భారతదేశ రాజ్యాంగంలో గల 21ఎ, 24, 39 నిబంధనలలోని ఆదేశ సూత్రాలు, రాష్ట్ర కార్యాచరణ విధానంలోని ఒప్పందాలను నెరవేర్చడంలో గల బాలల ఉద్దరణ బాధ్యతను నిర్వహిస్తాయి. 21ఎ నిబంధన: విద్యాహక్కు న్యాయ పరంగా అందించవలసిన ప్రాధమిక హక్కుగా గల నిర్బంధ విద్యాహక్కును 6 నుండి 14 సం||ల లోపు బాలలందరికి ఉచితంగా అందించడం. 24వ నిబంధన: కార్మాగారాలు, ఇతర ప్రమాదకర చోట్ల పిల్లలను పనిలో పెట్టుకోవడం నిషేదం 14 ఏలోళ్ళలోపు బాలలెవ్వరినీ కార్మాగారాలలోను, గనులలో ఇతర ప్రమాదకర పనులలో పెట్టుకోకూడదు. 39వ నిబంధన: బాలల రక్షణ కొరకు రాష్ట్రం కల్పించే ముఖ్య కార్యచరణ విధానం స్త్రీలు, పురుషులు లేత వయస్సులోగల పిల్లల యొక్క ఆరోగ్యానికి సరిపడని, శక్తికి తగని పనులలో పెట్టుకోరాదు. దూషించడం చేయరాదు.ఆర్ధిక అవసరాలను అవకాశంగా తీసుకొని బలవంతంగా సరిపడని వృత్తులలో పని చేయించరాదు. ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు