వారం-8 పిల్లలు ఏమి నేర్చుకుంటారు స్వతంత్రంగా చేతులు కడుక్కోవడం, వ్యక్తిగత సంరక్షణ, వస్తువులను ఉపయోగించడం మరియు బయటకి వెళ్ళినా సురక్షితంగా ఉండడం ద్వారా పరిశుభ్రతను పాటించటం. వివిధ పరిమాణాలు మరియు రంగుల ఆకృతులను సరిపోల్చడం, క్రమబద్ధీకరించడం మరియు వర్గీకరించడం; నమూనాలను గుర్తించి పునరావృతం చేయడం. పదజాలాన్ని తయారుచేసి ఉపయోగించడం, ఋతువులు, రవాణా, ఆకాశం, రోజువారీ దినచర్య మొదలైన అంశాలను అర్థం చేసుకోవడం. సాధారణ వస్తువులను వారంతట వారే గుర్తించి వివరించటం, రోజువారీ అనుభవాలను వివరించటం. మట్టి లేదా పిండి వంటి పదార్థాలను చుట్టడం మరియు ఒత్తడం ద్వారా త్రిమితీయ (30) ఆకృతులను తయారు చేయడం మరియు బ్లాక్లు, స్టెన్సిల్స్, దొరికిన వస్తువులు మరియు సహజ పదార్థాలను ఉపయోగించి ముద్రలు వేయడం. ఇంట్లో చేయించవలసిన కృత్యాలు ఇంటి చుట్టుపక్కల ఉన్న వివిధ టెక్స్చర్ వస్తువులను (మృదువైన బట్టలు, గరుకు ఉపరితలాలు, మృదువైన వస్తువులు) సేకరించి ప్రదర్శించండి. పిల్లల కళ్ళకు గంతలు కట్టి, ప్రతి వస్తువును అనుభూతి చెందనివ్వండి, వస్తువును ఊహించి టెక్స్చర్ గుర్తించండి. రోజువారీ ఉపయోగించే వస్తువులను ఉపయోగించడం చిన్న సమూహాలుగా చేసి, భిన్నమైనదాన్ని గుర్తించి, ఎంపికకు కారణాన్ని తెలియచేయమని పిల్లలను ప్రోత్సహించండి. 2 స్పూన్లు & 1 గిన్నె, 2 ఎరుపు 1 ఆకుపచ్చ కూరగాయలు, 3ఎరుపు రంగు వస్తువులు మరియు నలుపు వస్తువు వంటివి. కాగితం మరియు క్రియాన్స్ అందించండి. తమను, ప్రతి కుటుంబ సభ్యుడు మరియు వారి పెంపుడు జంతువును కలిగి ఉన్న కుటుంబ చిత్రాన్ని గీయమని పిల్లలను అడగండి. ఆధారం: మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ