పునశ్చరణ & పునర్బలన వారం - 8 పిల్లలు ఏమి నేర్చుకుంటారు వివిధ వస్తువులను అన్వేషించడానికి, వాటిని గుర్తించడానికి, పోల్చడానికి మరియు వాటి మధ్య తేడాను గుర్తించడానికి, తర్కాన్ని వర్తింపజేయడానికి జాగ్రత్తగా పరిశీలన చేయడం మరియు ఇంద్రియాలను ఉపయోగించడం. అన్వేషించడానికి, ఊహించడానికి, ప్రయోగం చేయడానికి, ముగించడానికి శాస్త్రీయ స్వభావాన్ని అభివృద్ధి చేయడం. వస్తువుల సారూప్యతలు వ్యత్యాసాల ఆధారంగా క్రమబద్ధీకరించటం, పోల్చటం, వర్గీకరించటం మరియు ఆకారం, రంగు, ఆకృతి. ఉపయోగం, స్థానం వంటి మొదలైన లక్షణాలను గుర్తించడం. సాధారణ సంకేతాలు. చిహ్నాలు, లోగోలను గుర్తించటం. పునశ్చరణ వర్క్ షీట్ కీలక కృత్యాలకు మద్దతు అందిస్తాయి. ఒక్కొక్కరికి ప్రత్యేకంగా కృత్యాలను వివిధ గ్రూపులకు మారుస్తూ అన్ని కృత్యాలను అన్ని గ్రూపులకు పునరావృతం చేయడం. సహచరుల భాగస్వామ్యం వ్యక్తిగత విజయాల పరిశీలన మరియు రికార్డింగ్ ఇంట్లో చేయించవలసిన కృత్యాలు పిల్లలతో కలిసి ఊహించి చెప్పండి అనే ఆటలను ఆడండి. రంగు, ఆకారం, ఉపయోగం, స్థానం, ఆకృతి, వాసన మొదలైన వివిధ వస్తువులకు సంబంధించిన సూచనలను వంతులవారీగా ఇవ్వండి. వాటిని ఊహించమనండి. మీ పిల్లలతో కలిసి చుట్టుపక్కల ప్రాంతాలను సందర్శించండి. కిరాణా దుకాణంలోని సుపరిచితమైన లోగోలు లేదా స్టాప్ గుర్తు వంటి సంకేతాలను గుర్తించనివ్వండి. వీటిని గీయడంలో మీరు కూడా వారికి సహాయపడండి. ఇంట్లోని వస్తువులతో మార్కెట్ ఏర్పాటు చేసి, ప్రతి వస్తువుకు ధరను నిర్ణయించండి. బొమ్మ డబ్బును ఇవ్వండి మరియు వివిధ వస్తువులను కొనడానికి మరియు అమ్మడానికి పిల్లలను ప్రోత్సహించండి. ఆధారం: మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ