వారం - 27 పిల్లలు ఏమి నేర్చుకుంటారు ఐదు వస్తువుల వరకు రెండు సమూహాలను మిళితం చేసి, వస్తువులను తిరిగి లెక్కించి, క్రమంలో అమర్చడం ప్రాస పదాలు మరియు అనుకరణాలను గుర్తించడం, అక్షరాలను ధ్వనులకు గుర్తించడం, కలపడం మరియు తెలిసిన సమాచారాన్ని కొత్త సందర్భంలో వర్తింపజేయడం. సంఘటనల క్రమాన్ని అర్థం చేసుకుని. దానిని వ్యక్తీకరించడానికి పదజాలాన్ని ఉపయోగించడం. వివిధ జంతువుల జీవిత చక్రాన్ని అర్థం చేసుకోవడం. భావోద్వేగాలను పదాలు, ముఖ కవళికలు, శరీర ప్రతిచర్యలు మరియు వాటిని నిర్వహించడానికి వ్యూహాలను అభ్యసించటం. భద్రత & సమ్మిళితాన్ని చురుకుగా అభ్యసించుట. పదజాలం, దిశలు మరియు స్థానాల అవగాహనను అభివృద్ధి చేసుకొనుట. ముద్రలను తయారు చేయడానికి, దృశ్య కళను రూపొందించడానికి వివిధ పదార్థాలను అన్వేషించి ఉపయోగించుట. ఇంట్లో చేయించవలసిన కృత్యాలు ఇంటి వస్తువులను ఉపయోగించి పిల్లలతో సంఖ్య మరియు లెక్కింపు ఆటలు ఆడండి. లెక్కించబడిన వస్తువుల సేకరణ నుండి ఇవ్వండి & తీసుకోండి. సేకరణ నుండి వస్తువులను ఇచ్చిన తర్వాత తీసుకున్న తర్వాత మిగిలి ఉన్న వాటిని లెక్కించమని వారిని ప్రోత్సహించండి. మీ పిల్లల, మీ మరియు ఇతర కుటుంబ సభ్యుల పాత ఛాయాచిత్రాలను వెలికి తీయండి. ప్రతి ఒక్కరూ వేర్వేరు దశలలో ఎలా కనిపిస్తారో మాట్లాడండి. వారి వయస్సును అంచనా వేయండి. వయస్సుతో మానవ శరీరం ఎలా మారుతుందో అర్థం చేసుకోవడానికి వార్తాపత్రికలు పాత పుస్తకాలలోని చిత్రాలను చూడండి. పిల్లలతో కలిసి ఊహించి చెప్పండి అనే ఆటలను ఆడండి. రంగు, ఆకారం, ఉపయోగం, స్థానం, ఆకృతి, వాాసన మొదలైన వివిధ వస్తువులకు సంబంధించిన సూచనలను వంతులవారీగా ఇవ్వండి. వాటి ద్వారా ఊహించమనండి. ఆధారం: మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ