వారం - 28 పిల్లలు ఏమి నేర్చుకుంటారు ఉపాధ్యాయుల మద్దతుతో ఇతర పిల్లలతో కలిసి తరగతి గది జాబ్ చార్టులు/పోస్టర్లు/నమూనాలను రూపొందించడం. సాధారణంగా సంభవించే అక్షరాలను ధ్వనులు, పదాలతో గుర్తించి అనుసంధానించడం. ఐదు వస్తువుల వరకు రెండు సమూహాలను మిళితం చేసి, మూడు స్థాయిల వరకు వస్తువులను తిరిగి లెక్కించి, అమర్చడం. సాధారణ జ్ఞాపకశక్తి మరియు సరిపోలే ఆటలను ఆడటం, ఒక వస్తువు మరొక వస్తువుపై చూపే ప్రభావాన్ని గుర్తించడం. వారి స్వంత ఆలోచనలు, సాధనాలు, పని పద్ధతులు మరి మరియు ప్రతిస్పందనలను తోటి సమూహంలో పంచుకోవడం. వారి చుట్టూ ఉన్న పరిసరాలలోని చిత్రాలు/నమూనాలలో సాధారణ వస్తువులు, ప్రజలు, చిత్రాలు, జంతువులు, పక్షుల సాధారణ వివరాలను గమనించడం మరియు వివరించడం. ఇంట్లో చేయించవలసిన కృత్యాలు మీ పిల్లలతో కలిసి ఇంటి చుట్టూ పరిసర ప్రాంతాలలో నడవండి. వివిధ వస్తువులచే ఏర్పరచబడిన నీడలను గమనించండి. వీటి గురించి మాట్లాడండి, సుద్దను ఉపయోగించి నేలపై నీడలను గుర్తించండి మరియు రోజులో వివిధ సమయాల్లో అవి ఎలా మారుతాయో పోల్చండి. మట్టి పిండితో ఆడుకునేలా పిల్లలను ప్రోత్సహించండి వారికి కావలసినది తయారు చేయనివ్వండి. మాట్లాడండి, చర్చించండి మరియు వారు తయారు చేసిన దానిని అభినందించండి. ఆకారాలు, వివిధ రకాల జంతువులు మొదలైనవాటిని గీయమని వారిని అడగండి. మీ పిల్లలతో కలిసి మీ ఇల్లు ఇరుగు పొరుగు ప్రాంత మ్యాపు రూపొందించండి. వారిని చుట్టుపక్కల తిరిగి రమ్మని, గమనించమని, ల్యాండరు / రిఫరెన్స్ పాయింట్లు వస్తువులను గురించి గీయమని ప్రోత్సహించండి. వీటిని చర్చించండి. ఆధారం: మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ