వారం 10 పిల్లలు ఏమి నేర్చుకుంటారు వయస్సుకు తగిన సంఖ్యా పదజాలం పరిచయం అవుతుంది. సరైన క్రమంలో అర్థం చేసుకోవడం & లెక్కించడం. మాతృభాషలో ప్రాస పదాలు మరియు సాధారణ అక్షరాలను గుర్తించడం మరియు వాటిని ధ్వనులతో అనుబంధించడం. సహచరులు మరియు ఉపాధ్యాయులతో పరస్పర సంభాషణ చేయడం మరియు తెలిసిన సమాచారాన్ని కొత్త సందర్భంలో వర్తింపజేయడం. పునరావృతమయ్యేయ్యే నమూనాలను గుర్తించటం. వస్తువులు / చిత్రాలు, ఆకారాలు మొదలైన వాటి యొక్క సాధారణ నమూనాలను వివరించటం. భావోద్వేగాలను పదాలు ఈ ముఖ కవళికలతో అనుబంధించటం, సంజ్ఞలు మరియు డ్రాయింగ్లు వంటి మౌఖిక మరియు అశాబ్దిక పద్ధతుల ద్వారా భావోద్వేగాలను వ్యక్తపరచటం. తోటివారి సహాయంతో వివిధ రకాల ప్రసంగాలు, కదలికలు, ధ్వనులు మరియు దృశ్య కళలను తయారు చేయడం. ఇంట్లో చేయించవలసిన కృత్యాలు సంతోషం, విచారం, కోపం, భయం, ఆశ్చర్యం, భయాందోళన మొదలైన విభిన్న భావోద్వేగాలను చూపే ఎమోజీలు/ ముఖాలను ముఖాలను గీయడానికి పిల్లలను ప్రోత్సహించండి. భావాలను గురించి మాట్లాడటానికి మరియు పంచుకోవడానికి వీటిని ఉపయోగించండి. పిల్లలతో కలిసి వివిధ గేయాలు/పాటలు జానపదాలు పాడండి వివిధ ప్రాస పదాలను గుర్తించమని, వాటిని విన్నప్పుడు చప్పట్లు కొట్టమని వారిని ప్రోత్సహించండి. అర్ధవంతమైన అర్థంలేని పదాల ప్రాస గొలుసులను తయారు చేయడంలో ఆనందించండి. పిల్లలతో ప్రతిరోజూ ఆహారానికి సంబంధించిన ఆటలు ఆడండి. వండిన ఆహారం లేదా మీరు ఇచ్చిన వాసన, రుచి మరియు ఇతర సూచనల ఆధారంగా అందుబాటులో ఉన్న ఆహారాన్ని ఊహించమని వారిని ప్రోత్సహించండి. ఆధారం: మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ