వారం - 5 పిల్లలు ఏమి నేర్చుకుంటారు ఆకారాలు, రంగులు మరియు వాటి షేడ్స్ మధ్య తేడాను గుర్తించి, పరిమాణాలు, ఆకారాలు, కొలతలు (పొడవు, ఘన పరిమాణ మరియు బరువు) ఆధారంగా వస్తువులను సరిపోల్చటం. దృశ్య కళాకృతులను రూపొందించడానికి వివిధ పదార్థాలను ఉపయోగించటం మరియు శారీరక చలన నియంత్రణను ప్రదర్శించటం. వివిధ ఆహార సమూహాల నుండి వచ్చిన వివిధ రకాల ఆహారం, విభిన్న అభిరుచులు మరియు స్పర్శ భావనల అన్వేషణ, మరియు సాధారణ స్నాక్స్ సిద్దం చేయడానికి చిత్రాలతో ఉన్న వంటకాలను అనుకరించటం. సాధారణ వస్తువులు, వ్యక్తులు, చిత్రాలను గుర్తించి వివరించడం, జంతువులు మరియు మొక్కల పట్ల దయ చూపటం. వ్యక్తిగత సంరక్షణ వస్తువులను ఉపయోగించడం, వ్యక్తిగత పరిశుభ్రతను పాటించటం, మరియు తరగతి గది పరిశుభ్రతను పాటించడం. సంఘటనల గురించి సాధారణ ప్రశ్నలకు సమాధానాలివ్వటం కాలివ్వటం మరియు మరిు యాదృచ్చిక సంబంధాలను ఏర్పరచటం. పువ్వులు, పెర్ఫ్యూమ్లు, ఆహారపదార్థాల వాసనను వేరు చేయడం మరియు ఆకారం, పొడవు, ఎత్తు మరియు బరువు ఆధారంగా వస్తువులను సమూహాలుగా విభజించడం. ఇంట్లో చేయించవలసిన కృత్యాలు దినచర్య మరియు దాని ప్రాముఖ్యత గురించి పిల్లలతో మాటాడండి. వారి స్వంత దినచర్యను గుర్తించడంలో రూపొందించడంలో వారికి సహాయపడండి. వారు దానిని కంటికి కనిపించేలా గీసి అతికించవచ్చు. ఉదా: ఉదయం దినచర్య, పరిశుభ్రత దినచర్య, రాత్రి దినచర్య, భోజన సమయ దినచర్య మొదలైనవి. వివిధ ప్రమాణాల ఆధారంగా ఇంట్లో పనిని క్రమబద్దీకరించడంలో పిల్లలను నిమగ్నం చేయండి. వారు పండ్లు కూరగాయలు, పప్పులు, పాత్రలు, బట్టలు మొదలైనవాటిని రకం / రంగు రుచి పరిమాణం / ఉపయోగం / ఎవరికి చెందినది మొదలైనవాటిని బట్టి క్రమబద్ధీకరించేలా చేయండి జాగ్రత్తగా తమ పర్యవేక్షణలో పిల్లలను ట్రాఫిక్ సిగ్నల్ క్రాసింగ్ వద్దకు తీసుకెళ్లి, ట్రాఫిక్ కదలికలు, భద్రతా నియమాలు పాటించడం, హెల్మెట్/సిట్ బెల్ట్/ ఫుట్పాత్ జిబ్రా క్రాసింగ్ మొదలైన వాటి సురక్షిత వినియోగం వంటి వాటిని గమనించడానికి మార్గనిర్దేశం చేయండి. ఆధారం: మహిళా శిశు సంక్షేమ శాఖ