాప్ పుస్తకం తయారు వార్తాపత్రిక, పత్రికలు మొదలైనవి చదవడం మీ సమయం మరియు కార్యకలాపాల ప్రాధాన్యత. మీరు ఇంటిలో మరియు వెలుపల మీ బాధ్యతలతో ప్రధానంగా బిజీగా ఉంటారు. కనుక మీరు మీ పిల్లల కోసం సమయం కేటాయించటం కష్టం. కానీ అది ముఖ్యమైనది. మీరు తల్లి లేదా తండ్రీ కావచ్చు, మీరు మీ బిడ్డకు కనీసం ఒక గంట సమయం కేటాయించాలి. ఇది భోజనం, స్నానం చేయడం, మొదలైన సమయాలు కాకుండా ఇవ్వాలి. దీని కోసం మీ రోజువారీ పనులను స్థిర పరుచుకోవాలి. ముఖ్యమైన మరియు అవసరమైన కార్యకలాపాలను మీ రోజువారీలో తప్పనిసరి భాగం కావాలి. వంట లేదా మీ ఉద్యోగానికి వెళ్లటం లాగా - మీ పిల్లల కోసం నిర్దిష్ట మరియు ప్రత్యేక సమయం మీ దినచర్యలో భాగంగా ఉండాలి. దీనిని అర్థంచేసుకుంటే మీరు సమయం కేటాయించగలరు. ఏ విధంగా వినికిడి లోపాల పిల్లలను కలిగి ఉండటం చదువుకు సంబంధించి భిన్నంగా ఉంటుంది? తల్లిదండ్రులకు వినికిడి లోపం వలన కలిగే అభివృద్ధి నష్టాల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. శారీరకంగా చెవుడు వలన కేవలం వినపడదు. కానీ వినికిడి లోపం గుడ్డితనం లాగా సూటిగా సులభమైనది కాదు. వినికిడి తప్పని సరిగా మాట్లాడటంతో (మనం చెవులతో విని మాట్లాడటం నేర్చుకుంటాము) ముడిపడి ఉంటుంది. అందువలన వినికిడి లోపం ప్రాధమికంగా కమ్యూనికేషన్ నైపుణ్యాల మీద ముఖ్యంగా భాష మీద ప్రభావాన్ని చూపుతుంది. అస్సలు చెవులు విన పడని పిల్లలు చెవులు నినపడే పిల్లలలాగా స్వయంచాలకంగా మరియు వేగంగా భాషను నేర్చుకోలేరు. వినికిడి లోపాలు లేని పిల్లలు బాల్యం లోనే భాషను నేర్చుకుంటారు కాబట్టి వారు పాఠశాల చేరి తక్షణమే సాధారణ విద్య నేర్చుకుంటారు. భాష నేర్చుకోలేక పోవటం అనేదే జీవితంలో చాలా ఇతర సమస్యలను సృష్టిస్తుంది. దీని వలన నినికిడి లోపం వినికిడి అంగవైకల్యంగా మారుతుంది. సరిగా రాని భాష మానవ అభివృద్ధికి సంబంధించిన అన్ని అంశాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. మేధస్సు, విద్యా, సామాజిక, వ్యక్తిగత, మానసిక మరియు వృత్తి అభివృద్ధి ఇందులో ఉండవచ్చు. భారతదేశంలో ఉన్నసేవల నెట్వర్క్ తక్కువ మరియు సమాజంలో అవగాహన తక్కువ. దీని వలన వినికిడి లోపం ఉన్నవారి కుటుంబ జీవితం, వ్యక్తుల మధ్య సంబంధాలు, వినోదాలు మొదలైనవి ప్రభావితం అవుతాయి. తలిదండ్రులుగా, మీరు వినికిడి లోపాన్ని వినికిడి అంగవైకల్యంగా మారకూండా నిరోధించడానికి తప్పక ప్రయత్నించండి. ఎల్లపుడూ గుర్తుంచుకొండి. వినికిడి లోపం భాషాభివృద్ధిపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. వినికిడిలోపం వలన సరిగారాని భాషా నైపుణ్యాలు ప్రతికూల మానవ చర్యలు వివిధ కోణాలలో ప్రభావితం చేయడం ద్వారా వినికిడి అంగవైకల్యంగా మారతుంది. తలిదండ్రులు, ప్రొఫెషనల్ మరియు కమ్యూనిటీ కలిసి వినికిడి నష్టం ప్రభావాన్ని తగ్గించడానికి సహాయపడుతారు. ఇది చాలా కష్టం కానీ అసాధ్యం కాదు. వయస్సుకు తగిన భాషా అభివృద్ధి భరోసా అన్ని సమస్యలకు కీ. మూలం: ఆలీ యావర్ జంగ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ హియరింగ్ హ్యాండిక్యాప్డ్