ఇటివల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పిల్లల మానసికఆరోగ్యం,భద్రతకోసం16 ఏళ్లలోపు పిల్లలకు సామాజిక మాధ్యమాలను నిషేధంపై సమాలోచనలు చేస్తున్నట్లు ప్రకటించింది. సామాజిక మాధ్యమాలు- పిల్లలపై ప్రభావం ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వహించిన సర్వే ప్రకారం పిల్లలలో సామాజిక మాధ్యమాల వ్యసనం 11% శాతానికి పెరిగినట్టు నివేదించింది. సామాజిక మాధ్యమాల అధిక వినియోగం వలన మానసిక ఆందోళన, కుంగుబాటు, ఎక్కువవుతున్నాయి. రాత్రిపూట సామాజిక మాధ్యమాలను ఎక్కువగా వాడటం వలన నిద్ర తక్కువై చదువుపైనే కాకుండా ఆరోగ్యంపై కూడా ప్రభావంచూపుతుంది. పిల్లలు సామాజిక మాధ్యమాలలో హానికరమైన కంటెంట్ బారిన పడడం వలన వారి ప్రవర్తనలో మార్పులు, భయాందోళనలు మొదలవుతున్నాయి. ఇటీవల టర్కీలో అనడోలు ఏజెన్సీ (AA) నిర్వహించిన పరిశోధనలో.. సోషల్ మీడియా సంస్థలు వయస్సు పరిమితులు రక్షణ కల్పిస్తాయని చెబుతున్నప్పటికీ పిల్లలకు హింసాత్మక మరియు వయస్సుకు మించిన కంటెంట్ వారి ఫేజ్ లో వస్తున్నట్లు తేలింది. టెక్నోఫిరెన్స్ - తల్లిదండ్రులు లేదా పిల్లల పదేపదే ఫోన్లు వాడటం వల్ల వారి కుటుంబ సభ్యుల మధ్య ఎమోషనల్ బాండింగ్ ను బలహీనపరుస్తుంది. సోషల్ మీడియా పిల్లలకు నిషేధించిన దేశాలు ఇటీవల ఆస్ట్రేలియా సామాజిక మాధ్యమాలను 16 ఏళ్లలోపు పిల్లలకు వాడకంపై నిషేధించింది. అలాగే డెన్మార్క్, ప్రాన్స్, గ్రీస్ వంటి దేశాలు ఈ బాటలోనే నడుస్తున్నాయి. మన దేశంలో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఈ విధానంపై ఆలోచనలు చేస్తున్నాయి. తల్లిదండ్రులు – ప్రభుత్వ బాధ్యత తల్లిదండ్రులు పిల్లల సామాజిక మాధ్యమాల వినియోగం వాడటం పట్ల అప్రమత్తంగా ఉండాలి. పిల్లలతో పాటు జాయింట్ అకౌంట్లు సృష్టించుకోవడం మరియు స్క్రీన్ వాడే సమయంపై నియంత్రణ (పేరెంటల్ కంట్రోల్స్) అవసరం. పిల్లల ప్రైవసీ సెట్టింగ్స్ ప్రైవేట్ లో ఉండేలాచూసుకోవడం. ప్రభుత్వం పిల్లలను హానికరమైన కంటెట్ ను దూరంగా ఉంచేలా బాధ్యత తీసకోవాలి. నిరంతరం సోషల్ మీడియా సంస్థలతో కలిసి పని చేస్తూ హానికర కంటెంట్ ను తొలగించేలా కృషి చేయాలి. ప్రభుత్వం - చర్యలు డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ చట ప్రకారం 18 సంవత్సరాల లోపు డేటాను సేకరించాలంటే తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి. హానికర కంటెంటెను, పిల్లల మానసిక ఆరోగ్యంపై ప్రభావం కలిగించే డేటానుప్రాసెస్ చేయకూడదు. ITరూల్స్ 2021 ప్రకారం వేగంగాఅశ్లీల చిత్రాలు, కుటెంటను తొలగించేలా చర్యలు తీసుకుంటుంది. హలగ గ్రామం - మంచి ప్రయత్నం బెలగావి జిల్లాలో హలగ అన్ని గ్రామంలో ‘‘నో స్క్రీన్ మోడ్’’ అని సామాజిక ప్రయోగాన్ని మొదలుపెట్టారు. రాత్రి 7గంటలకు ఒక సైరన్ వినిపిస్తుంది. ఆ తర్వాత పిల్లలు చరవాణిని పక్కన పెట్టి పుస్తకాలు చదవడం, లేకపోతే స్నేహితులతో సంభాషించడం, కుటుంబ సభ్యులతో మాట్లాడటం చేస్తున్నారు. దీనివలన వారి స్క్రీన్ సమయం తగ్గడమే కాకుండా కుటుంబంతో అనుబంధం, స్నేహితులతో బంధాలు పెరగడమే కాకుండా చదువుపై ఏకాగ్రత ఎక్కువైందని గ్రామ ప్రజలు ఆనందంగా చెబుతున్నారు. సోషల్ మీడియాప్రభావం పిల్లలపై అధికంగా ఉండటం వలన వాటిపై నియంత్రణ అవసరం. ఈ మార్గంలో ప్రభుత్వాలు చట్టాలు, పాలసీలు తీసుకురావడం ఒక మంచి ముందడగు. ఆధారం: మన బడి మాస పత్రిక