1 మధ్యాహ్న భోజన పథకం ముఖ్య ఉద్దేశం ఏమిటి? జవాబు: హాజరు పెంచడంతోపాటు, పౌష్టికాహారాన్ని అందించడం 2 'సాక్షర భారత్' అనేది- జవాబు వయోజన విద్యా కార్యక్రమం 3 'బడిబాట' కార్యక్రమం ఉద్దేశం ఏమిటి? జవాబు 6 - 8 ఏళ్ల బడి ఈడు పిల్లలను బడిలో చేర్పించడం 4 విద్య అంతిమ లక్ష్యం ఏమిటి? జవాబు విద్యార్థి సర్వతోముఖాభివృద్ధి 5 విద్యాకమిటీలో తల్లిదండ్రుల పాత్ర ఏమిటి? జవాబు పాఠశాల నిర్వహణ 6 సార్వజనీన ప్రాథమిక విద్యా సాధనకు మార్గం జవాబు పాఠశాలలను అందుబాటులో ఉంచడం, సార్వత్రిక నమోదు, నమోదైన పిల్లల కొనసాగింపు 7 ప్రాథమిక స్థాయిలో పిల్లల గైర్హాజరుకు కారణం జవాబు చదువుకు నిత్యజీవితానికి సంబంధం లేకపోవడం 8 ప్రాథమిక పాఠశాలలో అవలంభిస్తున్న బోధనాపద్ధతి ఏది? జవాబు కృత్యాధార పద్ధతి 9 విద్యాహక్కు చట్టం - 2009 ప్రకారం ఉపాధ్యాయుడి విధి జవాబు సామర్థ్యాల ఆధారంగా బోధన 10 విద్యతోపాటు వృత్తిపరమైన శిక్షణను అందించే విద్యా కార్యక్రమం జవాబు ఎన్సీఎల్పీ 11 స్త్రీ, పురుష అక్షరాస్యత మధ్య తేడా జాతీయ వ్యత్యాసం కంటే ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో బాలికల కోసం ఏర్పాటు చేసిన పాఠశాలలేవి? జవాబు కేజీబీవీ 12 జిల్లా సాక్షరతా సమితి విద్యా కార్యక్రమంలో నియో లిటరేట్స్కు పరీక్షలు నిర్వహించేది జవాబు ఎన్.ఐ.ఒ.ఎస్ 13 ఆంధ్రప్రదేశ్లో ఎస్.ఎస్.సి.కి సమానంగా దూరవిద్యా విధానం ద్వారా విద్యనందిస్తున్న సంస్థ ఏది? జవాబు ఎ.పి.ఒ.ఎస్.ఎస్. 14 సార్వత్రిక ప్రాథమిక విద్యా సాధనకు వ్యవస్థీకరించిన, ప్రస్తుతం అమల్లో ఉన్న కార్యక్రమం ఏది? జవాబు ఎస్.ఎస్.సి 15 ప్రాథమిక విద్యాభివృద్ధికి పాఠశాలల్లో వసతులను పెంపొందించడానికి అమలు చేసిన విద్యా కార్యక్రమం జవాబు నల్లబల్ల పథకం 16 ప్రాథమిక విద్య తరగతి గది నిర్వహణలో వినూత్న మార్పుల కోసం అమలు చేసిన విద్యా కార్యక్రమం ఏది? జవాబు ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక విద్యా పథకం 17 'అందరూ చదవాలి - అందరూ ఎదగాలి' ఏ పథకం నినాదం? జవాబు సర్వ శిక్షా అభియాన్ 18 బాలల హక్కులు జవాబు జీవించే హక్కు, అభివృద్ధి చెందే హక్కు, రక్షణ హక్కు వ్యాసం: వందనం మద్దు