ప్రారంభ & ప్రవేశ వారాలు-4 పిల్లలు ఏమి నేర్చుకుంటారు కృత్యం పేరు: "బంతి వేద్దాం గేయం "గుమ్మాడమ్మా గుమ్మాడి పిల్లలు ఒక వలయం (వృత్తం)గా కూర్చుంటారు. ఒక్కరు చిన్న జబంతిని సాఫ్ట్ బాల్) తీసుకొని గేయం చెబుతూ ఎదుటి వారికిస్తారు. బంతి తీసుకున్న పిల్లవాడు కూడా ఒక చిన్న గేయం లేదా మాట చెబుతూ మళ్లీ ఇంకొకరికి ఇస్తాడు. ఇలా అందరూ ఒకరి తరువాతొకరు పాల్గొంటూ ఆట సాగుతుంది. నియమాలతో ఆట - "మనం పెట్టిన నియమాలు" చిన్న గుంపులో ఆట ఉదా: బంతి ఆట ప్రారంభించే ముందు, పిల్లలతో కలిసి రెండు నియమాలు నిర్ణయించాలి (ఉదా: బంతిని పక్కన ఉన్నవారికి ఇవ్వాలి. ఎవరి మీదకి విసరకూడదు). ఆట ముగిసిన తర్వాత. AWW పిల్లలతో చిన్న చర్చ జరిపి, "ఎవరు నియమాలు పాటించారు?", "ఎవరికి సహాయం అవసరమైంది?", "ఎవరు సహాయపడ్డారు?" వంటి ప్రశ్నలు వేయాలి. కృత్యం : "నేను వింటాను నువ్వు చెప్పు!" పిల్లలను జంటలుగా చేయాలి . ఒక పిల్లవాడు తన ఇష్టమైన బొమ్మ లేదా ఫలం గురించి ఒక వాక్యం చెప్పాలి. జతలో ఉన్న పిల్లవాడు "నేను విన్నాను నువ్వు బొమ్మ గురించి చెప్పావు" అని పునరావృతం చేయాలి. AWW పిల్లలను శ్రద్ధగా విందామని ప్రోత్సహించాలి. ప్రతి చిన్న ప్రయత్నాన్ని మెచ్చుకొని అభినందించాలి. కృత్యం: చిన్నారుల ప్రదర్శన వేళా పిల్లలు నేర్చుకున్న పాట, కథ, గీతం, పదం లేదా బొమ్ములు చిత్రించిన పనులను ఒక ప్రదర్శనగా ఏర్పాటు చేయాలి. ఒక్కొక్కరు తాము నేర్చుకున్నదాన్ని ఇతర పిల్లల ముందు చూపే అవకాశం ఇవ్వాలి. ఇతర పిల్లలు, తల్లిదండులు పేక్షకులుగా ఉండి శ్రద్ధగా గమనించాలి. ప్రతి చిన్నారి ప్రయత్నాన్ని AWW మరియు తల్లిదండ్రులు చప్పట్లు శబ్దాలతో అభినందించాలి. ప్రతిస్పందన & ముగింపు ఆట మధ్యలో విశ్రాంతి సమయం ఇవ్వాలి - పిల్లల శమ తగ్గించేందుకు. ఆట తర్వాత పిల్లలతో చర్చించాలి వారికి ఏ ఆట నచ్చింది? ఎందుకు నచ్చింది? వ్యూహాత్మక ఆలోచన పెంచేందుకు ఇది ఉపకరిస్తుంది. తల్లిదండ్రులు కూడా ఈ ఆటలో పాల్గొంటారు. చివర్లో పిల్లలు ఒక చిన్న బహుమతి/గొప్ప పేరు తల్లిదండ్రులకు ఇవ్వాలి. లక్ష్యం: బంధాన్ని బలపరచడం, సంయుక్త పాల్గొనడం, ఆనంద భరిత వాతావరణం కల్పించడం. ఆధారం: మహిళ శిశు సంక్షేమ శాఖ