పునశ్చరణ & పునర్పలన ప్రణాళిక వారం ఈ 4 వారాల ప్రణాళికను గత వారాలలో నేర్చుకున్న విషయాలను పునశ్చరణ చేసుకోవడానికి, పునర్బలనం చేయడానికి మరియు అభ్యసనను బలోపేతం చేయడానికి ఉపయోగించవచ్చు. ఈ వారాలలో, కొనసాగుతున్న పరిశీలనల ఆధారంగా, అంగన్ వాడీ కార్యకర్త పిల్లలను మరింత బలోపేతం చేయటానికి అవసరమయ్యే నైపుణ్యాలపై దృష్టి పెట్టడానికి నిర్దిష్ట కృత్యాలను నిర్వహించవచ్చు. ఈ ప్రణాళికలను పోషన్ మాహ్/పోషన్ పక్వాడా వంటి నిర్దిష్ట కార్యక్రమాల సమయంలో కేంద్రంలో అభ్యసన్న కృత్యాల వ్యవధిని తగ్గించడానికి మరియు ప్రత్యామ్నాయ కృత్యాలు మరియు వేడుకలలో పాల్గొనడానికి ఉపయోగించవచ్చు. పునశ్చరణ కి పునర్బలన వారం 5 పిల్లలు ఏమి నేర్చుకుంటారు ప్రాదేశిక భావనలపై పదజాలాన్ని అర్ధం చేసుకోవడం మరియు ఉపయోగించడం. పటాలను రూపొందించడం ద్వారా మరియు మౌఖిక ఆదేశాలు ఇవ్వడం ద్వారా అవగాహనను కలిగించడం. సృజనాత్మకత మరియు వ్యక్తీకరణ మెరుగుపడటం. సామర్థ్యం, లింగం మొదలైన వాటితో సంబంధం లేకుండా, వైవిధ్యాన్ని సమ్మిళితం చేయటాన్ని అర్థం చేసుకోవడం మరియు అభినందించడం. అన్ని జీవుల పట్ల దయ మరియు సానుభూతిని వ్యక్తం చేయటం. విభిన్న పుస్తకాలను అన్వేషించాలనే ఉత్సుకత పెరుగుదల. ప్రతిరోజూ విభిన్నమైన థీమ్ ను ఎంచుకుని, పిల్లలను అనేక, వైవిధ్యమైన, ఆహ్లాదకరమైన, ఆట ఆధారిత కృత్యాలలో నిమగ్నం చేయండి. ఇంట్లో చేయించవలసిన కృత్యాలు సమానత్వం యొక్క ప్రాధాన్యత తెలియ చేయడానికి విభిన్న కృత్యాలలో పాలుపంచుకొన్న బాలురు మరియు బాలికల కథలు లేదా వీడియోలను పిల్లలకు చూపించండి. అబ్బాయిలు మరియు అమ్మాయిలు ఎలా సమానమో చర్చించండి. వారు కలిసి ఆడవచ్చు. పనులు చేయవచ్చు. వారు కోరుకున్నది ఏదైనా కావచ్చు అని పిల్లలకు తెలియచేయండి. పిల్లలను ఆ రోజు గురించి, రోజులో తమ అనుభవాల గురించి ప్రతిరోజూ అడగడం ద్వారా సంఘటనలను ఒక క్రమంలో చెప్పటం మరియు షేర్ చేసుకునే సామర్థ్యాన్ని పెంపొందించుకోవడంలో సహాయపడండి. వారు మొదట ఏమి చేశారు? ఆ తర్వాత? చివరికి? పెంపొందించుకోవడంలో సహయపడండి సాయి ప చేశారు ఆ తర్వాత మొదలైనవి. అదేవిధంగా కథలను మీతో షేర్ చేసుకోమని చెప్పండి. వివిధ పనుల యొక్క దశలగురించి మాట్లాడండి. లోపల/బయట, పైన/కింద, ఓవర్/అండర్, ముందు/వెనుక మొదలైన పదాలను ఉపయోగించి వివిధ వస్తువులను వేర్వేరు ప్రదేశాలలో ఉంచమని చెబుతూ పిల్లలతో ఆడుకోండి. ఆధారం : మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ