అంగన్ వాడీ కేంద్రంలోని పిల్లల అభ్యసనలో 18 వారాల ప్రణాళిక ఒక కీలక భాగం. పిల్లలు అన్ని అభ్యసన ఫలితాలను సాధించేలా చూసుకోవడానికి మరియు వారి మునుపటి అభ్యసనలను బలోపేతం చేయడానికి తగినంత అవకాశం పొందడానికి ప్రతిరోజూ పేర్కొన్న అన్ని కృత్యాలను చేపట్టండి. వారం 1 పిల్లలు ఏమి నేర్చుకుంటారు. వ్యక్తిగత పరిశుభ్రతను పాటించటం. శుభ్రమైన, పద్ధతిగా ఏర్పాటు చేయబడిన తరగతి గది యొక్క అవసరాన్ని అర్థం చేసుకోవటం. విభిన్న ఆకారాలు మరియు రంగులను గుర్తించడం మరియు అన్వేషించటం. పెంపుడు జంతువులు, పక్షులు, పండ్లు & కూరగాయలను గుర్తించడం వాటి లక్షణాల గురించి తెలుసుకోవటం.. విభిన్న వ్యక్తులతో తమ పాత్రను గుర్తించి, వివరించడం & సాధారణ వస్తువులు మరియు చిత్రాలను గురించి వివరించటం. దృశ్య కళలు నిర్వహించడానికి కావలసిన పరికరాలను అన్వేషించి ఉపయోగించటం. శ్రవణ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవటం, సాధారణ ధ్వనులను గుర్తించటం, అధిక మరియు తక్కువ స్వర తేడాలను గుర్తించడం, పదాల ప్రారంభ ధ్వనులను గుర్తించడం. ఇంట్లో చేయించవలసిన కృత్యాలు ఇంటి చుట్టూ నడుస్తూ వారికి చెందిన వస్తువుల గురించి ఎవరు ఏమి కలిగి ఉన్నారు, వస్తువులను ఎక్కడ నిల్వ చేస్తారు, వస్తువులను వాటి స్థానంలో ఉంచడం ఎందుకు ముఖ్యం మొదలైనవి మాట్లాడండి.కుటుంబ చిత్రాలు చూడటం లేదా కుటుంబ సభ్యుల గురించి మాట్లాడటం, వీరే పిల్లలతో గల సంబంధం, వారితో గల ఇష్టమైన జ్ఞాపకం. మ్యాగజైన్లు, వార్త పత్రికలలోని చిత్రాలను చూడటం మరియు వివిధ రకాల కుటుంబాల గురించి మాట్లాడటం.పెద్దల పర్యవేక్షణలో, వంటగదిలో పిల్లలతో కూర్చొని లేదా కూరగాయల కొట్టు వద్దకు వెళ్ళి, వివిధ పండ్లు మరియు కూరగాయలను గుర్తించటం వాటి రంగు, రుచి మొదలైన వాటి గురించి మాట్లాడటం. ఆధారం: మహిళా శిశు సంక్షేమ శాఖ