ఉపాధ్యాయ మిత్రులూ...- పూదత్తు కృష్ణమోహన్ పల్లవి: (ఉపాధ్యాయ మిత్రులూ... వెలుగు పంచుదివ్వెలూ... విజ్ఞానం పంచిపెట్టు - ధీరపుణ్య చరితులూ...) 2 చరణం-1: అపురూపమైన బాల్యానికి - ఆకృతినీ కల్పించీ మట్టి ముద్దలన్నిటినీ మూర్తులుగా మలచునట్టి ||ఉ|| చరణం-2: ఆటలతో పాటలతో - అందమైన మాటలతో అవగాహన కలిగించే అనేక కృత్యాలతో... ||ఉ|| చరణం-3: క్రమశిక్షణ నేర్పిస్తూ - విలువల వికసింపజేస్తే బాలలలనూ అందరికీ - ఉత్తమ పౌరులుగా మార్చు ||ఉ|| చరణం-4: చిరునవ్వులు చిందిస్తూ - ఉత్తేజం కలిగిస్తూ లక్ష్యాలను సాధిస్తూ - ప్రవర్తనను మార్చేస్తూ ||ఉ|| చరణం-5: డాక్టరైన యాక్టరైన - పొలిటికల్ లీడరైన అందరినీ తీర్చిదిద్దు - భావినిర్మాతలూ... ||ఉ|| వాచకవైభవం - కటుకోజ్వల మనోహరాచారి పల్లవి : తెలంగాణ వెలుగులతో తేజరిల్లె వాచకాలు గలంయెత్తి పాడుకునే జనజీవన గీతికలు మన తెలుగుల మధురిమతో... జన పదముల జిలుగులతో... మన సంస్కృతి మన సాహితి మన చరిత్ర వేదికలై... || తెలంగాణ || తెలుగంటే తెలంగాణ యాస బాస కాదా? తేనెలొలుకు తెలుగు భాష తెలంగాణ కాదా...? జనపదాన ఉద్భవించి పదపదాన విస్తరించి జనం గళం జయగళమౌ తెలంగాణ జానపదం || తెలంగాణ || సమైఖ్యాన మరుగున పడిపోయిన మన చరిత్రలు స్వరాష్ట్రాన వెలుగులోకి తేవడమొక సంకల్పం... మన కవులు... మన ప్రముఖులు... మన భాషకు పట్టమొచ్చి ఘన చరితను గన్నవి ఈ నవవసంత, సింగిడీలు... || తెలంగాణ || భాగవతము పండించిన పోతన వెలసిన క్షేత్రం దేశీయత కురిపించిన పాల్కురికిది ఈ ప్రాంతం అగ్నిదార రుద్రవీణ కురిపించిన ధాశరధీ... కాళోజీ సినారెల కవన ఘనత మన చరిత... || తెలంగాణ || తెలంగాణ పద సంపద తెలంగాణ పలుకుబళ్లు... తెలంగాణ సామెతలతో వెలుగు నింపుకున్న భాష తేనెవంటి తెలుగు భాష తెలంగాణ జనుల శ్వాస కలగలిపిన కరదీపం... మన ఈ వాచక రూపం... || తెలంగాణ || ఆధారము : సమగ్ర శిక్ష అభియాన్,వృత్యంతర శిక్షణ కార్యక్రమము 2018 -19 యస్ ఇ ఆర్ టి ,హైదరాబాద్